Saudi Arabia: ఇకపై సౌదీలో డొమెస్టిక్ వర్కర్స్‌కు ఇ-శాలరీ విధానం తప్పనిసరి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియా ( Saudi Arabia)లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్‌కు 2026 జనవరి 1 నుంచి ఇ-శాలరీ విధానం (e-salary for domestic workers) తప్పనిసరి చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వేతన రక్షణను మెరుగుపరచడం, పారదర్శకత పెంచడం, ఉపాధి ప్రక్రియలను క్రమబద్ధీకరించడం వంటి చర్యల్లో భాగంగా అన్నిరకాల డొమెస్టిక్ వర్కర్స్‌కు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా జీతాలు పొందడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
నూతన చెల్లింపుల విధానంలో భాగంగా యజమానులు డొమెస్టిక్ వర్కర్స్‌కు నగదు రూపంలో జీతాన్ని చెల్లించడానికి బదులుగా గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా డిజిటల్ వాలెట్లను ఉపయోగించి నగదు బదిలీ చేయాలని (e-salary for domestic workers) మానవ వనరుల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ చెల్లింపు డాక్యుమెంట్ల ఆధారంగా సమయం అయిపోకముందే కార్మికుల కాంట్రాక్టులను రద్దు చేయడం, ఇతర విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకవేళ కార్మికులు ఎలక్ట్రానిక్ చెల్లింపులు వద్దంటే.. వారి జీతాలను సరైన డాక్యుమెంటేషన్‌తో నగదు లేదా చెక్కు రూపంలో చెల్లించవచ్చని పేర్కొంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 13:53 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.