SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌

Eenadu icon
By Telangana News Desk Published : 22 Dec 2025 03:33 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను త్వరలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐఆర్‌ జరగని అన్ని రాష్ట్రాల్లోనూ మూడో దశలో సర్వే ఉంటుందని వెల్లడించారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ విజయవంతమైందని, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కొనసాగుతోందని వెల్లడించారు. బిహార్‌లో జరిగిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలోనూ బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) సర్వేను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం బీఎల్‌వోలతో సీఈసీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘దేశ ఎన్నికల వ్యవస్థకు బీఎల్‌వోలే వెన్నెముక. మన దేశ ఎన్నికల వ్యవస్థ నిర్వహణను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ సర్వేను బీఎల్‌వోలు విజయవంతం చేసి దేశానికి మార్గనిర్దేశం చేశారు. అక్కడ ఎస్‌ఐఆర్‌ తర్వాత 7.5 కోట్ల మందితో ఓటర్ల జాబితాను విడుదల చేశాం. వాటిపై ఫిర్యాదులేవీ రాలేదు. అక్కడ ఎన్నికలు జరిగాక ఈవీఎంలు, వీవీప్యాట్లపై కూడా ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. రీపోలింగ్, రీకౌంటింగ్‌ అవసరం రాలేదు. 

930 మంది ఓటర్లకు ఒక బీఎల్‌వో

తెలంగాణలో సగటున 930 మంది ఓటర్లకు ఒక బీఎల్‌వో ఉంటారు. ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ చేసిన చోట్ల.. చనిపోయినవారి పేర్లు, ఒక వ్యక్తికి రెండు ఓట్ల వంటివి కనిపించాయి. ఇలాంటివి తెలంగాణలోనూ ఉండవచ్చు. ఎస్‌ఐఆర్‌ ద్వారా అలాంటి వాటిని సవరించాలి. దేశంలో రాజ్యాంగానికి అతి పెద్ద సైనికుడు బీఎల్‌వోనే. దేశంలో ఎన్నికల కోసం 1.80 కోట్ల మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఏడు దేశాల నుంచి 20 మంది ప్రతినిధులు వచ్చి బిహార్‌ ఎన్నికలను పరిశీలించారు’’ అని జ్ఞానేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బందికి సంబంధించిన అంశాలను రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో సీనియర్‌ డిప్యూటీ సీఈసీ పవన్‌కుమార్‌ శర్మ, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, రాష్ట్ర ఉప ఎన్నికల అధికారి హరిసింగ్‌ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో బీఎల్‌వోలు అడిగిన పలు ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ సమాధానాలిచ్చారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉండడానికి స్థానిక ఓటర్ల నిరాసక్తతే ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఉత్సాహంగా క్యూలో నిలబడి ఓటుహక్కును వినియోగిస్తూ దేశానికి దారి చూపుతున్నారు. దేశంలో ఎన్నికలు పూర్తిగా చట్టప్రకారమే జరుగుతున్నాయి. ఎన్నికల నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. వలస ఓటర్లు ఏదైనా ఒక ప్రాంతంలోనే ఓటింగ్‌ను కలిగి ఉండాలి. బీఎల్‌వోల గౌరవ వేతనం రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచాం. ఆధార్‌ కార్డు అనేది కేవలం ఐడెంటిటీ కార్డు మాత్రమే. ఇది దేశ పౌరసత్వాన్ని, పుట్టిన తేదీని ధ్రువీకరించే కార్డు కాదు. ఓటరు నమోదులో ఆధార్‌ కార్డు ఒక ఆప్షన్‌ మాత్రమే’’ అని సీఈసీ వివరించారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
  • యాదగిరిని నేడు హాజరుపరచండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం 10.30కు కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.