Uttam Kumar Reddy: కేసీఆర్‌ పదేళ్ల పాలనలోనే రాష్ట్రానికి అన్యాయం

Eenadu icon
By Telangana News Desk Published : 22 Dec 2025 03:34 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్ల కేసీఆర్‌ పాలనలోనే నదీ జలాల హక్కులు, నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.81 లక్షల కోట్లు ప్రాజెక్టులపై ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ కొత్తగా సాగునీరు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులకు రూ.88 వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలను, వారి పిల్లలను తాకట్టు పెట్టారని, వారు చేసిన అప్పులకు ఏటా రూ.16 వేల కోట్లు వడ్డీలు, కిస్తీలకు తమ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందంటూ దుయ్యబట్టారు. కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్‌ స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీటి రంగాన్ని ఆగం చేసినందుకు ముందుగా కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడాలన్నారు. నీటిపారుదల రంగంపై పూర్తి వివరాలను ఆధారాలతో సహా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరాకీ నీళ్లు ఇవ్వలేదు. మా ప్రభుత్వం రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. వచ్చే మూడు నెలల్లో మేం పూర్తి చేయబోతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 90 టీఎంసీలకు జీవో ఇచ్చింది. 2022 ఆగస్టు 18న కేసీఆర్‌ జారీ చేసిన జీవో ఆధారంగానే కేంద్రానికి లేఖలు రాశాం. మొదటి దశలో మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు కింద 45 టీఎంసీలకు, గోదావరి జలాల మళ్లింపు కింద మరో 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కోరాం. డీపీఆర్‌ వెనక్కు పంపడానికి మేమే కారణం అనడం అబద్ధం. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే 2023 ఏప్రిల్‌ 12న డీపీఆర్‌ వెనక్కు పంపింది. 

కమీషన్‌ వస్తుందని కాళేశ్వరం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రేమ ఉన్నట్లు కేసీఆర్‌ మాట్లాడారు. ఈ జిల్లాకు నీటిని తెచ్చే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి ఏపీలో రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్‌ చేపడితే మాకు పేరు వస్తుందని, అప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును కేసీఆర్‌ రద్దు చేశారు. ఆ ప్రాజెక్టు ఆయకట్టునే చూపి కాళేశ్వరం చేపట్టారు. కమిషన్ల కోసం చేపట్టిన దాని వ్యయం ప్రస్తుతం రూ.1.20 లక్షల కోట్లకు చేరగా మూడు బ్యారేజీలు కుంగాయి.

చుక్కనీటిపైనా హక్కులు వదులుకోం..

కృష్ణా, గోదావరిలలో చుక్కనీటిపైనా హక్కులు వదులుకోం. కృష్ణా జలాల్లో తెలంగాణకు 500 టీఎంసీలకు పట్టుపడుతున్నాం. పోలవరం- బనకచర్ల అడ్డుకున్నాం, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాం. పంట కొనుగోళ్లకు మీరు భాజపా ప్రభుత్వంతో కొట్లాడారనేది అసత్యం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాతో అలయ్‌ బలయ్‌ చేసుకుని మాపై నిందలు వేస్తున్నారా’’ అని ఉత్తమ్‌ ప్రశించారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.