పునర్విభజన.. సేవలు ఏకరీతిన

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్ నగరం శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలుపుకొని బృహత్ నగరంగా మారింది. 150 వార్డులు కాస్త 300కి పెరిగాయి. దీని వెనక శాస్త్రీయ కసరత్తు జరిగిందని అధికారులు అంటున్నారు.
సమాన ప్రాతినిధ్యం: ప్రతి వార్డులో జనాభా సుమారుగా ఉండేలా పునర్విభజన చేశారు. ఇప్పటివరకు కొన్ని వార్డుల్లో కార్పొరేటర్లు ఎక్కువ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరికొన్ని తక్కువగా ఉండేవి. ఇప్పుడు సమాన ప్రాతినిధ్యం ఏర్పడింది.
సేవలు మెరుగు:ఒక కాలనీ రెండు డివిజన్లలో ఉండేది. ప్రస్తుతం సహజ సరిహద్దులు అంటే రహదారి, నాలాలు, చెరువుల ఆధారంగా నిర్ధారించారు. ఫలితంగా సేవలు మెరుగుపడతాయి.
ప్రణాళిక సులువు: జనాభా ఆధారిత డివిజన్ల పునర్విభజనతో మౌలిక సదుపాయాల ప్రణాళిక వాస్తవికంగా ఉంటుంది. రహదారి విస్తీర్ణం, నీటి, డ్రైనేజీ సామర్థ్యం, గృహ నిర్మాణ అవసరాలను ముందుగానే అంచనా వేయవచ్చు.
విలీన ప్రాంతాల ఏకీకరణ:జీహెచ్‌ఎంసీతో సమానంగా విలీన ప్రాంతాలు ఏకరీతి సేవలు పొందుతాయి. ఐటీకారిడార్లు, ఎయిర్‌పోర్ట్ జోన్లు, ఓఆర్‌ఆర్ ప్రాంతాల్లో ఏకీకృత అభివృద్ధి సాధ్యం అవుతుంది.
ఉదాహరణకు...
- కోర్ డివిజన్లలో అమీర్‌పేట, కూకట్‌పల్లిలో వాణిజ్య, నివాస, అధిక వలసలు ఉండే ప్రాంతాలు. ఇక్కడ డివిజన్ల పునర్విభజనతో జనాభా భారాన్ని విభజిస్తుంది. మొబిలిటీ ప్రణాళిక మెరుగవుతుంది.
- ఓఆర్‌ఆర్ ప్రభావిత ప్రాంతాలైన నిజాంపేట, మణికొండ, తెల్లాపూర్‌లో ఆకాశహార్మ్యాలు, పెరుగుతున్న పౌర అవసరాలకు అనుగుణంగా డివిజన్ల విభజన ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక్కడ వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యం అవుతుందన్నారు.
- దమ్మాయిగూడలో ఎక్కువ వార్డులు ఉండేవి. ఇప్పుడు తక్కువ డివిజన్లతో పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుంది.
హైదరాబాద్‌ను మరింత సమర్థవంతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. అనియంత్రిత అభివృద్ధి తగ్గి, పర్యావరణహిత, సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తుంది. అందుకు పునర్విభజన దోహదం చేస్తుంది. ఇప్పటికీ స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించాం. ప్రజాభిప్రాయం మేరకు పలు సవరణలు చేశాం. ఒకటి రెండ్రురోజుల్లోనే తుది నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 02:53 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.