ఈఎస్‌ఎల్‌ క్రీడా సంబరానికి సై

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 22 Dec 2025 06:39 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

న్యూస్‌టుడే-విజయవాడ క్రీడలు: తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’ ప్రజెంట్స్‌ ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌’ (ఈఎస్‌ఎల్‌)-2025కు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఈఎస్‌ఎల్‌’ పండగకు సమయం ఆసన్నమైంది. వర్థమాన క్రికెటర్ల ప్రతిభకు వేదికగా నిలుస్తూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న ‘ఈనాడు క్రికెట్‌’ సోమవారం ప్రారంభం కానుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా క్రికెట్‌ మ్యాచ్‌లకు కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్‌ రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ స్కూల్‌ క్రికెట్‌ మైదానం వేదిక కానుంది. జూనియర్‌ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, సీనియర్‌ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, మెడికల్, ఫార్మా కళాశాలల జట్లు క్రికెట్‌ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. తొలుత జిల్లా స్థాయిలో మ్యాచ్‌లు జరుగుతాయి. సోమవారం జిల్లా స్థాయి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అనంతరం ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు నాకౌట్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు జరగనున్నాయి.

గ్రౌండ్‌-1

  • ఉదయం 9.00 గంటలకు యూనివర్శల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల X చలపతి ఇంజినీరింగ్‌ కళాశాల(ఎన్‌ఐటీఏ)
  • ఉదయం 11.30 గంటలకు విజ్ఞాన్‌ డిగ్రీ కళాశాల X ఈశ్వర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, నరసరావుపేట

గ్రౌండ్‌-2

  • ఉదయం 9.00 గంటలకు కేఎల్‌ యూనివర్శిటీ X ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, నరసరావుపేట
  • ఉదయం 11.30 గంటలకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల X ఎన్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల, విశదల 

వేదిక: చలపతి ఇంజినీరింగ్‌ కళాశాల (ఎన్‌ఐఏటీ)

  • 22.12.2025 (మొదటి మ్యాచ్‌) సీనియర్‌ విభాగంలో కేబీఎన్‌ డిగ్రీ కళాశాల X ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాల
  • 22.12.2025 (రెండవ మ్యాచ్‌) జూనియర్‌ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (విజయవాడ) శ్రీ ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కళాశాల

వేదిక:కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్‌ రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ స్కూల్, కానూరు.

► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 06:02 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని