ఈఎస్‌ఎల్ క్రీడా సంబరానికి సై

- A
- A+
- A++

న్యూస్‌టుడే-విజయవాడ క్రీడలు: తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్’ ప్రజెంట్స్ ‘ఈనాడు స్పోర్ట్స్ లీగ్’ (ఈఎస్‌ఎల్)-2025కు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఈఎస్‌ఎల్’ పండగకు సమయం ఆసన్నమైంది. వర్థమాన క్రికెటర్ల ప్రతిభకు వేదికగా నిలుస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న ‘ఈనాడు క్రికెట్’ సోమవారం ప్రారంభం కానుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా క్రికెట్ మ్యాచ్‌లకు కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ మైదానం వేదిక కానుంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, మెడికల్, ఫార్మా కళాశాలల జట్లు క్రికెట్ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. తొలుత జిల్లా స్థాయిలో మ్యాచ్‌లు జరుగుతాయి. సోమవారం జిల్లా స్థాయి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అనంతరం ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు జరగనున్నాయి.
గ్రౌండ్-1
- ఉదయం 9.00 గంటలకు యూనివర్శల్ ఇంజినీరింగ్ కళాశాల X చలపతి ఇంజినీరింగ్ కళాశాల(ఎన్‌ఐటీఏ)
- ఉదయం 11.30 గంటలకు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల X ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల, నరసరావుపేట
గ్రౌండ్-2
- ఉదయం 9.00 గంటలకు కేఎల్ యూనివర్శిటీ X ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కళాశాల, నరసరావుపేట
- ఉదయం 11.30 గంటలకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల X ఎన్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, విశదల
వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాల (ఎన్‌ఐఏటీ)
- 22.12.2025 (మొదటి మ్యాచ్) సీనియర్ విభాగంలో కేబీఎన్ డిగ్రీ కళాశాల X ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల
- 22.12.2025 (రెండవ మ్యాచ్) జూనియర్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (విజయవాడ) శ్రీ ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాల
వేదిక:కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్, కానూరు.



గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
English Translation
Sy for ESL sports celebration

- A
- A+
- A++

Newstoday-Vijayawada Sports: The stage is set for the 'Enadu Sports League' (ESL)-2025, which has created a new history in college sports in Telugu states, 'Dhanik Bharat Educational Institutions'. The time has come for the 'ESL' festival which aims to bring out the talents in cricket. 'Enadu Cricket', which has secured a place in the Guinness Book of Records as a platform for the talent of the current cricketers, is going to start on Monday. KCP Siddhartha Adarsh Residential Public School Cricket Ground in Kannur will be the venue for the joint Krishna district cricket matches. Teams from Inter, Polytechnic, ITI, Degree, Engineering, PG, Medical and Pharma colleges in the junior category will test their luck in the cricket tournament. First the matches will be held at the district level. District level matches will start on Monday. After that, regional level matches will be held in knockout mode. Competitions will also be held at the state level.
Ground-1
- 9.00 am Universal Engineering College X Chalapati Engineering College(NITA)
- 11.30 am Vigyan Degree College X Eshwar Engineering College, Narasa Raopet
Ground-2
- 9.00 am KL University X SSN Engineering College, Narasa Raopet
- 11.30 am Krishnaveni Degree College X NRIT Engineering College, Visadala
Venue: Chalapati Engineering College (NIAT)
- 22.12.2025 (First Match) In Senior Division KBN Degree College X Dhanekula Engineering College
- 22.12.2025 (Second Match) In Junior Division Government Polytechnic College (Vijayawada) Shri NRI Jr. College
Venue:KCP Siddhartha Adarsh Residential Public School, Kannur.



Note:Business advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.