IND w Vs SL w: ఆరంభం అదిరింది

Eenadu icon
By Sports News Desk Published : 22 Dec 2025 03:37 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాక, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన.. స్థాయికి తగ్గ ప్రదర్శనే చేసింది. సొంతగడ్డపై శ్రీలంకతో అయిదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు ఘనవిజయంతో ఆరంభించింది. ప్రపంచకప్‌లో కలిసి రాని విశాఖపట్నం వేదిక.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత అమ్మాయిలకు పూర్తి అనుకూలంగా మారింది. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేస్తే.. ప్రపంచకప్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ జెమీమా రోడ్రిగ్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ అలవోకగా విజయాన్నందుకుంది.

బంతితో, బ్యాటుతో అదరగొట్టిన భారత మహిళల జట్టు శ్రీలంకతో అయిదు టీ20ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మొదట బౌలర్లు సమష్టిగా రాణించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేయగలిగింది. ఓపెనర్‌ విష్మి గుణరత్నె (39; 43 బంతుల్లో 1×4, 1×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఆ జట్టులో ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (4-1-20-1) గొప్పగా బౌలింగ్‌ చేసింది. క్రాంతి గౌడ్, శ్రీ చరణి తలో వికెట్‌ తీశారు. అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (69 నాటౌట్‌; 44 బంతుల్లో 10×4) చెలరేగడంతో భారత్‌ 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో టీ20 కూడా విశాఖపట్నంలోనే మంగళవారం జరుగుతుంది.

అటు తడబాటు.. ఇటు ధనాధన్‌:శ్రీలంక, భారత్‌ ఇన్నింగ్స్‌లు పూర్తి భిన్నంగా సాగాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లంక.. ఆద్యంతం తడబడింది. 3 ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన కెప్టెన్‌ చమరి ఆటపట్టు (15)ను క్రాంతి బౌల్డ్‌ చేయడంతో లంక కష్టాలు మొదలయ్యాయి. ఓ ఎండ్‌లో విష్మి నిలబడ్డా.. ఆశించినంత వేగంగా ఆడలేకపోయింది. విష్మితో హసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) భాగస్వామ్యాలు నెలకొల్పినప్పటికీ.. వీళ్లిద్దరూ కూడా వేగంగా ఆడలేకపోయారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుంటే.. ఫీల్డర్లూ రాణించడంతో లంక పరుగుల కోసం చెమటోడ్చక తప్పలేదు. ఇన్నింగ్స్‌ ముందుకు సాగేకొద్దీ లంక కష్టాలు పెరిగాయి. చివరి ఓవర్లలోనూ స్కోరు వేగం పెరగలేదు. అనంతరం ఛేదనలో బంతికో పరుగు చొప్పున చేయాల్సిన భారత్‌.. ఆరంభంలోనే షెఫాలి (9) వికెట్‌ కోల్పోయినప్పటికీ, ఇబ్బంది పడలేదు. జెమీమా వచ్చీ రాగానే బ్యాటుకు పని చెప్పింది. అలవోకగా బౌండరీలు బాదింది. స్మృతి మంధాన (25; 25 బంతుల్లో 4×4)తో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించిన ఆమె.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (15 నాటౌట్‌)తో అభేద్యమైన మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టుకు తిరుగులేని విజయాన్నందించింది. భారత్‌ 32 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డు నెలకొల్పింది. మహిళల్లో సుజీ బేట్స్‌ (4,716, న్యూజిలాండ్‌) తర్వాత ఈ క్లబ్బులో అడుగు పెట్టిన క్రికెటర్‌ స్మృతినే.  

శ్రీలంక ఇన్నింగ్స్‌:విష్మి రనౌట్‌ 39; చమరి (బి) క్రాంతి 15; హాసిని పెరీరా (సి) క్రాంతి (బి) దీప్తి 20; హర్షిత (బి) శ్రీ చరణి 21; నీలాక్షిక రనౌట్‌ 8; కవిష రనౌట్‌ 6; కౌషిని నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం:(20 ఓవర్లలో 6 వికెట్లకు) 121; వికెట్ల పతనం:1-18, 2-49, 3-87, 4-103, 5-108, 6-121; బౌలింగ్‌:క్రాంతి 3-0-23-1; అరుంధతి 4-0-23-0; దీప్తి 4-1-20-1; వైష్ణవి 4-0-16-0; శ్రీ చరణి 4-0-30-1; అమన్‌జ్యోత్‌ 1-0-8-0

భారత్‌ ఇన్నింగ్స్‌:స్మృతి (సి) నీలాక్షిక (బి) ఇనోక 25; షెఫాలి (సి) గింహని (బి) కావ్య 9; జెమీమా నాటౌట్‌ 69; హర్మన్‌ప్రీత్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం:(14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 122; వికెట్ల పతనం:1-13, 2-67; బౌలింగ్‌:మల్కి 2-0-19-0; కావ్య 3-0-20-1; చమరి 2-0-16-0; షషిని 2-0-32-0; ఇనోక 3.4-0-17-1; కవిష 2-0-18-0

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.