IND w Vs SL w: ఆరంభం అదిరింది

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాక, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ సేన.. స్థాయికి తగ్గ ప్రదర్శనే చేసింది. సొంతగడ్డపై శ్రీలంకతో అయిదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు ఘనవిజయంతో ఆరంభించింది. ప్రపంచకప్‌లో కలిసి రాని విశాఖపట్నం వేదిక.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత అమ్మాయిలకు పూర్తి అనుకూలంగా మారింది. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేస్తే.. ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగిస్తూ జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ అలవోకగా విజయాన్నందుకుంది.
బంతితో, బ్యాటుతో అదరగొట్టిన భారత మహిళల జట్టు శ్రీలంకతో అయిదు టీ20ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మొదట బౌలర్లు సమష్టిగా రాణించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ విష్మి గుణరత్నె (39; 43 బంతుల్లో 1×4, 1×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఆ జట్టులో ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (4-1-20-1) గొప్పగా బౌలింగ్ చేసింది. క్రాంతి గౌడ్, శ్రీ చరణి తలో వికెట్ తీశారు. అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్; 44 బంతుల్లో 10×4) చెలరేగడంతో భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో టీ20 కూడా విశాఖపట్నంలోనే మంగళవారం జరుగుతుంది.
అటు తడబాటు.. ఇటు ధనాధన్:శ్రీలంక, భారత్ ఇన్నింగ్స్‌లు పూర్తి భిన్నంగా సాగాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక.. ఆద్యంతం తడబడింది. 3 ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన కెప్టెన్ చమరి ఆటపట్టు (15)ను క్రాంతి బౌల్డ్ చేయడంతో లంక కష్టాలు మొదలయ్యాయి. ఓ ఎండ్‌లో విష్మి నిలబడ్డా.. ఆశించినంత వేగంగా ఆడలేకపోయింది. విష్మితో హసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) భాగస్వామ్యాలు నెలకొల్పినప్పటికీ.. వీళ్లిద్దరూ కూడా వేగంగా ఆడలేకపోయారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే.. ఫీల్డర్లూ రాణించడంతో లంక పరుగుల కోసం చెమటోడ్చక తప్పలేదు. ఇన్నింగ్స్ ముందుకు సాగేకొద్దీ లంక కష్టాలు పెరిగాయి. చివరి ఓవర్లలోనూ స్కోరు వేగం పెరగలేదు. అనంతరం ఛేదనలో బంతికో పరుగు చొప్పున చేయాల్సిన భారత్.. ఆరంభంలోనే షెఫాలి (9) వికెట్ కోల్పోయినప్పటికీ, ఇబ్బంది పడలేదు. జెమీమా వచ్చీ రాగానే బ్యాటుకు పని చెప్పింది. అలవోకగా బౌండరీలు బాదింది. స్మృతి మంధాన (25; 25 బంతుల్లో 4×4)తో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించిన ఆమె.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (15 నాటౌట్)తో అభేద్యమైన మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టుకు తిరుగులేని విజయాన్నందించింది. భారత్ 32 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డు నెలకొల్పింది. మహిళల్లో సుజీ బేట్స్ (4,716, న్యూజిలాండ్) తర్వాత ఈ క్లబ్బులో అడుగు పెట్టిన క్రికెటర్ స్మృతినే.
శ్రీలంక ఇన్నింగ్స్:విష్మి రనౌట్ 39; చమరి (బి) క్రాంతి 15; హాసిని పెరీరా (సి) క్రాంతి (బి) దీప్తి 20; హర్షిత (బి) శ్రీ చరణి 21; నీలాక్షిక రనౌట్ 8; కవిష రనౌట్ 6; కౌషిని నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం:(20 ఓవర్లలో 6 వికెట్లకు) 121; వికెట్ల పతనం:1-18, 2-49, 3-87, 4-103, 5-108, 6-121; బౌలింగ్:క్రాంతి 3-0-23-1; అరుంధతి 4-0-23-0; దీప్తి 4-1-20-1; వైష్ణవి 4-0-16-0; శ్రీ చరణి 4-0-30-1; అమన్‌జ్యోత్ 1-0-8-0
భారత్ ఇన్నింగ్స్:స్మృతి (సి) నీలాక్షిక (బి) ఇనోక 25; షెఫాలి (సి) గింహని (బి) కావ్య 9; జెమీమా నాటౌట్ 69; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం:(14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 122; వికెట్ల పతనం:1-13, 2-67; బౌలింగ్:మల్కి 2-0-19-0; కావ్య 3-0-20-1; చమరి 2-0-16-0; షషిని 2-0-32-0; ఇనోక 3.4-0-17-1; కవిష 2-0-18-0
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
English Translation
IND w Vs SL w: The start is over

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

After becoming the world champion in one day, he entered the ring amid huge expectations. In the first series, Harmanpreet Sena performed below the level. The Indian team started the five T20I series against Sri Lanka on home soil with a great victory. The venue of Visakhapatnam, which did not come together in the World Cup, was completely in favor of the Indian girls in this match. If the bowlers put their eyes on the opponent with tight bowling... Jemima Rodrigues continued her World Cup form and India got a resounding victory as she played a brilliant innings. In the first match, they defeated the opponent by 8 wickets. First the bowlers performed well and Sri Lanka managed to score 121 runs for the loss of 6 wickets in 20 overs. Opener Vishmi Gunaratne (39; 1×4, 1×6 off 43 balls) was the only notable score. Three batters were run out in that team. Among the Indian bowlers, Deepti Sharma (4-1-20-1) bowled brilliantly. Kranti Goud and Sri Charani took wickets. After that, 'Player of the Match' Jemima Rodrigues (69 not out; 10x4 off 44 balls) exploded and India chased down the target losing only 2 wickets in 14.4 overs. The second T20 will be held on Tuesday in Visakhapatnam. Lanka, who lost the toss and batted, faltered throughout. Lanka's troubles started when Kranti bowled captain Chamari Atapattu (15), who was in a swing after hitting 3 fours. Vishmi stands at one end.. Couldn't play as fast as expected. Hasini Pereira (20) and Harshita Samaravikrama (21) formed partnerships with Vishmi, but neither of them could play fast. If the bowlers are bowling strictly, the fielders are also doing well, so Lanka has to sweat for runs. Lanka's woes increased as the innings progressed. The speed of the score did not increase in the last overs. After that, India had to run at a rate of one run per ball in the break.. Although Shefali (9) lost his wicket in the beginning, there was no trouble. When Jemima arrived, she told the bat to work. Boundaries hit like a wave. She added 54 runs for the second wicket with Smriti Mandhana (25; 4×4 in 25 balls) and added 55 runs for the third wicket with skipper Harmanpreet (15 not out) and gave the team an unassailable victory. India ended the match after 32 balls.

Smriti Mandhana set a record as the first Indian batsman to reach the milestone of 4,000 runs in women's international T20s. Among women, Smriti is the next cricketer to enter this club after Suzy Bates (4,716, New Zealand).
Sri Lankan innings:Vishmi run out 39; Chamari (b) Kranti 15; Hasini Pereira (c) Kranti (b) Deepti 20; Harshita (b) Sri Charani 21; Nilakshika run out 8; Kavisha run out 6; Kaushini not out 9; Extras 3 Total:(6 for 20 overs) 121; Fall of wickets:1-18, 2-49, 3-87, 4-103, 5-108, 6-121; Bowling:Kranti 3-0-23-1; Arundhati 4-0-23-0; Dipti 4-1-20-1; Vaishnavi 4-0-16-0; Sri Charani 4-0-30-1; Amanjyot 1-0-8-0
Indian innings:Smriti (c) Nilakshika (b) Inoka 25; Shefali (c) Gimhani (b) Kavya 9; Jemima not out 69; Harmanpreet 15 not out; Extras 4 Total:(2 for 14.4 overs) 122; Fall of wickets:1-13, 2-67; Bowling:Malki 2-0-19-0; Kavya 3-0-20-1; Chamari 2-0-16-0; Shashini 2-0-32-0; Inoka 3.4-0-17-1; Kavisha 2-0-18-0
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Come baby Yuvraj There are no favorable conditions for cricket in his country. The game is played only three months a year. It is great to grow in cricket from such a place and play for the national team. Such a thing got a chance to enter the ring in the World Cup.
- Invincible? Hat-trick victories.. Huge win against Pakistan in the last match.. Highest net run rate which is not possible for any other team in the tournament.. Team India's mood is not normal in T20 World Cup.
- Australia out Shock for former champion Australia. The Kangaroo team is out of the T20 World Cup on Tuesday after the Group-B match between Zimbabwe and Ireland was canceled due to rain. The Aussies lost two of the three matches they played..
- Kiwisoo ahead New Zealand cruised to the Super-8s in the T20 World Cup with no work to do. Kiwis defeated Canada by 8 wickets in Group D match on Tuesday. First, Canada scored 173 runs for 4 wickets.
- Confused.. Australia, which has won ICC tournaments many times, it is not expected that a team that is in top form in the World Cup, will leave the T20 World Cup so soon.
- Will Pakistan stand? Australia has already left the T20 World Cup. The fate of another big team will be decided on Wednesday. Pakistan, who suffered a heavy blow at the hands of India in the last match, is going to face Namibia in its last group match. The big team came very close to victory against England and Nepal, who lost by mistake, ended the T20 World Cup with that same victory. The team, which lost the first three matches in Group-C and exited the Super-8 race, won the last match against Scotland by 7 wickets on Tuesday.
- Brief News (5) Jammu and Kashmir came close to making history in the Ranji Trophy. Batting.. The team, which has been inspired by the bowling performance, is heading towards the final for the first time in the history of Ranji.