kakinada: డిజిటల్ అరెస్ట్ కేసులో కాకినాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

Eenadu icon
By Crime News Team Published : 19 Dec 2025 17:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాకినాడ: డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాకినాడకు చెందిన సూరంపూడి చంద్రశేఖర్, ఇమంది వెంకట్ నవీన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరి కొందరు నిందితుల కోసం కోసం గాలిస్తున్నారు.

ఇటీవల కాకినాడకు చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్‌ కాల్‌ చేసిన సైబర్‌ ముఠా.. డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ భయపెట్టి రూ.59లక్షలు వసూలు చేశారు. ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్న నిందితులు.. ఆ తర్వాత షెల్‌ కంపెనీ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చారు. బైనాన్స్ P2P ద్వారా వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 65 సైబర్ కేసుల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరుకు వీరు.. సైబర్‌ మోసాల ద్వారా రూ.8 కోట్లు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, 10 డెబిట్ కార్డులు, చెక్ బుక్స్, పాన్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న  మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అనంతపురంలో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి వైద్య విద్యార్థి మృతి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి వైద్యవిద్యార్థి మృతి చెందిన ఘటన గార్లదిన్నెలో చోటు చేసుకుంది.
  • మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఉన్మాది మహబూబాబాద్‌ పట్టణంలోని ప్రగతి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.
  • మంచినీళ్లు కావాలంటూ వచ్చి.. చోరీ చేసిన మహిళలు అపరిచితులైనా సరే మంచినీళ్లంటూ వస్తే గుక్కెడు నీళ్లిస్తాం! ఆకలేస్తోందని అడిగితే జాలిపడతాం.
  • మదనపల్లెలో విషాదం.. అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్‌ అనే వ్యక్తి ఇంట్లోనే గుర్తించారు.
  • కర్ణాటకలో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష కర్ణాటకలోని హంపి సమీపంలో పర్యాటకులపై దాడి, అత్యాచారం, హత్య కేసులో గంగావతి అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
  • విష ప్రయోగంతో 26 వలస పక్షుల మృతి కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూరు చెరువు వద్ద... 26 వలస పక్షులు వేటగాళ్ల విషపు ఎరకు బలయ్యాయి. బాధ్యులైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
  • బీరువా ఎత్తుకెళ్లిన దొంగలు జిల్లాకేంద్రం వినాయక్‌నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శమీమున్నీసాబేగం తాళం వేసి బయటకు వెళ్లారు.
  • ఇంట్లోనే మృతదేహం.. అడిగితే ఆగ్రహం నాలుగు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి.. ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడిన కుటుంబంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • భార్య, కుమారుడిని హతమార్చి విశ్రాంత జవాను ఆత్మహత్య ఆర్మీ విశ్రాంత జవాను ఒకరు తన భార్య, కుమారుడిని కాల్చి చంపి.. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో చోటుచేసుకుంది.
  • రాజస్థాన్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం రాజస్థాన్‌లోని ఖైర్తల్‌-తిరాజా జిల్లా భివాడీ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
  • సింగపూర్‌లో భారత్‌ సంతతి వ్యక్తికి జైలు శిక్ష ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె గౌరవానికి భంగం కలిగించినందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి సింగపూర్‌ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష విధించింది.
  • ప్రియుడి కోసం.. మృత్యు నాటకం భర్తను మోసగించి ప్రియుడితో వెళ్లిపోవాలనుకున్న ఓ మహిళ.. తాను చనిపోయినట్లు నాటకం ఆడి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకొంది. తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన ప్రియాంక(29)కు చిక్కమగళూరుకు చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది.