SLW vs INDW: చెమటోడ్చిన శ్రీలంక బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 122

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విశాఖపట్నం: మహిళల ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక (SriLanka) ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ గుణరత్నే (39) టాప్ స్కోరర్. కెప్టెన్ చమరి ఆటపట్టు (15), హాసిని పెరీరా (20), హర్షిత (21) ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్ తీశారు.
బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రాంతి గౌడ్ వేసిన 2.5వ బంతికి కెప్టెన్ చమరి ఆటపట్టు బౌల్డయ్యింది. తొలి డౌన్‌లో వచ్చిన హాసినితో కలిసి మరో ఓపెనర్ గుణరత్నే ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద దీప్తి శర్మ వేసిన పదో ఓవర్ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన హాసిని.. క్రాంతి గౌడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్షిత కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది.
ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా.. గుణరత్నే మాత్రం క్రీజులో నిలదొక్కుకొని నిలకడగా పరుగులు రాబట్టింది. 18వ ఓవర్ చివరి బంతికి అనవసరంగా పరుగుకు ప్రయత్నించి.. రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. చివర్లో వచ్చిన నీలాక్షి (8), కవీష (6) కూడా పెద్దగా రాణించలేదు. దీంతో శ్రీలంక 121 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే సాధించింది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అప్పట్లో ధోని కెప్టెన్సీ ఎందుకు వీడాడంటే..: జతిన్ పరాంజ్‌పే రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) 2025లో కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇది భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
- అవును..భారత్‌పై మాకు మంచి రికార్డ్ లేదని అంగీకరిస్తాం: పాక్ ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్. ఇప్పటికే ఇరు జట్లూ అందుకోసం సిద్ధంగా ఉన్నాయి.