క్రోమ్‌, వాట్సప్‌ యూజర్లకు ‘సైబర్‌ భద్రత’పై హెచ్చరిక!

Eenadu icon
By Telangana News Team Published : 21 Dec 2025 18:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: గూగుల్‌ క్రోమ్ బ్రౌజర్‌ లోపాలు, వాట్సప్ ఖాతా టేకోవర్ వంటి పద్ధతుల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి డేటా చౌర్యం, ఆర్థిక నష్టానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ హెచ్చరించారు. వినియోగదారులు తమ యాప్‌లను అప్‌డేట్ చేయాలని, ఓటీపీలు లేదా వెరిఫికేషన్‌ కోడ్‌లను ఎవరికీ షేర్‌ చేయొద్దని సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే 1930కు కాల్ చేయడం లేదా ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ టీజీసీఎస్‌బీ వేదికగా ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టులో ఆమె పేర్కొన్నారు. ఏ రకంగా దాడికి పాల్పడతారు? ఏం చేయాలి తదితర అంశాలను అందులో వివరించారు.

ఈ దాడి ఎలా జరగొచ్చు? 

  • క్రోమ్‌ దాడి: మీరు హానికరమైన వెబ్‌లింక్‌/URL ఓపెన్‌ చేస్తే క్రోమ్‌లో ఉన్న లోపం ద్వారా దుర్వినియోగం జరగవచ్చు.
  • మీ బ్రౌజర్‌ డేటా, సేవ్‌ చేసిన పాస్‌వర్డ్స్‌ డేటా అనధికారికంగా లభిస్తాయి.

వాట్సప్‌ టేకోవర్ (ఘోస్ట్‌ పెయిరింగ్ అటాక్‌) ద్వారా..

  • ఫేస్‌బుక్‌ ఫొటో ట్యాగ్‌ ద్వారా లేదా ఆఫర్లు, హెచ్చరిక ద్వారా గానీ నకిలీ లింక్‌/మెసేజ్‌ వస్తుంది.
  • అలా వచ్చిన లింకును నిజమైందేనని మీరు భావించి వాట్సప్‌ వెరిఫికేషన్‌/పెయిరింగ్‌ కోడ్‌ నమోదు చేస్తే.. నేరస్థులు తమ డివైజ్‌ను లింక్డ్‌ డివైజెస్‌ ద్వారా జత చేస్తారు.
  • మీ వాట్సప్‌ పనిచేస్తూనే ఉంటుంది. నేరగాళ్లు కూడా మీ వాట్సప్‌ చాట్‌ను గమనిస్తుంటారు.

ఏం చేయాలి?

  • మీ ఖాతా నేరస్థుడి పర్యవేక్షణలో ఉందని అనుమానం వస్తే.. సంబంధిత యాప్‌/బ్రౌజర్‌ని వాడటం వెంటనే ఆపేయండి.
  • అన్ని ఆధారాలనూ భద్రపరుచుకోండి. మెసేజ్‌లు, లింక్‌లు, పాప్‌ అప్స్‌ని స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి.
  • ట్రాన్సాక్షన్‌ ఐడీలు, యూటీఆర్‌ నంబర్లు, కాల్‌ లాగ్స్‌ సేవ్‌ చేయండి.
  • వాట్సప్‌లో లింక్డ్‌ డివైజెస్‌ చెక్‌ చేసుకోండి.
  • ఒకవేళ తెలియని డివైజ్‌లతో లింక్‌ అయి ఉంటే వెంటనే తొలగించండి.
  • గూగుల్‌ క్రోమ్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేయండి.
  • ఈ-మెయిల్‌, బ్యాంకింగ్, సోషల్‌ మీడియా పాస్‌వర్డ్స్‌ మార్చుకోండి. 
  • ఒకవేళ నగదు సంబంధిత లావాదేవీలు జరిగితే మీ బ్యాంకు/పేమెంట్‌ యాప్‌నకు సమాచారం ఇవ్వండి

జాగ్రత్తలివీ..

  • క్రోమ్‌, అన్ని యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయండి.
  • ఓటీపీ, పిన్‌, సీవీవీ, వాట్సప్‌ కోడ్‌లను ఎవరికీ చెప్పొద్దు.
  • తెలియని లేదా అత్యవసరంగా అనిపించే లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు.
  • వాట్సప్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ప్రారంభించండి.
  • తెలియని వెబ్‌సైట్లలో లాగిన్‌ కావొద్దు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విడాకులు ఇచ్చిందన్న కోపంతో.. మాజీ భార్యను హత్య చేసి.. వనస్థలిపురంలోని గ్రీన్‌సిటీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
  • పెట్రోల్‌ పోసి నిప్పంటించుకున్న ఘటన.. వ్యక్తి మృతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో వివాహితపై పెట్రోల్‌ పోసి ఆపై నిప్పటించుకున్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు.
  • ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు లైన్‌ క్లియర్‌ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు అడ్డంకి తొలగింది. ఛైర్మన్‌ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
  • తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది.
  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.