తాతయ్యబాబుకే మళ్లీ తెదేపా పగ్గాలు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 21 Dec 2025 16:45 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

బుచ్చయ్యపేట:  జిల్లా తెదేపా పగ్గాలు మళ్లీ బత్తుల తాతయ్య బాబుకే దక్కాయి. రెండోసారి జిల్లా తెదేపా అధ్యక్షుడిగా ఆదివారం అధిష్ఠానం ఆయన పేరును ప్రకటించింది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా బత్తుల తాతయ్య బాబు, కోట్నీ బాలాజీ పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. చివరికి తాతయ్యబాబు పేరును ఖరారు చేశారు.   బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన  తాతయ్యబాబు ఎన్నికలకు ముందు చోడవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు అవకాశం దక్కలేదు.  కష్టకాలంలో  పార్టీ కోసం ఆయన  చేసిన సేవలను గుర్తించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కీలకమైన హౌసింగ్  కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. గత రెండేళ్ల నుంచి  ఇటు పార్టీ  అధ్యక్షుడిగా.. అటు రాష్ట్ర హౌసింగ్ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తాతయ్య బాబును రెండోసారి కొనసాగించడంపై  కొంత సందిగ్ధత నెలకొంది. అనకాపల్లికి చెందిన డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ పేరు తెరమీదకు వచ్చింది.  జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలతో అధిష్ఠానం సుదీర్ఘ చర్చలు జరిపి  చివరకు తాతయ్య బాబును ఖరారు చేశారు.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని