అప్పు చేసి.. ఐపీ పెట్టి.. పరార్‌

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 21 Dec 2025 16:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

బొమ్మనహళ్: వ్యవసాయానికి పెట్టుబడి కోసం తోటి రైతుల నుంచి అప్పు తీసుకుని ఓ వ్యక్తి పరారైన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మనహాళ్ మండలం దర్గాహాన్నూరు గ్రామంలో రూపనగుడి మనోహర్ అనే రైతు వ్యవసాయం పెట్టుబడి కోసం 43 మంది రైతులు, వ్యవసాయ కూలీల నుంచి రూ. 40.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం తన పేరున ఉన్న నాలుగు ఎకరాల పొలం, సొంత ఇంటిని విక్రయించాడు. తన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని, అప్పుతీర్చలేని పరిస్థితిలో ఉన్నానని ఐపీ పెట్టాడు. అప్పు ఇచ్చిన వారికి ఐపీ నోటీసులు అందడంతో బాధితులు బొమ్మనహళ్ పోలీస్ స్టేషన్ ఎదుట తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పొలం, ఇంటిని అమ్మి తీరుస్తానని నమ్మించి పరారయ్యాడని వారు వాపోయారు. 

► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 15:51 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రాణం విలువైంది గురూ.. అడ్డదారి వద్దు! [ 18-02-2026] బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిలో తపోవనం కూడలి వద్ద ప్రయోగాత్మకంగా రెండు గంటలు పాటు బారికేడ్లు వేసి మూసి ఉంచారు.
  • శేషాపురంలో దొంగల హల్‌చల్‌ [ 18-02-2026] శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని శేషాపురం గ్రామలో మంగళవారం అర్ధరాత్రి ఆలయాల్లో దొంగలు హల్‌చల్‌ చేశారు.
  • అనుచరుడి కబ్జా.. ఆక్రమణలో దర్జా! [ 18-02-2026] అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా ఉన్న ప్రైవేట్‌  భూములను అమాంతం మింగేస్తున్నారు. ఓవైపు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.
  • అన్నీతానై.. అన్నదానం [ 18-02-2026] ఆయన వ్యాపారవేత్త, డాక్టరేట్‌ అందుకున్నారు.. నిత్యం అన్నదానం చేయాలన్న తపన ఆయనను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపింది. కర్ణాటక శ్రీక్షేత్రం కైవారం తాత గురుసేవకుడిగా హిందూపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ రవిశంకర్‌.
  • దివ్యాంగులే.. అసాధ్యులు [ 18-02-2026] చీకటిని తిడుతూ కూర్చునేకంటే చిరుదీపం వెలిగిస్తే జీవితమే ప్రకాశవంతం అవుతుంది. వైకల్యం ఉందని కుంగిపోకుండా నమ్మకం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అడుగులేశారు ఆ దివ్యాంగులు.
  • అంతుచిక్కని నీటి లెక్కలు [ 18-02-2026] పీఏబీఆర్‌ కుడి కాలువ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ కాలువ మొదట్లో 2 కి.మీ వద్ద 630 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా.
  • ఎప్పుడు వస్తారో.. ఎక్కడికి వెళ్తారో! [ 18-02-2026] అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థులపై పర్యవేక్షణను అధికారులు గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. రోజువారీగా కళాశాలకు వస్తున్నారా.. లేదా...
  • భార్య కాపురానికి రాలేదని... పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం [ 18-02-2026] రాయదుర్గం పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం ఎదుట వడ్రవన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు చౌడప్ప మంగళవారం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
  • కుమారుడిపై దాడి.. అడ్డుకోబోయి తల్లి మృతి [ 18-02-2026] కొడుకుపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన తల్లి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. గౌసియా (56) కుమారుడు ఇమ్రాన్.
  • పవన విద్యుదుత్పత్తిలో మేటి.. సౌరశక్తిలో లేదు సాటి! [ 18-02-2026] పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా దూసుకుపోతోంది. రాష్ట్రంలో సుమారు 70 వేల మెగావాట్ల సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా..
  • సోనాక్షి సత్తా [ 18-02-2026] హిందూపురం పట్టణానికి చెందిన సోనాక్షి చిన్న వయసులోనే అందనంత ఎత్తుకు ఎదిగింది. రెండో తరగతిలోనే జిమ్నాస్టిక్స్‌పై మక్కువ చూపింది. క్రమంగా అదే పట్టుదలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సొంతం చేసుకుంది.