YS Jagan: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసులు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డాక్టర్ కె.పట్టాభిరామారావు విచారణను ప్రారంభించనున్నారు. జగన్ అక్రమాస్తులకు సంబందించి సీబీఐ 11, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 9 అభియోగపత్రాలను దాఖలు చేశాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్, బి.పి.ఆచార్య, జి.వెంకట్రామిరెడ్డిలతోపాటు పారిశ్రామికవేత్తలు పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంకీ అయోధ్య రామిరెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ తదితరులు సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ పూర్తవడంలేదు.
2013 నుంచి దాఖలైన జగన్ అక్రమాస్తుల కేసులోని డిశ్ఛార్జి పిటిషన్‌లపై ఇప్పటివరకు 8 మంది న్యాయమూర్తులు విచారణ చేపట్టినా, అవి పూర్తికాకముందే వారు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న డాక్టర్ టి.రఘురాం గతేడాది మేలో బాధ్యతలు స్వీకరించారు. అరబిందో-హెటిరోకు భూకేటాయింపులు, రాంకీ ఫార్మా సిటీకి గ్రీన్‌బెల్ట్ మినహాయింపులు, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్‌కు ఓడరేవులు, విమానాశ్రయాల ప్రాజెక్టులు, భూకేటాయింపులు, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై దాదాపుగా వాదనలు పూర్తయ్యాయి. దాల్మియా సిమెంట్స్‌లోని ఒకరి పిటిషన్‌పై మినహా మిగిలిన వాటిలో వాదనలు పూర్తయ్యాయి.
ఐదు అభియోగపత్రాల్లో వాదనలు పూర్తయిన తరువాతే ఉత్తర్వులు వెలువరిస్తామని అప్పట్లో సీబీఐ కోర్టు పేర్కొంది. ఆ ఉత్తర్వులు జారీ చేసేనాటికి ఐదు అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఐదు కేసుల్లో వాదనలు పూర్తి కావడం, న్యాయమూర్తి పదవీ కాలం జనవరి వరకు ఉండడంతో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావించారు. అంతలోనే ప్రస్తుత బదిలీతో ఈ ఐదు కేసుల్లోనూ వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
దాదాపు 130 పిటిషన్‌లపై విచారణ పూర్తికావడానికి సుదీర్ఘ సమయం పడుతుండడం, ఈలోగా న్యాయమూర్తులు బదిలీ అవుతుండడంతో పదేపదే విచారణ మొదటికి వస్తోంది. ప్రజాప్రతినిధులకు చెందిన కేసుల విచారణలో తీవ్రమైన జాప్యం జరుగుతుండడంతో అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు సత్వర విచారణకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై డిశ్ఛార్జి పిటిషన్ల అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐ కోర్టుకు 2023 డిసెంబరు 15న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన గడువు 2024 ఫిబ్రవరి 15తో ముగియనుండగా విచారణ పూర్తికాలేదని, సుమారు 13 వేల పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత గడువు కావాలంటూ 2024 జనవరి 30న హైకోర్టుకు అప్పటి సీబీఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. ఈ లేఖపై విచారించిన హైకోర్టు డిశ్ఛార్జి పిటిషన్‌లపై తేల్చడానికి ఏప్రిల్ 30 వరకు గడువు మంజూరు చేసింది.
అనంతరం సీబీఐ కోర్టు న్యాయమూర్తి గడువులోగా విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వు చేశారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో 2024 ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 47 మంది జిల్లా జడ్జీల బదిలీల్లో భాగంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారందరూ మే 1లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలివ్వగా, అప్పటి సీబీఐ కోర్టు న్యాయమూర్తికి మినహాయింపునిస్తూ మే 1న రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో తీర్పును సిద్ధం చేయలేకపోయినట్లు ఆయన హైకోర్టుకు లేఖ రాసి రిలీవ్ అయ్యారు. అనంతరం వచ్చిన డాక్టర్ టి.రఘురాం డిశ్ఛార్జి పిటిషన్‌లపై తిరిగి విచారణ ప్రారంభించి రోజువారీ విచారణ చేపట్టారు. ఇతర కేసుల విచారణ పూర్తయిన తరువాత ఈ పిటిషన్‌లపై విచారణ చేపడుతూ వచ్చారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:34 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
- స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
- ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
- వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
- జస్టిస్ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
- నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
- తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
- డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
- రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- 498 కేసులో లుకౌట్ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
- బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్‌ను నియమించనుంది.
- నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
- త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
- రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
- ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్ మేనేజర్ భావన బడోలా.
- క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
- సముద్రాలకు ప్లాస్టిక్ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్ క్లియర్ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
- సాగరతీరంలో మిలన్ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2026), మిలన్ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
- తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.