భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, అదనపు గదుల నిర్మాణం: ఎమ్మెల్యే

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 21 Dec 2025 15:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

మోపిదేవి: మోపిదేవిలోని పుణ్యక్షేత్రంలో కాటేజీలు, అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన టేకురథం తయారీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రముఖ సినీ నిర్మాత, దాత అట్లూరి నారాయణరావు సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో నూతన టేకు రథాన్ని తయారు చేయించటం అభినందనీయమన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీఎస్‌ చౌదరి రూ.కోటి వ్యయంతో స్వామివారి గర్భాలయానికి వెండి మండపం సమకూర్చటం శుభపరిణామం అన్నారు. ప్రభుత్వంతోపాటు, దాతల సహకారం ఉంటే భక్తుల కోసం మరిన్ని సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ రథం తయారీకి తనవంతు సహకారం అందిస్తున్న భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజును ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే వెంట భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, సూపరింటెండెంట్ మధుసూధనరావు, ఆలయ అధికారులు, కూటమి నాయకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.

► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • దూసుకొస్తూ.. ప్రాణాలు హరిస్తూ..! [ 19-02-2026] ద్విచక్ర వాహనాలతో మైనర్లు రహదారులపైకి దూసుకొస్తుండడంతో.. ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మానసిక పరిపక్వత లేని వయసులో బైక్‌లను వారికి ఇచ్చి.. రహదారులపైకి వదులుతున్న తల్లిదండ్రులే అసలు దోషులని.. పోలీసులు హెచ్చరిస్తున్నారు.
  • ఎంఎస్‌ఎంఈ పార్కులకు..స్థలాలు సిద్ధం [ 19-02-2026] జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే విజయవాడ మధ్య, జగ్గయ్యపేట, మైలవరంలో స్థలాల గ్రౌండింగ్‌ పనులు ఆరంభించారు.
  • ఇబ్బందిగా సిబ్బంది లేమి [ 19-02-2026] రాజధాని అమరావతి మహా నగర విస్తరణకు రెండో విడత చేపట్టిన భూసమీకరణ ప్రక్రియకు సిబ్బంది కొరత అడ్డంకిగా మారింది.
  • దాచుకున్నారు.. తీసుకోరేమనీ..! [ 19-02-2026] బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి కొంతకాలం లావాదేవీలు నిర్వహించిన తరవాత ఏళ్ల పాటు వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. వ్యక్తిగత, ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థలకు చెందిన ఖాతాల్లో పదేళ్లకు పైగా లావాదేవీలు జరపకపోవడంతో వాటిని అన్‌క్లెయిమ్డ్‌ ఖాతాలుగా గుర్తించారు.
  • సేవలు నచ్చేలా.. పౌరులు మెచ్చేలా... [ 19-02-2026] సీఆర్డీఏ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఏపీసీఆర్డీఏ పరిష్కారం 2.0 ద్వారా రైతులు కాలు కదపనవసరం లేకుండానే అర్జీ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
  • నమ్మించి.. నిలువునా ముంచేసి.. [ 19-02-2026] ఉద్యోగాల పేరుతో దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దందాలో చిక్కుకున్న బాధితుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది.
  • బెయిల్‌పై వచ్చి.. చోరీకి పాల్పడి [ 19-02-2026] పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందట చింతలపూడిలోని ధూళిపాళ్ల ప్రమీలాదేవి ఇంట్లో రూ.70 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయిన విషయం తెలిసిందే.
  • మోగనున్న పెళ్లిబాజాలు.. [ 19-02-2026] శుభకార్యాలకు వేళయ్యింది. ఈనెల 19వ తేదీ నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. వివాహాలతోపాటు నూతన గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు ఇలా ఒక్కటేమిటి అన్నింటా వేడుకలు జరగనున్నాయి.
  • చెన్నైలో నిందితుల కోసం అన్వేషణ [ 19-02-2026] ఇటీవల యనమలకుదురులో వెలుగుచూసిన అద్దె ఖాతాల కేసులో ఇప్పుడు సీన్‌ చెన్నైకి మారింది. ఈ కేసులో అసలు సూత్రధారుల కోసం సైబర్‌ పోలీసు ప్రత్యేక బృందం చెన్నైలో మకాం వేసింది.
  • సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో అగ్నిప్రమాదం [ 19-02-2026] గుడివాడ సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. 2000 సంవత్సరం నాటి తాలూకా పోలీసుస్టేషన్‌ రికార్డులు, కొన్ని పేపర్లు కాలిపోయాయి. స్టేషన్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు.