అప్పులు ఇచ్చిన వారి వేధింపులు.. దంపతుల ఆత్మహత్య

- A
- A+
- A++

బెజ్జంకి: అప్పుల బాధ భరించలేక దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి(25) దంపతులు. వీరికి మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. బెజ్జంకి మండల కేంద్రంలో రెండేళ్లుగా దుస్తుల దుకాణం నిర్వహిస్తూ వారు ఉపాధి పొందుతున్నారు. అక్కడే అద్దె గదిలో నివాసముంటున్నారు. దుకాణం నిర్వహణతో పాటు కుటుంబ పోషణకు శ్రీహర్ష అప్పు చేశాడు. మరికొందరికి మధ్యవర్తిగా ఉంటూ ఇతరుల వద్ద అప్పులు ఇప్పించాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అద్దె గదిలో శ్రీహర్ష, రుక్మిణి దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో కింద పడిపోవడంతో తల్లిదండ్రులకు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్న కుమార్తె హరిప్రియ కేకలు వేసింది. గది నుంచి నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యజమాని గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంటి ద్వారం పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే రుక్మిణి మృతిచెంది కనిపించింది. కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షతో పాటు పురుగుమందు తాగినట్లుగా ఉన్న హరిప్రియను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. హరిప్రియకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
రుక్మిణి, శ్రీహర్ష మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు ముందు శ్రీహర్ష రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పులిచ్చి వేధిస్తున్న పలువురి పేర్లతో పాటు చివరికి అమ్మ, నాన్న, తమ్ముడు, అత్తమ్మ క్షమించండి.. అంటూ రాసిన అక్షరాలు కంట తడి పెట్టిస్తున్నాయి. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
► Read latest Medak Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- గుట్టు తేలింది.. గట్టు వేస్తారా! [ 19-02-2026] సంగారెడ్డి మండలంలో 49 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో 26 నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్నాయి.
- దారిపై గండం.. దాటితేనే గమ్యం [ 19-02-2026] జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఇతర శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
- నిద్రమత్తు.. అతివేగం.. గాలిలో నిండు ప్రాణం [ 19-02-2026] నిద్రమత్తు, అతివేగం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
- బిల్లులు చెల్లించాలని ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచి నిరసన [ 19-02-2026] పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలం, ఆరేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి కరుణాకర్ బుధవారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు.
- వెన్నువంగనివ్వని స్మార్ట్ బ్యాగ్ [ 19-02-2026] విద్యార్థులు రోజూ మోసే పుస్తకాల సంచి బరువు సమస్యకు సిద్దిపేట జిల్లా బేగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏంగారి చిట్టి, బర్కం అర్చన, గైడ్ టీచర్ భాస్కర్‌రెడ్డి సరికొత్త పరిష్కారం చూపారు.
- సైకిల్ తొక్కండి.. సమస్యలు చూడండి [ 19-02-2026] ‘‘వాహనాల్లో వచ్చి.. దిగకుండానే మురికి వాడలను చూసి వెళ్లడం కాదు. ప్రజల కష్టాల్లో మమేకమవ్వాలి. మున్సిపల్ కమిషనర్లు ఏసీ గదులను వదిలి ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
- దవాఖానాకు వెళ్లాలంటే దడ! [ 19-02-2026] నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. మరోవైపు సిబ్బంది సైతం ఆయా దవాఖానాల్లో డిప్యుటేషన్లలో కొనసాగుతున్నారు.
- ప్రణాళికాబద్ధంగా పుర ప్రగతికి నాంది [ 19-02-2026] పురపాలికలకు కొత్త పాలకులొచ్చారు. ఆయా పట్టణాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ‘న్యూస్‌టుడే’ వారి దృష్టికి తీసుకెళ్లగా ఇలా స్పందించారు. సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కారానికి దృష్టి పెడతామన్నారు.
- మంజూరైతే పని ప్రారంభం..పూర్తయితే సౌకర్యం [ 19-02-2026] ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా వ్యవసాయం, పాడి, సిమెంటు పరిశ్రమలు, గ్రానైట్‌కు చిరునామాగా ఈ ప్రాంతం ఉంది.