Train fare hike: రైల్వే ఛార్జీల పెంపు.. ఈనెల 26 నుంచి అమల్లోకి..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Train fare hike ఇంటర్నెట్‌డెస్క్: టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వేశాఖ ప్రకటన చేసింది (Train fare hike). ఇవి డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా మార్పుల ప్రకారం.. లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 13:32 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
- ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
- వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్ Kannada actress: ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.