ధ్యానం ఎందుకంటే..!

- A
- A+
- A++

ధ్యానం అనగానే రకరకాల అపోహలు... అన్నీ వదిలేసిన సన్యాసులూ సాధువులే ధ్యానం చేస్తారని అనుకుంటారు. వాళ్లు సంసార బంధాలకు, భావోద్వేగాలకు, ఉద్యోగ వ్యాపారాలకు అతీతంగా జీవిస్తారనుకుంటారు. నిజానికి ఇవన్నీ సరైన అవగాహన లేకపోవడంతో ఏర్పడే అభిప్రాయాలే!
ఈ గందరగోళానికి మూలం మనసుకు సంబంధించిన రెండు స్థితుల మధ్య తేడా తెలియకపోవడం. పూర్తిగా ఇహలోకపు విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండటం వేరు. దీన్ని ‘డిటాచ్‌మెంట్’ అనుకుందాం. నిత్యజీవితంలో బాధ్యతలన్నీ మనస్ఫూర్తిగా నిర్వహిస్తూనే ఫలితాల గురించి పట్టించుకోకుండా ఉండటం వేరు. ఇది ‘నాన్- ఎటాచ్‌మెంట్’. ధ్యానం ఈ రెండో కోవకు చెందినది. అది నిర్లిప్తతను పెంచదు, అన్నింటినీ పట్టుకుని వేళ్లాడకుండా చూస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. జీవితంలో ఎప్పుడూ ఎదురయ్యే పరిస్థితులూ సందర్భాలే అప్పుడూ ఉంటాయి. కాకపోతే కష్టాలను చూసి బెదిరిపోయి దూరంగా పెట్టడం; ఆనందాలను అంటిపెట్టుకుని ఉండటం చేయరు. కేవలం నిమిత్తమాత్రుల్లా గమనిస్తూ ఉంటారు. తమలోలోపల ఏం జరుగుతోందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఈ సాధన మనిషిని చైతన్యవంతుణ్ని చేస్తుంది. అతనిలో సున్నితత్వాన్ని పెంచుతుంది. ధ్యానం చేసేవారు సాధారణంగా ఎక్కువగా అనుభూతి చెందుతారు. ఇతరుల బాధ అర్థమవుతుంది. అనుబంధాలను ఆస్వాదిస్తారు. బంధుత్వాలు మెరుగు పడతాయి. ధ్యానం వల్ల మనల్ని మనం కోల్పోకుండా ఇతరుల పట్ల శ్రద్ధ వహించవచ్చు. ఇతరులతో పోలిస్తే ఏళ్ల తరబడి ధ్యాన సాధన చేసిన వ్యక్తుల్లో భావోద్వేగపరమైన చైతన్యం, గాఢమైన సహానుభూతి, మెరుగైన అనుబంధాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
మనిషి మనస్తత్వానికి సంబంధించి ఒక వైరుధ్యాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఫలితాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు నిజంగా జరుగుతున్న దాని పట్ల తగినంత శ్రద్ధతో స్పందించలేరు. అనుబంధాన్ని కోల్పోతామేమోనని భయపడే మనుషులు దాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తారు. కచ్చితమైన ఫలితాలను ఆశించేవారు చేసే పని అసహజంగా ఉంటుంది. తమ పిల్లలు ఎలా ఉండాలో స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకున్న తల్లిదండ్రులు వారితో అనుబంధాన్ని నాశనం చేసుకుంటారు. పైన చెప్పుకొన్నట్లు ధ్యానం వల్ల వచ్చే నాన్- అటాచ్‌మెంట్ తరహా మనస్తత్వం ఉన్నవారికి ఈ ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే ఫలితం కచ్చితంగా ఈ విధంగానే ఉండాలని ఆశించమో అప్పుడు సంఘటనల పట్ల మన స్పందన మరింత స్పష్టంగా, స్వేచ్ఛగా ఉంటుంది. ఎలాంటి భయసంకోచాలూ లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
ధ్యానం చేసేవారు జీవితాన్నుంచి పారిపోయేవారు కాదు. అనుభవాల్లో తలమునకలు కాకుండానే జీవితాన్ని ఆస్వాదించగలరు. ఓడిపోతామన్న భయం లేకుండా సవాళ్లను స్వీకరించగలరు. భయాందోళనలు లేకుండా అనిశ్చితిని ఎదుర్కొనగలరు. ధ్యానం వల్ల మనసు నిశ్చలమూ విశాలమూ అవుతుంది తప్ప శూన్యం కాదు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అదే అత్యుత్తమ సేవ... రంగురంగుల ప్రకృతి శోభ వర్ణనాతీతం. భౌతికంగా, మానసికంగా విభిన్న తత్వాలు ఉన్న మానవ ప్రపంచం అంతకన్నా అద్భుతం.
- జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
- యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
- దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
- శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
- తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
- మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
- మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
- అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
- సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
- దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
- ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
- అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
- పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
- భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
- గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు.
- సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
- జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
- ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
- సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.