Etukuri Krishnamurthy: శతాధిక స్ఫూర్తి.. కృష్ణమూర్తి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 21 Dec 2025 06:38 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ముగ్గుబుట్టలా నెరిసిన తల.. ‘భారతీయుడు’లో కమల్‌హాసన్‌ను తలపించే ఆహార్యం.. పొద్దున్నే పార్కులో చకచకా నడిచేస్తూ ఓ పెద్దాయన కనిపిస్తారు. వయసు డెబ్బయ్యో.. ఎనభయ్యో ఉండొచ్చు అనుకుంటాం.. కాదు.. కాదు.. 102 ఏళ్లంటే నోరెళ్లబెడతాం. ఆయన రిటైరై దాదాపు 5 దశాబ్దాలవుతోంది. సంతానం కూడా విశ్రాంత ఉద్యోగులయ్యారు. ఇంత వయసొచ్చినా ఆయనకు అనారోగ్య సమస్యలు లేవంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యం, స్వతంత్ర భారతంలో ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఉన్న ఆయన పేరు ఏటుకూరి కృష్ణమూర్తి. శతాధిక వయసులోనూ చురుగ్గా ఉన్న ఆయన జీవనశైలి ఆదర్శప్రాయం.. అనుసరణీయం.

క్రమశిక్షణే రహస్యం

ఆది నుంచీ కృష్ణమూర్తిది క్రమశిక్షణతో కూడిన దినచర్య. ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటారు. వేకువజామున ఐదు గంటలకే మేల్కొంటారు. పార్కులో 4 కిలోమీటర్ల నడక, యోగా సాధన చేస్తారు. తరువాత అల్పాహారం (రెండు ఇడ్లీలు/ఒక కప్పు ఉప్మా/దోశ) తీసుకుంటారు. నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ఒక గ్లాసు పాలు తాగుతారు. తర్వాత దినపత్రికలు చదువుతారు. స్నేహితులు, సన్నిహితులతో గడుపుతారు. మధ్యాహ్నం పప్పులు, పెరుగన్నం, కూరగాయలతో భోజనం చేస్తారు. తర్వాత 2 గంటలసేపు నిద్ర.. రాత్రిపూట గ్లాసు పాలు తాగి 10 గంటలకల్లా నిద్రపోతారు. రోజు మొత్తమ్మీద కనీసం 8 నుంచి 9 గంటలు నిద్రకు కేటాయిస్తారు. పూర్తి శాకాహారం, దురలవాట్లు లేకపోవడం, సానుకూల దృక్పథం తన ఆరోగ్య రహస్యాలంటారాయన. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే హెల్త్‌కార్డున్నా.. దాంతో ఆయనకు పనిలేదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఒక్కసారీ రాలేదు. పరోపకార దృక్పథంతో సమాజంపైనా శ్రద్ధ చూపే నైజం కృష్ణమూర్తిది. పెన్షన్‌ డబ్బుల్లో కొంత భాగాన్ని వృద్ధాశ్రమాలకు, తాను నమ్మిన పార్టీకి విరాళంగా అందిస్తున్నారు. 

పిల్లలే ఆస్తి

దాదాపు మూడు దశాబ్దాల ప్రభుత్వ వేతనం.. నాలుగు దశాబ్దాలకు పైగా పెన్షన్‌ తీసుకున్నా.. కృష్ణమూర్తికి సొంత ఇల్లు లేదు. హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలో అద్దె ఇల్లే నివాసం. పిల్లలే తన ఆస్తి అని చెప్పే కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు శ్రీనివాసమూర్తి సీపీఐ లెజిస్లేటివ్‌ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రెండో అబ్బాయి భరద్వాజ్‌ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు. పెద్ద అమ్మాయి స్వతంత్ర గృహిణి. చిన్న అమ్మాయి ఉషారాణి బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి రిటైరయ్యారు.

బ్రిటిష్‌ హయాంలో జైలు జీవితం

గుంటూరు జిల్లా ఏటుకూరులో సీతారామయ్య, లక్ష్మీబాయమ్మ దంపతులకు 1923 సెప్టెంబరు 9న కృష్ణమూర్తి జన్మించారు. గుంటూరు టౌన్‌ హైస్కూల్‌లో విద్యనభ్యసించారు. తండ్రి అందించిన జాతీయోద్యమ స్ఫూర్తి వంటబట్టింది. 1935లో గుంటూరు వచ్చిన మహాత్మాగాంధీని చూశాక.. మనసు మరింతగా ఉద్యమంవైపు మళ్లింది. అప్పటి నుంచి స్వాతంత్య్రోద్యమ కార్యక్రమాలే ఆయన దినచర్యగా మారాయి. పలు ఉద్యమాలు, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 1940లో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ‘క్విట్‌ ఇండియా’ ప్రదర్శనలో పాల్గొన్నందుకు 15 రోజుల జైలు జీవితం అనుభవించారు. బొంబాయి నౌకాదళ సైనిక తిరుగుబాటుకు సంఘీభావంగా 1946లో లఖ్‌నవూలో జరిగిన మిలిటరీ ప్రదర్శనకు కృష్ణమూర్తి నాయకత్వం వహించడంతో బ్రిటిష్‌ పాలకులు ఆగ్రహించారు. ఆయనను కోర్ట్‌ మార్షల్‌ ద్వారా విచారించి జైలుశిక్ష విధించారు. దీంతో కృష్ణమూర్తి 8 నెలల పాటు లఖ్‌నవూ, లాహోర్‌ మిలిటరీ జైళ్లలో గడిపారు.

అనుభవాలకు అక్షరరూపం

స్వాతంత్య్రం వచ్చాక.. కృష్ణమూర్తి 1948లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నెలకు రూ.37 వేతనంతో రెవెన్యూశాఖలో ఉద్యోగంలో చేరారు. 1978లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రతినెలా రూ. 60 వేల పెన్షన్‌ వస్తోంది. తన అనుభవాలకు ఆయన గ్రంథ రూపమిచ్చారు. ‘భారత స్వాతంత్య్రోద్యమంలో మా ఊరు’ శీర్షికతో రచించిన పుస్తకంలో గుంటూరు జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్రతో పాటు.. పలువురు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను ఛాయాచిత్రాలతో అందించారు. చిన్ననాటి జ్ఞాపకాలు- చెరిగిపోని అనుభవాలు, స్వాతంత్య్ర సమరయోధుల సంస్థ ఆవిర్భావం - అంతర్థానం, ఇదీ మా ఊరు, ప్రజా వైద్యులు వంటి పుస్తకాలూ రచించారు.

రాజకీయాలు డబ్బుతో ముడిపడ్డాయి: కృష్ణమూర్తి

రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ మారిపోయారు. ఓట్ల పండగొస్తే ఎవరు డబ్బు ఇస్తారా అని ఓటర్లు ఎదురు చూడడం బాధాకరం. ఒకప్పుడు నాయకుల ప్రచారం కోసం ప్రజలే చందాలిచ్చేవారు. అప్పట్లో వావిలాల గోపాల కృష్ణయ్య ఎన్నికల ప్రచారం కోసం రూ.5 వేలు ఖర్చు చేశారని తెలిసి పార్టీ నిలదీసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ఎవరు ఎంత ఖర్చు పెడతారని పార్టీలు చూస్తున్నాయి. భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుందేమోనన్న ఆందోళన కలుగుతోంది.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:19 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.