Pawan Kalyan: గూండాలకు యోగి ట్రీట్‌మెంటే కరెక్ట్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 21 Dec 2025 09:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, రాజమహేంద్రవరం: ‘ప్రతిపక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడలేదు. ఇప్పుడు మళ్లీ మేమొస్తాం.. ఒక్కొక్కరినీ చంపేస్తాం అంటున్నారు. మీరు బాధ్యతగా విమర్శిస్తే సరే.. గీత దాటి మాట్లాడితే చేతి రేఖలు లేకుండా చేస్తాం’ అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘పనులు చేసే గుత్తేదారులను మేమొచ్చాక జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఏదైనా మాట్లాడాలంటే అధికారులు భయపడుతున్నారు. ఎందుకని అడిగితే వాళ్ల వెనుక రౌడీలు, కిరాయి హంతకులు ఉంటారని చెవిలో చెబుతున్నారు. మీకు యోగి ఆదిత్యనాథ్‌ తరహా ట్రీట్‌మెంట్‌ కరెక్ట్‌. రౌడీయిజం అన్నారో కాళ్లకు కాళ్లు, కీళ్లకు కీలు తీసి కూర్చోబెడితే సరిపోతుంది. ప్రభుత్వం తలచుకుంటే వామపక్ష తీవ్రవాదం లాంటి బలమైన వ్యవస్థే కకావికలమైన పరిస్థితి. అలాంటిది ఇన్ని వేల మంది పోలీసులు, వందల మంది ఐపీఎస్‌లు, డీఎస్పీలు తలుచుకుంటే ఎంత? 48 గంటల్లో కిరాయి గ్యాంగ్‌లు నిర్వహించే వ్యక్తుల వివరాలు సేకరించి, ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇటువంటి మాటలు మళ్లీ రావు. అక్కడిదాకా తీసుకెళ్లకండి’ అని హెచ్చరించారు. పిఠాపురంలాంటి చోట్ల పిల్లల మధ్య కులాల చిచ్చు పెట్టే స్థాయికి దిగజారతారా? రాజకీయాల గురించి మాట్లాడేందుకు వేరే దారులు లేవా అని మండిపడ్డారు. బెదిరించేవారు ఎవరైనా సరే.. పవన్‌కల్యాణ్‌ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా స్పందిస్తాడని స్పష్టం చేశారు.

పోయే ముందు చాలామంది తాట తీసేస్తా

సామాజిక మాధ్యమాల్లో, విదేశాల్లో కూర్చొని మాట్లాడేవారితో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేమొస్తాం, వచ్చి ఏదో చేస్తామంటున్నారు. మీరు (వైకాపానుద్దేశించి) వచ్చినప్పుడే ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మీ బెదిరింపులకు భయపడతామా? పద్ధతి మార్చుకోండి.. మీరు పాత పద్ధతిలోనే చేస్తామంటే నేనూ విసిగిపోయా. ఒక ఆశయం కోసం నా ప్రాణాలు పోయినా లెక్కచేయను. కానీ పోయే ముందు చాలామంది తాట తీస్తా. అడ్డగోలుగా ఏదైనా చేసేస్తామని అంటే రోమాలు తీసి కూర్చోబెడతాం’ అని హెచ్చరించారు.  

ధైర్యం లేని నాయకులెందుకు? 

‘రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. విభజన వద్దన్నారే తప్ప మాకొచ్చే నష్టం ఇది అని చెప్పలేదు. మాట్లాడితే కొడతారని, వ్యాపారాలు పోతాయనే భయం. అంత దరిద్రపుగొట్టు బతుకులెందుకు? ధైర్యం లేని నాయకులెందుకు?  పొట్టిశ్రీరాములు 56 రోజుల ఆమరణ దీక్షతో ప్రాణత్యాగం చేసి తెచ్చిన రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఒక్కరూ మాట్లాడరు. నాయకులు చేసే తప్పులకు ప్రజలను ఎలా శిక్షిస్తారు? అంతా కుల సమూహాలతో కొట్టుకుంటున్నారు. కొందరు నాయకులు అదే కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

అలా చేస్తే వారికి, మనకు తేడా ఏంటి?

కలెక్టర్, ఎస్పీల సమావేశంలో రౌడీయిజం, బెదిరింపులపై చర్చకు వచ్చింది. ఉత్తరాంధ్రలో కొందరు బెదిరిస్తున్నారంటే ఒకటే చెప్పా.. రౌడీయిజం చేసినవాళ్లను పంపించేసి మనం వచ్చాం కదా? మనం అలా చేస్తే వాళ్లకు, మనకు తేడా ఏంటని ప్రశ్నించాం. ప్రభుత్వంలో నిర్మాణాత్మక భాగస్వామిగా ఉన్నాం. ప్రతి విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తాం. వైకాపా అంటే గౌరవం ఉంది. అక్కడ బొత్స లాంటి నాయకులున్నారు.. మా పార్టీలోకి సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాస్‌ వచ్చారు. అప్పుడు, ఇప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారు’ అని పేర్కొన్నారు. 

ప్రధాని కూడా వెనుకాడుతున్నారు

తాను ప్రసంగిస్తున్న సమయంలో కేరింతలు కొడుతున్న యువతను పవన్‌ కల్యాణ్‌ వారించారు. ఈ ఉత్సాహం వల్ల తాను హాజరయ్యే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కూడా వెనుకాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను బాహుబలి అంటూ సంబోధించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. ‘ఆయన ఒక్కోసారి మాట్లాడితే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో  మాట్లాడకపోతేనే మంచిది అనిపిస్తుంది.. ఆయనే ఆరడుగుల బుల్లెట్‌’ అని అనడంతో వేదికపై నవ్వులు విరిశాయి.


► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:17 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రాజావారి కోట కాదిది.. పోలీసు ఠాణానే రాజుల కాలంలోని కోట తరహాలో కనిపిస్తున్న ఈ భవనం పోలీస్‌స్టేషన్‌ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాకినాడ జిల్లాలోని కోటనందూరు ఠాణా ఇది.
  • క్లిక్‌ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో! ట్రాఫిక్‌ ఉల్లంఘనల పేరుతో నకిలీ చలానాలు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్‌ కేటుగాళ్లు. వీరు పంపించే చలానాలు అసలు వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండడంతో ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు.
  • ‘యువగళం’ గుర్తు.. సైకిల్‌! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఆ సందర్భం గుర్తుండిపోయేలా చేస్తున్నారు.
  • నాటి వైభోగం.. నేటి జ్ఞాపకం గోకర్ణం, గంగాళం, ముక్కుపొడుం మీనా, ధూమం అరలు, శకుంతలపాత్ర, పూలబుట్టలు, కావడి పెట్టె, మర చెంబులు.. ఏంటివన్నీ అనుకుంటున్నారా?
  • నేడు రాజధానికి బిల్‌గేట్స్‌ బృందం గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవారం అమరావతిలో పర్యటించనున్నారు.
  • రాకింగ్‌.. రామసుబ్బమ్మా! జీవితంలో గెలవాలంటే ఏ వయసులోనైనా ప్రయత్నించి, విజయం సాధించొచ్చు అనడానికి ఈ బామ్మే ఉదాహరణ.
  • గిరులన్నీ.. భక్త జన సిరులు ఎటు చూసినా పారవశ్యం... భక్తజన కోలాహలం..  మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు రద్దీగా మారాయి.. ఆధ్యాత్మికతను పంచాయి.
  • సుబ్బారెడ్డి సేవలోనే చిన్నప్పన్న వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన కదురు చిన్నప్పన్న.. అప్పటి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదు అంతకు మించి నమ్మినబంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమయ్యింది.
  • శివరాత్రి వేళ.. పుష్కరాలకు సన్నాహాలు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు సన్నాహక చర్యల్లో భాగంగా.. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన భక్తుల రద్దీని అధికారులు శాస్త్రీయంగా అంచనా కట్టారు.
  • ఆదిత్యుని సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆయలం, విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.
  • కాలచక్ర మ్యూజియానికి నిర్లక్ష్యపు గ్రహణం బౌద్ధారామాల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన కాలచక్ర మ్యూజియంపై నిర్లక్ష్యం కమ్ముకుంది.
  • కర్నూలులో నల్లరెక్కల తెల్లడేగ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని పంట పొలాల్లో నల్లటి రెక్కల తెల్ల డేగ కనిపించింది. రైతులు దీన్ని తమ నేస్తంలా భావిస్తారు.
  • 4 నగరాలు.. రూ. 2 వేల కోట్ల లక్ష్యం కొత్త ఆర్థిక సంవత్సరంలో ‘అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌’ (యూసీఎఫ్‌) కింద రూ.2వేల కోట్లు సమీకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
  • ర్యామ్, చిప్‌ల కొరతతో.. ఎలక్ట్రానిక్‌ పరికరాల ధరలకు రెక్కలు మీరు మొబైల్‌ మార్చాలని.. కొత్త ల్యాప్‌టాప్‌ కొనాలని.. కంప్యూటర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి.
  • ఈ బడ్జెట్‌.. రాష్ట్రాభివృద్ధికి సరైన రోడ్‌మ్యాప్‌ అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌ రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పేర్కొన్నారు.
  • ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రైల్వే జోన్‌? దక్షిణమధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్‌కు అపాయింటెడ్‌ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది.
  • ‘అగ్నివీర్‌’ నియామకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్‌ నమోదు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు రిక్రూట్‌మెంట్‌ అధికారి, గుంటూరు డైరెక్టర్‌ కర్నల్‌ రజత్‌ సువర్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
  • కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు.. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
  • కలవరపెడుతున్న టీనేజ్‌ ప్రెగ్నెన్సీ రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ (టీనేజ్‌ ప్రెగ్నెన్సీ) ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
  • దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.