Pawan Kalyan: గూండాలకు యోగి ట్రీట్‌మెంటే కరెక్ట్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, రాజమహేంద్రవరం: ‘ప్రతిపక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడలేదు. ఇప్పుడు మళ్లీ మేమొస్తాం.. ఒక్కొక్కరినీ చంపేస్తాం అంటున్నారు. మీరు బాధ్యతగా విమర్శిస్తే సరే.. గీత దాటి మాట్లాడితే చేతి రేఖలు లేకుండా చేస్తాం’ అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పనులు చేసే గుత్తేదారులను మేమొచ్చాక జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఏదైనా మాట్లాడాలంటే అధికారులు భయపడుతున్నారు. ఎందుకని అడిగితే వాళ్ల వెనుక రౌడీలు, కిరాయి హంతకులు ఉంటారని చెవిలో చెబుతున్నారు. మీకు యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్‌మెంట్ కరెక్ట్. రౌడీయిజం అన్నారో కాళ్లకు కాళ్లు, కీళ్లకు కీలు తీసి కూర్చోబెడితే సరిపోతుంది. ప్రభుత్వం తలచుకుంటే వామపక్ష తీవ్రవాదం లాంటి బలమైన వ్యవస్థే కకావికలమైన పరిస్థితి. అలాంటిది ఇన్ని వేల మంది పోలీసులు, వందల మంది ఐపీఎస్‌లు, డీఎస్పీలు తలుచుకుంటే ఎంత? 48 గంటల్లో కిరాయి గ్యాంగ్‌లు నిర్వహించే వ్యక్తుల వివరాలు సేకరించి, ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇటువంటి మాటలు మళ్లీ రావు. అక్కడిదాకా తీసుకెళ్లకండి’ అని హెచ్చరించారు. పిఠాపురంలాంటి చోట్ల పిల్లల మధ్య కులాల చిచ్చు పెట్టే స్థాయికి దిగజారతారా? రాజకీయాల గురించి మాట్లాడేందుకు వేరే దారులు లేవా అని మండిపడ్డారు. బెదిరించేవారు ఎవరైనా సరే.. పవన్‌కల్యాణ్ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా స్పందిస్తాడని స్పష్టం చేశారు.
పోయే ముందు చాలామంది తాట తీసేస్తా
సామాజిక మాధ్యమాల్లో, విదేశాల్లో కూర్చొని మాట్లాడేవారితో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేమొస్తాం, వచ్చి ఏదో చేస్తామంటున్నారు. మీరు (వైకాపానుద్దేశించి) వచ్చినప్పుడే ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మీ బెదిరింపులకు భయపడతామా? పద్ధతి మార్చుకోండి.. మీరు పాత పద్ధతిలోనే చేస్తామంటే నేనూ విసిగిపోయా. ఒక ఆశయం కోసం నా ప్రాణాలు పోయినా లెక్కచేయను. కానీ పోయే ముందు చాలామంది తాట తీస్తా. అడ్డగోలుగా ఏదైనా చేసేస్తామని అంటే రోమాలు తీసి కూర్చోబెడతాం’ అని హెచ్చరించారు.
ధైర్యం లేని నాయకులెందుకు?
‘రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. విభజన వద్దన్నారే తప్ప మాకొచ్చే నష్టం ఇది అని చెప్పలేదు. మాట్లాడితే కొడతారని, వ్యాపారాలు పోతాయనే భయం. అంత దరిద్రపుగొట్టు బతుకులెందుకు? ధైర్యం లేని నాయకులెందుకు? పొట్టిశ్రీరాములు 56 రోజుల ఆమరణ దీక్షతో ప్రాణత్యాగం చేసి తెచ్చిన రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఒక్కరూ మాట్లాడరు. నాయకులు చేసే తప్పులకు ప్రజలను ఎలా శిక్షిస్తారు? అంతా కుల సమూహాలతో కొట్టుకుంటున్నారు. కొందరు నాయకులు అదే కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
అలా చేస్తే వారికి, మనకు తేడా ఏంటి?
కలెక్టర్, ఎస్పీల సమావేశంలో రౌడీయిజం, బెదిరింపులపై చర్చకు వచ్చింది. ఉత్తరాంధ్రలో కొందరు బెదిరిస్తున్నారంటే ఒకటే చెప్పా.. రౌడీయిజం చేసినవాళ్లను పంపించేసి మనం వచ్చాం కదా? మనం అలా చేస్తే వాళ్లకు, మనకు తేడా ఏంటని ప్రశ్నించాం. ప్రభుత్వంలో నిర్మాణాత్మక భాగస్వామిగా ఉన్నాం. ప్రతి విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తాం. వైకాపా అంటే గౌరవం ఉంది. అక్కడ బొత్స లాంటి నాయకులున్నారు.. మా పార్టీలోకి సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాస్ వచ్చారు. అప్పుడు, ఇప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ప్రధాని కూడా వెనుకాడుతున్నారు
తాను ప్రసంగిస్తున్న సమయంలో కేరింతలు కొడుతున్న యువతను పవన్ కల్యాణ్ వారించారు. ఈ ఉత్సాహం వల్ల తాను హాజరయ్యే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కూడా వెనుకాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను బాహుబలి అంటూ సంబోధించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. ‘ఆయన ఒక్కోసారి మాట్లాడితే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోతేనే మంచిది అనిపిస్తుంది.. ఆయనే ఆరడుగుల బుల్లెట్’ అని అనడంతో వేదికపై నవ్వులు విరిశాయి.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:17 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రాజావారి కోట కాదిది.. పోలీసు ఠాణానే రాజుల కాలంలోని కోట తరహాలో కనిపిస్తున్న ఈ భవనం పోలీస్‌స్టేషన్ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాకినాడ జిల్లాలోని కోటనందూరు ఠాణా ఇది.
- క్లిక్ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో! ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో నకిలీ చలానాలు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. వీరు పంపించే చలానాలు అసలు వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండడంతో ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు.
- ‘యువగళం’ గుర్తు.. సైకిల్! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఆ సందర్భం గుర్తుండిపోయేలా చేస్తున్నారు.
- నాటి వైభోగం.. నేటి జ్ఞాపకం గోకర్ణం, గంగాళం, ముక్కుపొడుం మీనా, ధూమం అరలు, శకుంతలపాత్ర, పూలబుట్టలు, కావడి పెట్టె, మర చెంబులు.. ఏంటివన్నీ అనుకుంటున్నారా?
- నేడు రాజధానికి బిల్‌గేట్స్ బృందం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించనున్నారు.
- రాకింగ్.. రామసుబ్బమ్మా! జీవితంలో గెలవాలంటే ఏ వయసులోనైనా ప్రయత్నించి, విజయం సాధించొచ్చు అనడానికి ఈ బామ్మే ఉదాహరణ.
- గిరులన్నీ.. భక్త జన సిరులు ఎటు చూసినా పారవశ్యం... భక్తజన కోలాహలం.. మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు రద్దీగా మారాయి.. ఆధ్యాత్మికతను పంచాయి.
- సుబ్బారెడ్డి సేవలోనే చిన్నప్పన్న వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన కదురు చిన్నప్పన్న.. అప్పటి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదు అంతకు మించి నమ్మినబంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమయ్యింది.
- శివరాత్రి వేళ.. పుష్కరాలకు సన్నాహాలు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు సన్నాహక చర్యల్లో భాగంగా.. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన భక్తుల రద్దీని అధికారులు శాస్త్రీయంగా అంచనా కట్టారు.
- ఆదిత్యుని సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆయలం, విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.
- కాలచక్ర మ్యూజియానికి నిర్లక్ష్యపు గ్రహణం బౌద్ధారామాల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన కాలచక్ర మ్యూజియంపై నిర్లక్ష్యం కమ్ముకుంది.
- కర్నూలులో నల్లరెక్కల తెల్లడేగ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని పంట పొలాల్లో నల్లటి రెక్కల తెల్ల డేగ కనిపించింది. రైతులు దీన్ని తమ నేస్తంలా భావిస్తారు.
- 4 నగరాలు.. రూ. 2 వేల కోట్ల లక్ష్యం కొత్త ఆర్థిక సంవత్సరంలో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (యూసీఎఫ్) కింద రూ.2వేల కోట్లు సమీకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
- ర్యామ్, చిప్‌ల కొరతతో.. ఎలక్ట్రానిక్ పరికరాల ధరలకు రెక్కలు మీరు మొబైల్ మార్చాలని.. కొత్త ల్యాప్‌టాప్ కొనాలని.. కంప్యూటర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి.
- ఈ బడ్జెట్.. రాష్ట్రాభివృద్ధికి సరైన రోడ్‌మ్యాప్ అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్? దక్షిణమధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్‌కు అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది.
- ‘అగ్నివీర్’ నియామకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు రిక్రూట్‌మెంట్ అధికారి, గుంటూరు డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు.. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
- కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ (టీనేజ్ ప్రెగ్నెన్సీ) ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
- దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
English Translation
- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Today, Rajamahendravaram: 'Not in opposition The Chief Minister of yesteryear and the leaders of that party are talking threateningly. You were not afraid of your threats and tyranny when you were in power. They say that now we will do it again.. We will kill each and every one of them. It's okay if you criticize responsibly... If you cross the line, we will do it without hand lines,' warned Janasena chief and Deputy Chief Minister Pawan Kalyan. Pawan made these comments at a public meeting organized on the occasion of the foundation stone laying of the 'Amarajeevi Jaladhara' project in Peravali of East Godavari district. Officials are afraid to say anything. If you ask why, they will tell you that there are bullies and hired killers behind them. Yogi Adityanath type treatment is correct for you. It is enough to take out the legs and joints of those who say rowdyism and sit down. A strong system like left-wing extremism is a dire situation for the government. How many thousands of policemen, hundreds of IPS and DSPs are involved in such a thing? If the details of the mercenary gangs are gathered and a political decision is taken within 48 hours such words will not come again. Do not take it there', he warned. Will it go down to the level of caste division among children in places like Pithapuram? They asked if there are other ways to talk about politics. Anyone who threatens.. He made it clear that Pawan Kalyan will react the same whether he is in power or not.
Many will clap before leaving
In social media, including those who are sitting and speaking abroad, they are saying that we will sit here in the future and come and do something. What couldn't you do when you came (with the purpose of vaikapana)? Are we afraid of your threats now? Change the way.. I'm tired of you doing it the old way. I will not count my life for an ambition. But before leaving, many take a palm. He warned that we will do something wrong, that is, we will pull hairs and make them sit.
Why leaders without courage?
'When the state was divided, not a single MP spoke. I did not say that this is the loss that we will suffer except that we do not want division. They are afraid of being beaten up if they speak up and of losing their businesses. Why live so poor? Why leaders without courage? No one will speak if injustice is done to the state brought by Pottisri Ramulu by sacrificing his life for 56 days of death initiation. How do leaders punish people for their mistakes? Everything is clashing with caste groups. Some leaders want the same.
If we do that, what is the difference between them and us?
In the meeting of Collector and SP, there was a discussion on rowdyism and threats. Let's say that some people are threatening in Uttarandhra. We asked what would be the difference between them and us if we do that. We are a constructive partner in the government. We will tell you everything exactly. Vaikapa means respect. There are leaders like Botsa.. Samineni Udayabhanu and Balineni Srinivas came to our party. Then, they are still balanced.
Prime Minister is also hesitating
Pawan Kalyan scolded the youth who were making merry during his speech. He commented that Prime Minister Modi is also hesitant to participate in the programs that he attends due to this enthusiasm. Tadepalligudem MLA Bolishetti addressed Srinivas as Baahubali. Addressing Deputy Raghuramakrishna Raju.. 'It would be good if he spoke once in a while. In some cases, it is better not to speak.. He is a six-foot bullet.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:17 IST
Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Rajavari Kota is not.. Police station This building, which looks like a fort in the days of the kings, is a police station, and no one will be surprised. This is Kotanandur thana in Kakinada district.
- Think before you click bro! Cyber criminals are robbing the recipient by sending fake challans in the name of traffic violations. As the bills sent by them are not at all different from the original ones, more people are falling over. As it has been three years since Nara Lokesh started the 'Yuvagalam' padayatra while he was in the opposition, Sripotti Sriramulu Nellore district TDP MLAs are making the occasion memorable. Gokarnam, Gangalam, Nukapodum Meena, Dhumam Aralu, Shakuntalapatra, Flower Baskets, Kavadi Pette, Mara Chembulu... What do you want?
- Billgates team to the capital today. Founder Chairman of Gates Foundation Bill Gates will visit Amaravati on Monday.
- Rocking.. Ramasubbamma! This lady is an example that if you want to win in life, you can try and succeed at any age. No matter where you look, it's ecstasy... Devotees' uproar... On the occasion of Maha Shivratri, Shiva temples in the state have become crowded. Kaduru Chinnappanna, the key accused in the case of supply of lakhs of kg adulterated ghee to Tirumala during Vaikapa's reign.. The then Thithide Chairman YV Subbareddy is not only a PA but more than that, it has already become clear with irrefutable evidence. As part of the preparations for the management of Godavari pushkaras next year.. Officials have scientifically estimated the crowd of devotees on the banks of the Godavari at Rajamahendravaram on the occasion of Mahashivaratri on Sunday.
- Supreme Judge in the service of Aditya Supreme Court judge Justice Sanjay Karol on Sunday visited Suryanarayanaswamy Ayalam in Arasavalli, Srikakulam district and Simhadri Appanna Swamy Devasthanam in Visakhapatnam. The Kalachakra Museum set up in Amaravati of Palnadu district to convey the history of Buddhist Rama to posterity has been neglected.
- Black-winged white eagle in Kurnool. A black-winged white eagle was spotted in the crop fields on the outskirts of Kodumuru town in Kurnool district. Farmers consider this as their friend.
- 4 cities.. Rs. 2 thousand crore target In the new financial year, the government is planning to raise Rs.2 thousand crores under the Urban Challenge Fund (UCF). Are you thinking of changing your mobile..buying a new laptop..upgrading your computer..? Wait a minute.
- This budget is the right roadmap for the development of the state. BJP state president Madhav stated that the budget 2026-27 presented in the assembly on Saturday has prepared a clear road map for the development of the state.
- New railway zone from April 1? The process of realignment of South Central Railway has reached its final stage. It is learned that the central government will soon announce the appointed day for the new railway zone. Recruitment Officer, Guntur Director Colonel Rajat Suwarna said in a statement on Sunday that online registration and acceptance of applications for army recruitment has been started. Jana Sena President and Deputy Chief Minister Pawan Kalyan said that those who recognize the hardships of workers working at the field level. Teenage pregnancy in the state is a cause for concern. This problem is acute in 25 districts.
- Special fund for long term goals Keeping in view the long-term economic goals, the government has set up the AP Wealth Fund with Rs.100 crores.