ధ్యానం.. ఆరోగ్య మార్గం

- A
- A+
- A++

ఈనాడు డిజిటల్, తిరుపతి : కంటి నిండా నిద్ర.. మనసు నిండా ప్రశాంతత.. ఈ రెండు ఉంటే చాలు ఏ రోగమైనా పరార్! కానీ నేటి జీవనశైలిలో ఇవే కరవయ్యాయి. ఆధునిక కాలంలో వస్తున్న అనేక మానసిక, శారీరక రుగ్మతలకు ధ్యానం ఒక దివ్యౌషధంలా పనిచేస్తోంది. కేవలం కళ్లు మూసుకోవడం మాత్రమే కాదు, అంతర ప్రయాణం ద్వారా మెదడును రీఛార్జ్ చేసుకోవడమే అసలైన మెడిటేషన్. నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం వేళ ప్రత్యేక కథనం..
శరీరానికి వ్యాయామం ఎలాగో..
మనిషి జీవనశైలి మారింది. ఒత్తిడి, ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల మాయలో పడిపోతూ, తన లోపలి ప్రశాంతతను కోల్పోతున్నాడు. దీంతో అనేక మానసిక, శారీరక రుగ్మతలు మనిషిని చుట్టుముడుతున్నాయి. వీటన్నింటికీ సులువైన, ఖర్చులేని దివ్యౌషధం ‘ధ్యానం’. ఇది ఒక శాస్త్రీయ ప్రక్రియ. మనం నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో ధ్యానం చేసినప్పుడు మెదడులోని ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ అనే భాగం చురుగ్గా మారుతుంది. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది. ఆరోగ్యం సైతం మెరుగ్గా ఉంటుంది.
ఎక్కడెక్కడ కేంద్రాలున్నాయంటే
- తిరుపతి నగరంలోని పీకే లేఅవుట్, కొర్లగుంట, మంగళం రోడ్డు, ఎం.ఆర్. పల్లి, తిరుచానూరు, ఆటోనగర్ , చంద్రగిరి రూట్, తుమ్మలకుంట, చెర్లోపల్లి, వైకుంఠపురం వరకు దాదాపు 25 కేంద్రాలు సేవలందిస్తున్నాయి.
- చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, కుప్పం, బంగారుపాళ్యం .. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక సర్వీస్ సెంటర్ చొప్పున జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు ఉన్నాయి..
ఆధునిక సైన్స్ ఏం చెబుతోంది?
- ధ్యానం వల్ల శరీరంలో ఒత్తిడి కలిగించే ‘కార్టిసోల్’ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.
- జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
- రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ధ్యానంతో నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
నేను 2022 నుంచి హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతిలో ధ్యానం చేస్తున్నాను. బీటెక్ పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలి? ఉద్యోగమా లేక వ్యాపారమా? అనే విషయంలో గందరగోళంగా ఉండేది. ధ్యానం ప్రారంభించిన తర్వాతే నా ఆలోచనల్లో స్పష్టత రావడం మొదలైంది. సరైన నిద్రతో పాటు నా మీద నాకు నమ్మకం పెరిగింది.
36 ఏళ్లుగా ధ్యానం చేస్తున్నాను. నా దృష్టిలో ధ్యానం అంటే మనసును అదుపులో ఉంచుకోవడం. వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేస్తున్నా. ((ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం నన్ను మార్చింది. మన ఆలోచనలే మన ఆరోగ్యాన్ని శాసిస్తాయి.
వివరాలకు: 94418 63829
► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కీచకులున్నారు జాగ్రత్త! [ 19-02-2026] జిల్లాలో చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఓ ఘటన మరచిపోక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- కల్యాణం.. కడు రమణీయం [ 19-02-2026] జగద్రక్షకుడైన కైలాసవాసి కల్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్కందరాత్రిని పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి, బుధవారం వేకువజామున కల్యాణోత్సవ క్రతువును ఆగమోక్తంగా జరిపారు.
- పరిహారం ఇస్తే పనులకు రెక్కలు [ 19-02-2026] కుప్పం విమానాశ్రయం.. ఏడేళ్లుగా ఉన్న ప్రతిపాదన. గత వైకాపా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అవసరం లేదంటూ జగన్ సర్కార్ కేంద్రానికి స్పష్టం చేసింది.
- గంజాయి.. వయా తిరుపతి! [ 19-02-2026] ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొంతమంది యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. ఈక్రమంలోనే ఉన్మాదులుగా మారి దోపిడీలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.
- కవరు కట్టు.. లాభాలు పట్టు [ 19-02-2026] జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. వాతావరణం అనుకూలించకపోవడం, చీడపీడలు, మార్కెటింగ్ సమస్యలు ఏటా మామిడి రైతాంగాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
- పుష్కరిణి.. ప్రాభవంతో ప్రసిద్ధి [ 19-02-2026] పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో పురాణ ప్రాభవానికి సంబంధించి ఎన్నో ఆనవాళ్లు కన్పిస్తుంటాయి.
- తమిళనాడులో రూ.75 కోట్ల ఆస్తుల స్వాధీనం [ 19-02-2026] తిరుపతి హథీరాంజీ మఠానికి ఆస్తులు, భూములు తమిళనాడులోనూ ఉన్నాయి. అందులోని కొందరి చెరలో ఉన్న విలువైన ఆస్తులను బుధవారం మఠం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- వరకట్న వేధింపులు.. డాక్టర్‌కి ఆరు నెలల జైలుశిక్ష [ 19-02-2026] తిరుపతి మహిళా పోలీసుస్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో భర్తకి ఆరునెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గ్రంథి శ్రీనివాస్ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఏపీపీ సుజాత, కోర్టు లైజన్ అధికారులు తెలిపారు.
- లిఫ్ట్ అడిగి.. మెడలో గొలుసు కాజేసి.. [ 19-02-2026] ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి బంగారు గొలుసు కాజేసిన ఘటన తిరుపతి రూరల్‌లో చోటుచేసుకుంది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. ‘పేరూరు గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.