TG News: తెలంగాణలో పీఏసీఎస్‌లు, డీసీసీబీల పాలక వర్గాలు రద్దు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. టెస్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎస్‌లకు అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించేలా సహకార శాఖ ఉత్తర్వులు జారీ రేసింది. రాష్ట్రంలోని 904 పీఏసీఎస్‌లు, 9 డీసీసీబీలతో పాట టెస్కాబ్ పాలక మండళ్ల పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇంచార్జి మేనేజింగ్ కమిటీలుగా 6 నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోను రద్దు చేస్తూ పీఏసీఎస్, డీసీసీబీలు, టెస్కాబ్‌కు అధికారులను ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీసీసీబీలు, కొత్త మండలాల ప్రకారం పీఏసీఎస్‌లను పునర్‌వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 20:12 IST