SIR: ఎస్‌ఐఆర్: తమిళనాడు, గుజరాత్‌లో లక్షల్లో ఓట్ల తొలగింపు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపడుతోంది. ఇప్పటికే తొలి విడత ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. గత జాబితాతో పోలిస్తే 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల ఓటర్లు ఉండగా.. ప్రస్తుత జాబితాలో 5.43 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. తొలిగించిన వారిలో 27 లక్షల మంది మృతి చెందగా.. 66 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని, మరో 3.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటు హక్కు కోల్పోయిన వారు జనవరి 18లోగా అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ అవకాశం కల్పించింది.
గుజరాత్‌లో 73.73 లక్షల ఓట్లు తొలగింపు
మరోవైపు గుజరాత్‌కు సంబంధించిన ఓటరు ముసాయిదా జాబితాను కూడా ఈసీ ప్రకటించింది. మొత్తం 73.73 లక్షల ఓట్లను తొలగించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 5.08 కోట్ల మంది ఓటర్లకు గానూ.. ముసాయిదా జాబితాలో 4.34 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. తొలగించిన వారిలో 18 లక్షల మంది మృతి చెందగా, 40 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని, 3.81 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉందని ఈసీ వెల్లడించింది. గుజరాత్‌లో నవంబర్ 4న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఈసీ.. డిసెంబర్ 14తో ముగించింది. అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 18 వరకు అవకాశం కల్పించింది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :