Hyderabad: సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రెజిమెంటల్ బజార్: రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మోండా మార్కెట్‌లోని శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ అలముకోవడంతో మార్కెట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 20:21 IST