Hyderabad: సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Eenadu icon
By Crime News Team Updated : 19 Dec 2025 20:46 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రెజిమెంటల్ బజార్: రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మోండా మార్కెట్‌లోని శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ అలముకోవడంతో మార్కెట్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన దుకాణంలో ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 20:21 IST

English Translation

Hyderabad: Fire accident in Secunderabad Monda market.. Huge traffic jam

Eenadu icon
By Crime News Team Updated : 19 Dec 2025 20:46 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Regimental Bazaar: A fire broke out in the busy Monda market of Secunderabad on Friday night. A fire broke out at Sri Rama Enterprises shop in Monda market and the locals panicked. Due to thick smoke, the traffic in the vicinity of the market was blocked. Firefighters reached the spot and controlled the fire from spreading to other shops. The fire department officials said that the accident was high due to the presence of plastic items in the shop where the fire occurred. target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 20:21 IST