
ఆ రెండూ కలిస్తే.. మరింత ప్రమాదకరం!

- A
- A+
- A++

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలుసు. ఈ రెండూ కలిస్తే మరింత ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు. వీటి అలవాటుకు కూడా ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందంటున్నారు.
- మామూలుగా ధూమపానం చేయనివారు కూడా, మద్యం తాగేటప్పుడు దమ్ము లాగుతుంటారు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అని ఆరా తీశారు సీసీఎంబీ పరిశోధకులు. పొగాకులోని నికోటిన్ మద్యం తాగాలనే కోరికను పెంచుతుందని... మద్యం తాగినవారికి నికోటిన్ తీసుకోవాలనే కోరిక మరింత బలపడుతుందని వారి పరిశోధనలో తేలింది.
- ఆల్కహాల్, నికోటిన్ పదేపదే తీసుకోవడంతో మెదడులోని అభ్యాస సర్క్యూట్‌లో అవి జతగా మారతాయని... దీంతో ఒకటి తీసుకుంటే, ఇంకోటీ కావాలనిపిస్తుందని వివరిస్తున్నారు.

- ఈ తీరు వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని, ప్రాణాంతకం కూడా అవుతుందంటున్నారు సీసీఎంబీ నిపుణులు. ఈ రెండు వ్యసనాలు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడంతోపాటు మానసిక సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు.
- విడివిడిగా ఈ వ్యసనాలను తగ్గించడానికి, మాన్పించే చికిత్సకు మందులు ఉన్నాయి. అయితే రెండూ అలవాటు ఉన్న వారిలో చికిత్స అంత ప్రభావమంతంగా లేదు. ఒకదాన్ని లక్ష్యంగా చికిత్స అందిస్తే.. మరొకటి ఎక్కువ తాగాలనే భావనకు దారితీస్తుంది.
- మద్యం, పొగాకు ఒకదానితో ఒకటి జత కూడేందుకు కారణం గ్లూటమేట్. ఇది మెదడులోని అతిపెద్ద ఉత్తేజకరమైన న్యూరో ట్రాన్స్‌మీటర్. ఆల్కహాల్, నికోటిన్ తీసుకోవడం ద్వారా గ్లూటమేట్ పెరుగుతుంది. దీంతో ఏకకాలంలో వ్యవసనాలు మాన్పించాలంటే పరిస్థితి మరింతగా దిగజారుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మందులు నికోటిన్, మద్యం రెంటింటినీ మాన్పించే లక్ష్యంగా ఉండాలంటున్నారు.
- మెదడులోని న్యూరానల్ కణాలు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయి? ఈ ప్రక్రియపై నికోటిన్, ఆల్కహాల్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే ఒక అవగాహన ఉంది. న్యూరాన్లు, అవి విడుదల చేసే రసాయనాల(న్యూరో ట్రాన్స్‌మీటర్)తో ఆనందం, విశ్రాంతితో సహా అనేక రకాల అనుభూతులు కలుగుతాయి.
ఏదైనా వ్యసనాన్ని డోపమైన్ అనే రసాయనం విడుదల ద్వారా విస్తృతంగా అర్థం చేసుకోవచ్చు. మద్యం, నికోటిన్ వంటివి కలిపి తీసుకున్నప్పుడు డోపమైన్ ఎక్కువగా విడుదలవుతుంది.
- ఇక్కడ రివార్డు సర్క్యూట్రీ అని పిలిచే ప్రక్రియలో పాలుపంచుకునే కొన్ని న్యూరాన్‌లను ఉత్తేజపరచడంతో అనందమనే అనుభూతి, ఆ అనుభూతిని మళ్లీ కలిగించే పదార్థాన్ని ఎక్కువగా తీసుకునేలా వ్యక్తులను బలవంతం చేస్తుంది. ఆహారం, శృంగారం, సామాజిక సంబంధాలు ఈ సర్క్యూట్రీని యాక్టివేట్ చేస్తాయి. అయితే మెదడు పనితీరు రివార్డ్ సర్క్యూట్రీ కంటే చాలా విస్తృతమైందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
- అతిపెద్ద ఉత్తేజకరమైన న్యూరోట్రాన్స్‌మీటర్ గ్లూటమేట్ అయితే.. మెదడులో అత్యంత సమృద్ధిగా ఉన్న నిరోధక న్యూరో ట్రాన్స్‌మీటర్ గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్(గాబా). ఈ రెండూ కలిసి ఆల్కహాల్, నికోటిన్ ఒకదానిపై ఒకటి ఆధారపడటంలో పాత్ర పోషిస్తున్నాయి.
- రివార్డ్ సర్క్యూట్రీలో ఆల్కహాల్ మాత్రమే డోపమైన్ విడుదలను పెంచడం ద్వారా ఉద్దీపనగా పనిచేస్తుంది. ఆనందం, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. రక్తంలో ఆల్కహాల్ సాంద్రత పెరిగే వరకు ఈ భావాలు ఉంటాయని సీసీఎంబీ పరిశోధకురాలు ప్రజక్త బియానీ తెలిపారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్‌లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.