ఆ రెండూ కలిస్తే.. మరింత ప్రమాదకరం!

Eenadu icon
By Telangana News Desk Published : 19 Dec 2025 18:16 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలుసు. ఈ రెండూ కలిస్తే మరింత ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు. వీటి అలవాటుకు కూడా ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందంటున్నారు. 

  • మామూలుగా ధూమపానం చేయనివారు కూడా, మద్యం తాగేటప్పుడు దమ్ము లాగుతుంటారు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అని ఆరా తీశారు సీసీఎంబీ పరిశోధకులు. పొగాకులోని నికోటిన్‌ మద్యం తాగాలనే కోరికను పెంచుతుందని... మద్యం తాగినవారికి నికోటిన్‌ తీసుకోవాలనే కోరిక మరింత బలపడుతుందని వారి పరిశోధనలో తేలింది.
  • ఆల్కహాల్, నికోటిన్‌ పదేపదే తీసుకోవడంతో మెదడులోని అభ్యాస సర్క్యూట్‌లో అవి జతగా మారతాయని... దీంతో ఒకటి తీసుకుంటే, ఇంకోటీ కావాలనిపిస్తుందని వివరిస్తున్నారు. 

  • ఈ తీరు వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని, ప్రాణాంతకం కూడా అవుతుందంటున్నారు సీసీఎంబీ నిపుణులు. ఈ రెండు వ్యసనాలు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడంతోపాటు మానసిక సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు.  
  • విడివిడిగా ఈ వ్యసనాలను తగ్గించడానికి, మాన్పించే చికిత్సకు మందులు ఉన్నాయి. అయితే రెండూ అలవాటు ఉన్న వారిలో చికిత్స  అంత ప్రభావమంతంగా లేదు. ఒకదాన్ని లక్ష్యంగా చికిత్స అందిస్తే.. మరొకటి ఎక్కువ తాగాలనే భావనకు దారితీస్తుంది.
  • మద్యం, పొగాకు ఒకదానితో ఒకటి జత కూడేందుకు కారణం గ్లూటమేట్‌. ఇది మెదడులోని అతిపెద్ద ఉత్తేజకరమైన న్యూరో ట్రాన్స్‌మీటర్‌. ఆల్కహాల్, నికోటిన్‌ తీసుకోవడం ద్వారా గ్లూటమేట్‌ పెరుగుతుంది. దీంతో ఏకకాలంలో వ్యవసనాలు మాన్పించాలంటే పరిస్థితి మరింతగా దిగజారుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మందులు నికోటిన్, మద్యం రెంటింటినీ మాన్పించే లక్ష్యంగా ఉండాలంటున్నారు.
  • మెదడులోని న్యూరానల్‌ కణాలు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయి? ఈ ప్రక్రియపై నికోటిన్, ఆల్కహాల్‌ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే ఒక అవగాహన ఉంది. న్యూరాన్లు, అవి విడుదల చేసే రసాయనాల(న్యూరో ట్రాన్స్‌మీటర్‌)తో ఆనందం, విశ్రాంతితో సహా అనేక రకాల అనుభూతులు కలుగుతాయి.

ఏదైనా వ్యసనాన్ని డోపమైన్‌ అనే రసాయనం విడుదల ద్వారా విస్తృతంగా అర్థం చేసుకోవచ్చు. మద్యం, నికోటిన్‌ వంటివి కలిపి తీసుకున్నప్పుడు డోపమైన్‌ ఎక్కువగా విడుదలవుతుంది.

  • ఇక్కడ రివార్డు సర్క్యూట్రీ అని పిలిచే ప్రక్రియలో పాలుపంచుకునే కొన్ని న్యూరాన్‌లను ఉత్తేజపరచడంతో అనందమనే అనుభూతి,  ఆ అనుభూతిని మళ్లీ కలిగించే పదార్థాన్ని ఎక్కువగా తీసుకునేలా వ్యక్తులను బలవంతం చేస్తుంది. ఆహారం, శృంగారం, సామాజిక సంబంధాలు ఈ సర్క్యూట్రీని యాక్టివేట్‌ చేస్తాయి. అయితే మెదడు పనితీరు రివార్డ్‌ సర్క్యూట్రీ కంటే చాలా విస్తృతమైందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
  • అతిపెద్ద ఉత్తేజకరమైన న్యూరోట్రాన్స్‌మీటర్‌ గ్లూటమేట్‌ అయితే.. మెదడులో అత్యంత సమృద్ధిగా ఉన్న నిరోధక న్యూరో ట్రాన్స్‌మీటర్‌ గామా అమినోబ్యూట్రిక్‌  యాసిడ్‌(గాబా). ఈ రెండూ కలిసి ఆల్కహాల్, నికోటిన్‌ ఒకదానిపై ఒకటి ఆధారపడటంలో పాత్ర పోషిస్తున్నాయి.
  • రివార్డ్‌ సర్క్యూట్రీలో ఆల్కహాల్‌ మాత్రమే డోపమైన్‌ విడుదలను పెంచడం ద్వారా ఉద్దీపనగా పనిచేస్తుంది. ఆనందం, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. రక్తంలో ఆల్కహాల్‌ సాంద్రత పెరిగే వరకు ఈ భావాలు ఉంటాయని సీసీఎంబీ పరిశోధకురాలు ప్రజక్త బియానీ తెలిపారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

English Translation

If those two combine..more dangerous!

alt="Eenadu icon" class="img-fluid rounded">By Telangana News Desk Published : 19 Dec 2025 18:16 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Smoking and drinking are known to be harmful to health. Researchers say that combining these two is more dangerous. It is said that these habits are also related to each other. 

  • Even people who don't smoke regularly, tend to pull their bowels when they drink alcohol. Is there any connection between the two? asked CCMB investigators. Their research has shown that the nicotine in tobacco increases the desire to drink alcohol... and the desire to take nicotine is stronger for those who drink alcohol.
  • They explain that alcohol and nicotine become paired in the learning circuit of the brain with repeated intake... This explains that if you take one, you want nicotine. 

  • CCMB experts say that this method increases the risk of diseases even more and becomes fatal. Both these addictions are said to increase the risk of cancer and heart disease and lead to psychological problems.  
  • To reduce these addictions separately, there are drugs for withdrawal treatment. However, the treatment was less effective in those with both habits. Targeting one leads to the other leading to binge drinking.
  • Glutamate is the reason why alcohol and tobacco go together. It is the largest excitatory neurotransmitter in the brain. Alcohol and nicotine increase glutamate. The researchers say that the situation will get worse if we want to get rid of the dependence at the same time. In this context, the new drugs should be aimed at stopping both nicotine and alcohol.
  • How do the neuronal cells in the brain communicate with each other? There is already an understanding of the effect of nicotine and alcohol on this process. Neurons and the chemicals they release (neurotransmitters) cause a variety of sensations, including pleasure and relaxation.

Any addiction can be broadly defined by the release of a chemical called dopamine. Dopamine is released more when alcohol and nicotine are taken together.

  • Here the feeling of pleasure stimulates certain neurons involved in a process called reward circuitry, forcing people to consume more of the substance that produces that feeling again. Food, sex, and social interactions activate this circuitry. But recent studies have shown that brain function is much broader than reward circuitry.
  • The most abundant excitatory neurotransmitter is glutamate, but the most abundant inhibitory neurotransmitter in the brain is gamma aminobutyric acid (GABA). Both of these together play a role in the dependence of alcohol and nicotine on each other.
  • Alcohol alone acts as a stimulant in the reward circuitry by increasing the release of dopamine. Brings joy and happiness. CCMB Researcher Prajakta Biyani said that these feelings remain until the concentration of alcohol in the blood increases. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :

    Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • Standing.. Sit.. Investigating the case of betting apps not moving forward The Special Investigation Team (SIT), which was set up with much fanfare to crack down on betting apps that are taking innocent lives, is limited to the name. Prime Minister Narendra Modi said that 'India AI Impact Expo-2026' is a powerful combination of ideas, innovations and determination.
    • Cinema actress Pratyusha death case.. Siddharth Reddy was sentenced to two years in prison The Supreme Court has upheld the two-year jail sentence imposed by the Telangana High Court on Gudipalli Siddharth Reddy, the accused in the case of actress Pratyusha's death, which created a sensation in the united Andhra Pradesh two decades ago. Actor and Chancellor of Mohanbabu University (MBU) Mohanbabu has faced a setback in the AP High Court in the kidnapping case of student leaders. On the occasion of the International Fleet Review (IFR), President Draupadi Murmu hosted a presidential banquet at the ENC Officers' Mess, Visakhapatnam on Tuesday night.
    • Hand of fortune in Hung Out of the 11 municipalities where the chairperson elections were postponed, the process was completed in 8 places on Tuesday.
    • Telangana State as Bio World 'Bio Asia is going beyond its name.. becoming Bio World. Looking at this meeting, I can proudly say that Telangana will grow as a bio world.
    • Rs. 1,700 crore investment Telangana received an investment of Rs.1,700 crore on Tuesday as the venue of the Bio Asia 2026 conference.
    • Family members should be clear about values and policies. When all the family members have a clear understanding of the policies to be followed and the values to be followed in the construction of business enterprises.. Shailaja Kiran, MD, Margadarshi Chitfunds said that family businesses can survive for a long time.
    • Your toilet is your doctor. Technological changes are coming in the field of medicine and health. Medical diagnostic tests are getting easier.
    • Old fees in 70 engineering colleges The Telangana Admissions and Fees Control Committee (TAFRC) will give a shock to some private engineering colleges in the state.
    • Dan.. Simba.. Leo Dan.. Simba.. Leo.. Charlie.. Tyson.. Rana.. Virat..
    • Police are ready to join the armed forces. Chief Minister Revanth Reddy has directed the officials to focus on cleanliness in the three municipal corporations under the capital. Convener Acharya K.Vijayakumar Reddy revealed that new facilities have been made available to keep track of the status of APSET application and get it again even if the registration number is lost.
    • BJP is the alternative to Congress in the state. BJP state president N. Ramachander Rao has called upon the ranks to work hard to bring the party to power in the state in the future. Dr. Rechus Ella, Chief Development Officer of Bharat Biotech, said that one in every three children in the world is supplied with vaccines from India.
    • My child did not get full justice. Pratyusha's mother Sarojini Devi said that she does not feel that justice has been done to her child 100%. She spoke to 'Eenadu-ETV' here on Tuesday.
    • Words..fires..Tense situations arose in some places during the process of election of municipal chairpersons and vice-chairpersons in joint Warangal and joint Adilabad districts on Tuesday. Can't be sent back Throughout the municipal elections.. Kasula Hawaii ran. The political parties who distributed large amounts of money to the voters before the polling. After the counting, they spent crores of rupees to impress the corporators and councilors. State secretary of the party and MLA of Kothagudem Koonanneni Sambasivarao stated that the CPI won an unprecedented victory in the first election when Kothagudem was formed as a corporation.