Nara Lokesh: ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ.. పరిష్కరిస్తానని మంత్రి లోకేశ్ హామీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వైకాపా హయాంలో ఆ సర్క్యులర్ ను అమలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మంత్రి దృష్టికి తెచ్చారు.
6 వేలకు పైగా ఓటర్లు కలిగిన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్థులు నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులమనే కక్షతో వైకాపా హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్ల బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ రెండున్నర ఎకరాల భూమిని వైకాపాకు చెందిన బి.నాగిరెడ్డి, బి.శివరామిరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలెంకు చెందిన ఎమ్.శారదాంబ, ఎమ్.సునీత కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మదనపల్లెలో బాలిక హత్య.. స్పందించిన మహిళా మంత్రులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. చిన్నారి తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
- తిరునాళ్లలో మద్యం అమ్మిన హోంగార్డుపై సస్పెన్షన్ వేటు కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకల్లో విధులు నిర్వహించకుండా మద్యం విక్రయించిన హోంగార్డుపై సస్పెన్షన్ వేటు పడింది.