Upcoming IPOs: ఐపీఓ షెడ్యూల్.. వచ్చే వారం 11 ఐపీఓలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Upcoming IPOs | ఇంటర్నెట్ డెస్క్: కరోనా రెమిడీస్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్, ఐసీఐసీఐ ఏఎంసీ వంటి లిస్టింగ్‌లతో పాటు కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ వారమంతా ప్రైమరీ మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. వచ్చేవారమూ ఆ సందడి కొనసాగనుంది. డిసెంబర్ 22 నుంచి 26 మధ్య మొత్తం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఇందులో ఒకటి మెయిన్ బోర్డు కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందినవి. ఆ వివరాలు ఇవీ..
వచ్చే వారం ఐపీఓలు..
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ: వచ్చేవారం మెయిన్‌బోర్డు కేటగిరీలో గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. గుజరాత్‌లో మిడ్‌సైజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈ సంస్థ రూ.250.80 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. డిసెంబర్ 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.108-114గా కంపెనీ నిర్ణయించింది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఐపీఓ జరగనుంది.
- ఘోస్ట్ పెయిరింగ్.. వాట్సప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా?
ఎస్‌ఎంఈ కేటగిరీలో..
ఎస్‌ఎంఈ కేటగిరీలో వచ్చేవారం ఏకంగా 10 కంపెనీలు సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి. ఈపీడబ్ల్యూ ఇండియా రూ.31.81 కోట్లు, దాచేపల్లి పబ్లిషర్స్ రూ.40.39 కోట్లు, శ్యామ్‌ధనీ ఇండస్ట్రీస్ రూ.38.49 కోట్లు సన్‌డ్రెక్స్ ఆయిల్ రూ.32.25 కోట్లు చొప్పున సమీకరించనున్నాయి. డిసెంబర్ 22న ప్రారంభమై 24న వీటి సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది. ధారా రైల్ ప్రాజెక్ట్ రూ.50.20 కోట్లు, నంతా టెక్ రూ.31.81 కోట్లు, అడ్మాచ్ సిస్టమ్స్ రూ.42.60 కోట్లు, భాయ్ కాకాజీ పాలిమర్స్ రూ.105.17 కోట్లు, అపోలో టెక్నో ఇండస్ట్రీస్ రూ.47.96 కోట్లు చొప్పున సమీకరించేందుకు డిసెంబర్ 23న సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. 26న ముగియనున్నాయి. ఈ టు ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.84.22 కోట్లు సమీకరించేందుకు డిసెంబర్ 26న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. డిసెంబర్ 30న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది.
లిస్టింగ్స్ ఇవే..
మెయిన్‌బోర్డు కేటగిరీలో కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ డిసెంబర్ 22న లిస్టింగ్‌కు రానుంది. డిసెంబర్ 18న సబ్‌స్క్రిప్షన్ ముగియగా.. కేవలం 83% మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందిన నెప్ట్యూన్ లాజిటెక్ కూడా అదే రోజు లిస్ట్ అవ్వనుంది. ఇదే కేటగిరీలో మార్క్ టెక్నోక్రాట్స్, గ్లోబల్ ఓషన్ లాజిస్టిక్స్ 24న, ఫైటోకెమ్ రెమిడీస్ 26న లిస్టింగ్‌కు రానున్నాయి.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 15:23 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఏసీ కొనే ముందు ఇవి తెలుసుకోండి! వేసవి వచ్చేస్తోంది! ఈ సమయంలో ఏసీలు ఎక్కువగా కొంటుంటారు. వీటిని కొనుగోలు చేసే ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలంటే..
- పసిడి ధరలు భగభగ.. కట్టు బంగారానికి ఆదరణ బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి.
- వచ్చే 12-18 నెలలు మార్కెట్‌కు మంచి రోజులు గత ఏడాదిన్నరగా ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, ఇకపై కోలుకునే అవకాశముందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లి విశ్లేషించారు.
- అంతరిక్షంలో డేటా సెంటర్లు భూమిపై చిన్న చెత్త ముక్క పడి ఉందనుకోండి. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, అంతరిక్షంలో పరిస్థితి వేరు. అక్కడ చిన్న శకలం వేగంగా దూసుకొచ్చి ఢీకొడితే పెను ప్రమాదమే సంభవిస్తుంది.
- వేతన పెంపులు.. తగ్గేదేలే కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయడం వల్ల అధిక వేతన బిల్లులు చెల్లించాల్సి వస్తున్నప్పటికీ.. చాలా వరకు కంపెనీలు వేతన పెంపులను తగ్గించే ప్రయత్నం చేయకపోవచ్చని హెచ్‌ఆర్ అధిపతులు, వేతన నిపుణులు అంటున్నారు.
- జియో, ఆంథ్రోపిక్ వంటి 15 కంపెనీలతో కూటమి ఏర్పాటు జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి.
- విస్తరణ బాటలో అన్విత గ్రూపు స్థిరాస్తి రంగంలోని అన్విత గ్రూపు దేశంలోని, వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, దుబాయ్‌లకూ తమ ప్రాజెక్టులను విస్తరించే ప్రణాళికల్లో ఉంది.
- ఐఓబీ నుంచి మరిన్ని స్టార్టప్ బ్యాంకింగ్ శాఖలు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) తన 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్టార్టప్ బ్యాంకింగ్’ నెట్‌వర్క్‌ను విస్తరించింది.
- ట్రెన్స్‌లో 60% వాటా కొనుగోలు: ఇక్సిగో స్పెయిన్‌లోని రెండో అతి పెద్ద రైలు బుకింగ్ ప్లాట్‌ఫామ్ ట్రెన్స్‌లో 60 శాతం వాటాను 11.70 మిలియన్ యూరోలకు (రూ.125 కోట్లకు పైగా) కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో వెల్లడించింది.
- మణప్పురంలో వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్‌కు ఆర్‌బీఐ అనుమతులు పసిడి రుణాల సంస్థ మణప్పురం ఫైనాన్స్‌లో 41.66 శాతం వాటాను బెయిన్ క్యాపిటల్ కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది.
- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ రావట్లేదు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిన ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.