Upcoming IPOs: ఐపీఓ షెడ్యూల్‌.. వచ్చే వారం 11 ఐపీఓలు

Eenadu icon
By Business News Team Updated : 20 Dec 2025 16:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Upcoming IPOs | ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెమిడీస్‌, వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్‌, ఐసీఐసీఐ ఏఎంసీ వంటి లిస్టింగ్‌లతో పాటు కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ వారమంతా ప్రైమరీ మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. వచ్చేవారమూ ఆ సందడి కొనసాగనుంది. డిసెంబర్‌ 22 నుంచి 26 మధ్య మొత్తం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఇందులో ఒకటి మెయిన్‌ బోర్డు కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందినవి. ఆ వివరాలు ఇవీ..

వచ్చే వారం ఐపీఓలు..

గుజరాత్‌ కిడ్నీ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ: వచ్చేవారం మెయిన్‌బోర్డు కేటగిరీలో గుజరాత్‌ కిడ్నీ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. గుజరాత్‌లో మిడ్‌సైజ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్వహిస్తున్న ఈ సంస్థ రూ.250.80 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. డిసెంబర్‌ 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.108-114గా కంపెనీ నిర్ణయించింది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఐపీఓ జరగనుంది.

  • ఘోస్ట్‌ పెయిరింగ్‌.. వాట్సప్‌లో ఈ మెసేజ్‌ వచ్చిందా?

ఎస్‌ఎంఈ కేటగిరీలో..

ఎస్‌ఎంఈ కేటగిరీలో వచ్చేవారం ఏకంగా 10 కంపెనీలు సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి. ఈపీడబ్ల్యూ ఇండియా రూ.31.81 కోట్లు, దాచేపల్లి పబ్లిషర్స్‌ రూ.40.39 కోట్లు, శ్యామ్‌ధనీ ఇండస్ట్రీస్‌ రూ.38.49 కోట్లు సన్‌డ్రెక్స్‌ ఆయిల్‌ రూ.32.25 కోట్లు చొప్పున సమీకరించనున్నాయి. డిసెంబర్‌ 22న ప్రారంభమై 24న వీటి సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది. ధారా రైల్‌ ప్రాజెక్ట్‌ రూ.50.20 కోట్లు, నంతా టెక్‌ రూ.31.81 కోట్లు, అడ్మాచ్‌ సిస్టమ్స్‌ రూ.42.60 కోట్లు, భాయ్‌ కాకాజీ పాలిమర్స్‌ రూ.105.17 కోట్లు, అపోలో టెక్నో ఇండస్ట్రీస్‌ రూ.47.96 కోట్లు చొప్పున సమీకరించేందుకు డిసెంబర్‌ 23న సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. 26న ముగియనున్నాయి. ఈ టు ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.84.22 కోట్లు సమీకరించేందుకు డిసెంబర్‌ 26న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. డిసెంబర్‌ 30న సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది.

లిస్టింగ్స్‌ ఇవే..

మెయిన్‌బోర్డు కేటగిరీలో కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ డిసెంబర్‌ 22న లిస్టింగ్‌కు రానుంది. డిసెంబర్‌ 18న సబ్‌స్క్రిప్షన్‌ ముగియగా.. కేవలం 83% మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందిన నెప్ట్యూన్‌ లాజిటెక్‌ కూడా అదే రోజు లిస్ట్‌ అవ్వనుంది. ఇదే కేటగిరీలో మార్క్‌ టెక్నోక్రాట్స్‌, గ్లోబల్‌ ఓషన్‌ లాజిస్టిక్స్‌ 24న, ఫైటోకెమ్‌ రెమిడీస్‌ 26న లిస్టింగ్‌కు రానున్నాయి.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 15:23 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఏసీ కొనే ముందు ఇవి తెలుసుకోండి! వేసవి వచ్చేస్తోంది! ఈ సమయంలో ఏసీలు ఎక్కువగా కొంటుంటారు. వీటిని కొనుగోలు చేసే ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలంటే..
  • పసిడి ధరలు భగభగ.. కట్టు బంగారానికి ఆదరణ బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి.
  • వచ్చే 12-18 నెలలు మార్కెట్‌కు మంచి రోజులు గత ఏడాదిన్నరగా ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు, ఇకపై కోలుకునే అవకాశముందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ ధీరజ్‌ రెల్లి విశ్లేషించారు.
  • అంతరిక్షంలో డేటా సెంటర్లు భూమిపై చిన్న చెత్త ముక్క పడి ఉందనుకోండి. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, అంతరిక్షంలో పరిస్థితి వేరు. అక్కడ చిన్న శకలం వేగంగా దూసుకొచ్చి ఢీకొడితే పెను ప్రమాదమే సంభవిస్తుంది.
  • వేతన పెంపులు.. తగ్గేదేలే కొత్త లేబర్‌ కోడ్‌లను అమలు చేయడం వల్ల అధిక వేతన బిల్లులు చెల్లించాల్సి వస్తున్నప్పటికీ.. చాలా వరకు కంపెనీలు వేతన పెంపులను తగ్గించే ప్రయత్నం చేయకపోవచ్చని హెచ్‌ఆర్‌ అధిపతులు, వేతన నిపుణులు అంటున్నారు.
  • జియో, ఆంథ్రోపిక్‌ వంటి 15 కంపెనీలతో కూటమి ఏర్పాటు జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి.
  • విస్తరణ బాటలో అన్విత గ్రూపు స్థిరాస్తి రంగంలోని అన్విత గ్రూపు దేశంలోని, వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, దుబాయ్‌లకూ తమ ప్రాజెక్టులను విస్తరించే ప్రణాళికల్లో ఉంది.
  • ఐఓబీ నుంచి మరిన్ని స్టార్టప్‌ బ్యాంకింగ్‌ శాఖలు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) తన 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్టార్టప్‌ బ్యాంకింగ్‌’ నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  • ట్రెన్స్‌లో 60% వాటా కొనుగోలు: ఇక్సిగో స్పెయిన్‌లోని రెండో అతి పెద్ద రైలు బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రెన్స్‌లో 60 శాతం వాటాను 11.70 మిలియన్‌ యూరోలకు (రూ.125 కోట్లకు పైగా) కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్‌ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో వెల్లడించింది.
  • మణప్పురంలో వాటా కొనుగోలుకు బెయిన్‌ క్యాపిటల్‌కు ఆర్‌బీఐ అనుమతులు పసిడి రుణాల సంస్థ మణప్పురం ఫైనాన్స్‌లో 41.66 శాతం వాటాను బెయిన్‌ క్యాపిటల్‌ కొనుగోలు చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది.
  • ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్‌ రావట్లేదు ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిన ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్, తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.

English Translation

Upcoming IPOs: IPO schedule.. 11 IPOs next week

Eenadu icon
By Business News Team Updated : 20 Dec 2025 16:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Upcoming IPOs | Internet Desk: The primary market was buzzing this week with listings like Corona Remedies, Wakefit Innovation, ICICI AMC and KSH International subscription. The buzz will continue next week as well. A total of 11 IPOs will come up for subscription between December 22 and 26. One of them is the main board and the rest belong to the SME category. These are the details..

next week IPOs..

Gujarat Kidney and Super Specialty: Next week Gujarat Kidney and Super Specialty Hospital will come up for subscription in mainboard category. The company, which runs a mid-size multi-specialty hospital in Gujarat, is coming up for a public issue to raise Rs.250.80 crore. It starts on December 22nd and ends on December 24th. The company has fixed a price range of Rs.108-114 per share. The IPO will take place in the form of issue of fresh shares.

  • Ghost pairing.. Did you get this message on WhatsApp?

In the SME category..

In the SME category, 10 companies are coming together for subscription next week. EPW India will raise Rs.31.81 crore, Dhagepalli Publishers Rs.40.39 crore, Shyamdhani Industries Rs.38.49 crore and Sundrex Oil Rs.32.25 crore. The subscription will start on December 22 and end on December 24. Dhara Rail Project Rs.50.20 crore, Nantha Tech Rs.31.81 crore, Admach Systems Rs.42.60 crore, Bhai Kakaji Polymers Rs.105.17 crore and Apollo Techno Industries Rs.47.96 crore each for subscription on December 23 are coming Ending on 26th. E to E Transportation Infrastructure will come up for subscription on December 26 to raise Rs 84.22 crore. Subscription ends on December 30.

The listings are..

KSH International will be listed on December 22 in the Mainboard category. The subscription ended on December 18. Only 83% subscribed. Neptune Logitech of SME category will also be listed on the same day. In the same category, Mark Technocrats, Global Ocean Logistics will list on 24th and Phytochem Remedies on 26th.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 15:23 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no answer in this matter.

More

  • Know these things before buying an AC! Summer is coming! ACs are bought more during this time. What factors should be considered before buying these..
  • Pasidi prices are divided.. Kattu gold is popular. Gold prices are skyrocketing day by day.
  • Next 12-18 months are good days for the market. HDFC Securities MD and CEO Dhiraj Relli has analyzed that the domestic stock markets, which have been undergoing ups and downs for the last year and a half, have a chance to recover.
  • Data centers in space Imagine a small piece of garbage lying on the ground. No big danger. But, the situation in space is different. There is a big accident if a small fragment comes fast and collides with it.
  • Salary hikes. Although the implementation of new labor codes has led to higher wage bills. HR heads and pay experts say that most companies may not try to reduce pay hikes.
  • Alliance with 15 companies like Jio, Anthropic Jio Platforms, Anthropic, Ericsson and similar international companies in the field of cloud infrastructure and connectivity for semiconductors have joined hands to form the Trusted Technology Alliance (TTA).
  • Anvita Group on expansion path Anvita Group in the real estate sector is planning to expand its projects in various parts of the country, including the US and Dubai.
  • More Startup Banking Branches from IOB Indian Overseas Bank (IOB) celebrates its 90th founding day by expanding its 'Startup Banking' network.
  • 60% stake acquisition in Trance: Ixigo Travel aggregator Ixigo has announced that it has approved the execution of board binding agreements to acquire 60 percent stake in Spain's second largest train booking platform Trance for 11.70 million euros (over Rs. 125 crore).
  • RBI approvals for Bain Capital to acquire stake in Manappuram The Reserve Bank of India (RBI) has approved Bain Capital's acquisition of 41.66 per cent stake in PSD loans firm Manappuram Finance.
  • NVIDIA CEO Jensen to miss India AI Impact Summit Nvidia CEO Jensen Huang, who was scheduled to participate in the India AI Impact Summit, has canceled his visit to India, a top official revealed.