అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం.. పరిశీలించిన మంత్రి తుమ్మల

Eenadu icon
By Telangana Dist. Team Published : 20 Dec 2025 15:20 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులు, నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను సంబంధిత అధికారులపే అడిగి తెలుసుకున్నారు. ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని పేద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని.. పనులు ఆలస్యం కావడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ తక్షణమే ఈ అసంపూర్తి ఇళ్లను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఉన్న లోపాలు, నిధుల సమస్యలు, కాంట్రాక్టర్ సంబంధిత అంశాపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌తో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రామదాసు ఇంట.. సరిగమల పులకింత [ 19-02-2026] భక్త రామదాసు నడయాడిన నేల.. కీరవాణి స్వర ఝరిలో ఓలలాడింది. సుస్వరాల గానమాలికలో.. సంగీత హోరులో ఖమ్మం మెట్టు పులకించింది. దేదీప్యమానంగా కాంతులీనిన వేదికపై సీతా సమేత శ్రీరాముడిని స్మరిస్తూ.. స్తంభాద్రిని కొలుస్తూ.. గాయనీగాయకులు ఆలపించిన గీతాలు సమ్మోహనపరిచాయి.. సంగీత విభావరితో నగరం మైమరిచిపోయింది.
  • ఇన్‌స్టాలో డీల్స్ [ 19-02-2026] అడవుల గుండా, వాహనాల సీట్ల కింద గంజాయిని దాచి తరలించటాన్ని చూశాం.. కానీ చీకటి వ్యాపారం రూపు మార్చుకుంది. యువత చేతిలోని స్మార్ట్‌ఫోన్లు గంజాయి విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
  • కల్లూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దండి: తుమ్మల [ 19-02-2026] నూతనంగా ఏర్పడిన కల్లూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
  • రేపటితో పత్తి కొనుగోళ్లు సమాప్తం! [ 19-02-2026] ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరాయి. ఈనెల 20(శుక్రవారం)తో పూర్తికానున్నాయి. ఉభయ జిల్లాల్లో సుమారు నాలుగు నెలల్లో రూ.583.23కోట్ల పత్తిని సీసీఐ సేకరించింది. 82.50% సొమ్మును కర్షకులకు చెల్లించింది. 
  • చదివిందే మళ్లీ చదవండి! [ 19-02-2026] ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
  • వేగంగా పనులు.. సకాలంలో బిల్లులు [ 19-02-2026] నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఊపందుకుంటోంది. రెండు దశల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సుమారు 33వేల ఇళ్లకు మంజూరు పత్రాలు లభించాయి
  • పక్కాగా పసిడి లెక్క [ 19-02-2026] భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిరుపయోగంగా ఉన్న ఆభరణాల లెక్కలు తీస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శ్రీరామ నవమికి బంగారం, వెండిని బాండ్లు రూపంలోకి మార్చాలని యోచిస్తున్నారు.
  • నిఘా ఉంటేనే.. చోరీలకు అడ్డుకట్ట [ 19-02-2026] జిల్లాలో ఏటా 100 నుంచి 150 విద్యుత్తు నియంత్రికల దొంగతనాలు సంభవిస్తున్నాయి. రైతులు, విద్యుత్తుశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అధిక శాతం దొంగతనాలు పంటలు ముగిసిన తర్వాత, వేసవికాలంలోనే జరుగుతుంటాయి