U19 Asia Cup 2025: అండర్‌-19 ఆసియా కప్‌: శ్రీలంకపై విజయం.. ఫైనల్‌కు భారత్‌

Eenadu icon
By Sports News Team Updated : 19 Dec 2025 19:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

దుబాయి: ఆసియాకప్‌ అండర్‌ 19 కప్‌ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సెమీస్‌ 1లో భారత్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని యంగ్‌ ఇండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఆయుష్‌(7), వైభవ్‌ సూర్యవంశీ(9) విఫలమైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విహాన్‌(61*), ఆరోన్‌(54*) అర్ధశతకాలతో అదరగొట్టడంతోపాటు జట్టును గెలిపించారు. రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాక్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో డిసెంబర్‌ 21న దుబాయ్‌ వేదికగా ఇండియా, పాక్‌ల మధ్య ఫైనల్‌ జరగనుంది. 

ఆసియా కప్‌ అండర్‌ -19 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్‌ ఆయుష్‌(7) ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో వైభవ్‌ సూర్యవంశీ 9 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్‌ జార్జ్‌(29), విహాన్‌ (25) ఉన్నారు. 

ఆసియా కప్‌ అండర్‌ -19 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతోన్న సెమీఫైనల్‌ 1లో శ్రీలంక బ్యాటింగ్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టులో చమిక హీనతిగల (42),  విమత్ దిన్సారా (32), సేథ్మికా సెనెవిరత్నే (30)టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. విరాన్‌ చముదిత (19), దుల్నిత్ సిగెరా (1), కవిజా గమాగే (2), కిత్మ వితన్‌పతిరన (7), ఆదమ్‌ హిల్మీ (1), సనుజా(0*) స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. 13 ఓవర్ల వద్ద 84 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సేథ్మికా, చమిక క్రీజులో నిలదొక్కుకొని చక్కటి ఇన్నింగ్స్‌ ఆడారు. ఇద్దరు కలిసి 7వ వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో కిశాంక్‌ చౌహాన్‌ , హెనిల్‌ పటేల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిషాన్‌ కుమార్‌ సింగ్‌, దీపేశ్‌ దేవేంద్రన్‌, ఖిలాన్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఆసియా కప్‌ అండర్‌ -19 సెమీఫైనల్‌ 1లో భారత్‌, శ్రీలంక మ్యాచ్‌ కొనసాగుతోంది. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తోన్న శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి వికెట్లు సమర్పించుకుంటోంది. 13 ఓవర్లకు 84 పరుగులు చేసిన ప్రత్యర్థి జట్టు 6 వికెట్లు కోల్పోయింది. కిశాంక్‌ 2 వికెట్లు తీయగా.. కిషన్‌, దీపేశ్‌, ఖిలాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అండర్‌-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ వేదికగా భారత్‌, శ్రీలంక మధ్య జరగాల్సిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమైన విషయం తెలిసిందే. కాసేపటికి వర్షం ఆగినప్పటికీ ఔట్‌ ఫీల్డ్‌ తడిసిపోవడంతో అనుకున్న సమయానికి మ్యాచ్‌ నిర్వహించలేకపోయారు. దీంతో టాస్‌ ఆలస్యమైంది. తొలుత టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ను సైతం 20 ఓవర్లకు కుదించారు. 

  • ఆ ఒక్కటీ మెరుగుపడితే.. గిల్‌ పరుగులు చేయగలడు: సంజయ్‌ బంగర్‌ 

భారత తుది జట్టు:ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, అరోన్‌ జార్జి, విహాన్‌ మల్హోత్రా, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), కాన్షిక్‌ చౌహాన్, హెనిల్‌ పటేల్‌, ఖిలాన్‌ పటేల్‌, దీపేశ్‌ దేవేంద్రన్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌

శ్రీలంక తుది జట్టు:సనుజ నిందువర, విరాన్‌ చముదిత, కిత్మ వితన్‌పతిరన, కవిజా గమాగే, విమత్ దిన్సారా (కెప్టెన్‌), చమిక హీనతిగల, దుల్నిత్ సిగెరా, ఆదమ్ హిల్మీ, సెథ్మికా సెనెవిరత్నే, రసిత్‌, నిమ్సారా, విఘ్నేశ్వరన్‌ ఆకాశ్‌

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 18:48 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.