U19 Asia Cup 2025: అండర్-19 ఆసియా కప్: శ్రీలంకపై విజయం.. ఫైనల్‌కు భారత్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దుబాయి: ఆసియాకప్ అండర్ 19 కప్ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సెమీస్ 1లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని యంగ్ ఇండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఆయుష్(7), వైభవ్ సూర్యవంశీ(9) విఫలమైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విహాన్(61*), ఆరోన్(54*) అర్ధశతకాలతో అదరగొట్టడంతోపాటు జట్టును గెలిపించారు. రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో డిసెంబర్ 21న దుబాయ్ వేదికగా ఇండియా, పాక్‌ల మధ్య ఫైనల్ జరగనుంది.
ఆసియా కప్ అండర్ -19 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్ ఆయుష్(7) ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో వైభవ్ సూర్యవంశీ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ జార్జ్(29), విహాన్ (25) ఉన్నారు.
ఆసియా కప్ అండర్ -19 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతోన్న సెమీఫైనల్ 1లో శ్రీలంక బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టులో చమిక హీనతిగల (42), విమత్ దిన్సారా (32), సేథ్మికా సెనెవిరత్నే (30)టాప్ స్కోరర్‌గా నిలిచారు. విరాన్ చముదిత (19), దుల్నిత్ సిగెరా (1), కవిజా గమాగే (2), కిత్మ వితన్‌పతిరన (7), ఆదమ్ హిల్మీ (1), సనుజా(0*) స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. 13 ఓవర్ల వద్ద 84 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సేథ్మికా, చమిక క్రీజులో నిలదొక్కుకొని చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు కలిసి 7వ వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో కిశాంక్ చౌహాన్ , హెనిల్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిషాన్ కుమార్ సింగ్, దీపేశ్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.
ఆసియా కప్ అండర్ -19 సెమీఫైనల్ 1లో భారత్, శ్రీలంక మ్యాచ్ కొనసాగుతోంది. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి వికెట్లు సమర్పించుకుంటోంది. 13 ఓవర్లకు 84 పరుగులు చేసిన ప్రత్యర్థి జట్టు 6 వికెట్లు కోల్పోయింది. కిశాంక్ 2 వికెట్లు తీయగా.. కిషన్, దీపేశ్, ఖిలాన్ తలో వికెట్ పడగొట్టారు.
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన విషయం తెలిసిందే. కాసేపటికి వర్షం ఆగినప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిసిపోవడంతో అనుకున్న సమయానికి మ్యాచ్ నిర్వహించలేకపోయారు. దీంతో టాస్ ఆలస్యమైంది. తొలుత టాస్ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ను సైతం 20 ఓవర్లకు కుదించారు.
- ఆ ఒక్కటీ మెరుగుపడితే.. గిల్ పరుగులు చేయగలడు: సంజయ్ బంగర్
భారత తుది జట్టు:ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జి, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కాన్షిక్ చౌహాన్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్
శ్రీలంక తుది జట్టు:సనుజ నిందువర, విరాన్ చముదిత, కిత్మ వితన్‌పతిరన, కవిజా గమాగే, విమత్ దిన్సారా (కెప్టెన్), చమిక హీనతిగల, దుల్నిత్ సిగెరా, ఆదమ్ హిల్మీ, సెథ్మికా సెనెవిరత్నే, రసిత్, నిమ్సారా, విఘ్నేశ్వరన్ ఆకాశ్
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 18:48 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
English Translation
U19 Asia Cup 2025: Under-19 Asia Cup: Victory over Sri Lanka.. India to final

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Dubai: As part of the Asia Cup Under-19 Cup tournament, India entered the final with a great victory in Semi-1 against Sri Lanka. Young India chased down the target of 139 runs set by Sri Lanka by losing 2 wickets in 18 overs. Openers Ayush (7) and Vaibhav Suryavanshi (9) failed.. Vihan (61*) and Aaron (54*) who came to the crease later scored half centuries and won the team. In the second semi, Pakistan won against Bangladesh and reached the final. With this, the final between India and Pakistan will be held on December 21 in Dubai.
India is playing consistently in the ongoing match against Sri Lanka as part of the Asia Cup Under-19 tournament. 72 runs lost 2 wickets in 10 overs. Captain Ayush (7) got out shortly after batting started. In the fourth over, Vaibhav Suryavanshi reached the pavilion for 9 runs. Aaron George (29) and Wihan (25) are currently at the crease.
Sri Lanka's batting ended in Semifinal 1 against India as part of the Asia Cup Under-19 tournament. They lost 8 wickets and made 138 runs in the allotted 20 overs. Chamika Hinathigala (42), Vimat Dinsara (32) and Sethmika Seneviratne (30) were the top scorers in the opposing team. Viran Chamudita (19), Dulnith Sigera (1), Kavija Gamage (2), Kitma Withanpathirana (7), Adam Hilmi (1), Sanuja (0*) were limited to a small score. Sri Lanka lost 6 wickets for 84 runs in 13 overs. After that, Sethmika and Chamika stood at the crease and played a good innings. The two put on a partnership of 52 runs for the 7th wicket. Among the Indian bowlers, Kishank Chauhan and Henil Patel took two wickets each.. Kishan Kumar Singh, Dipesh Devendran and Khilan Patel took one wicket each.
The match between India and Sri Lanka in Asia Cup Under-19 Semifinal 1 is going on. It is known that the 50 over match was reduced to 20 overs due to rain. Sri Lanka, who lost the toss and are batting first, are offering wickets to the Indian bowlers. The opposing team scored 84 runs in 13 overs and lost 6 wickets. Kishank took 2 wickets..Kishan, Dipesh and Khilan took wickets each.
It is known that the semi-final match between India and Sri Lanka at the ICC Academy Ground in Dubai as part of the Under-19 Asia Cup was delayed due to rain. Even though the rain stopped for a while, the match could not be held as the outfield got wet. This delayed the toss. Team India won the first toss and chose to bowl first. The match was also shortened to 20 overs.
- If only that improves.. Gill can score runs: Sanjay Bangar
India Final Team:Ayush Mathre (captain), Vaibhav Suryavanshi, Aaron George, Vihan Malhotra, Vedant Trivedi, Abhiyan Kundu (wicket keeper), Kanshik Chauhan, Henil Patel, Khilan Patel, Dipesh Devendran, Kishan Kumar Singh
Sri Lanka Final Team:Sanuj Ninduvara, Viran Chamudita, Kitma Withanpathirana, Kavija Gamage, Vimat Dinsara (captain), Chamika Hinathigala, Dulneet Sigera, Adam Hilmi, Sethmika Seneviratne, Rasit, Nimsara, Vigneswaran Akash
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 18:48 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Sharma.. First you take a single: Sunil Gavaskar Team India's T20 specialist batsman Abhishek Sharma is faltering in batting. In the T20 World Cup, he has played two matches so far and has been dismissed in both. Yuvraj Samra: A boy's name is doing the rounds right now in the short World Cup. He created a new history by scoring a century in the T20 World Cup at the youngest age.