చూడ్డానికొస్తే ‘టోలు’ వలుస్తున్నారు

- A
- A+
- A++

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏదైనా పంచాయతీ పరిధిలో ఉండే ప్రాచీన కట్టడాలు, పురాతన దేవాలయాల సందర్శనకు వెళ్లిన వారి నుంచి నగదు రూపంలో కొంతమొత్తం వసూలుకు అనుమతులు ఇస్తారు. అది కూడా వాహనాలకు మాత్రమే వసూలు చేస్తారు. అందులో కొంత ఆ గ్రామాభివృద్ధికి కేటాయిస్తారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. పంచాయతీ బదులు పర్యాటక శాఖ ఆ ప్రాంత అందాలను చూసేందుకు వచ్చే ఒక్కో వ్యక్తి నుంచి రూ.20 - రూ. 30 వరకు రుసుము వసూలు చేస్తోంది.
పంచాయతీ ఆదాయానికి గండి:గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి కలెక్టర్ శివశంకర్ ఆదేశాలతో గండికోటకు కిలో మీటర్ దూరంలో టోల్ గేట్ ఏర్పాటు చేశారు. కోటలోకి వెళ్లే ఒక్కో వ్యక్తి వద్ద సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ. 20, శని, ఆదివారాల్లో రూ.30 వసూలు చేసేలా.. వచ్చిన ఆదాయాన్ని పంచాయతీకి 20 శాతం కేటాయించేలా నిర్ణయించారు. స్థానికేతురులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. ప్రసుత్తం టోల్ గేట్ నిర్వహణకు ఏడాది దాటింది. సందర్శకుల నుంచి వసూళ్లు రూ.లక్షలకు చేరింది. సిబ్బందికి జీతాల చెల్లింపు తప్ప.. పంచాయతీకి ఖర్చు చేసింది లేదు.
ప్రైవేట్ వ్యక్తులకే రాబడి
- గండికోటలో పంచాయతీ అనుమతుల్లేకుండా కొందరు రిసార్ట్స్‌లు ఏర్పాటు చేశారు. సందర్శకుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు.
- ఇటీవల పెన్నాలోయ వ్యూ పాయింట్ వద్ద గుడారాల దందాకు తెర లేచింది. సందర్శకుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నా.. పర్యాటకులకు మౌలిక వసతులూ కల్పించడం లేదు. పంచాయతీకీ రూపాయి కూడా చెల్లించడం లేదు.
- గుర్రపు స్వారీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులదీ అదే తీరు. వీరు కూడా పంచాయతీకి ఎటువంటి పన్ను చెల్లించడం లేదు.
- గండికోటకు వచ్చే సందర్శకులకు కోటలో తాగునీటి వసతిని కూడా పురావస్తు శాఖ కల్పించలేదు. కొన్ని నెలలుగా మరుగుదొడ్లకూ తాళాలు వేలాడుతున్నాయి.
నోటీసులు జారీ చేశాం: రాజ్యలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి, కడప
టోల్‌గేట్ నిర్వహణ, పంచాయతీకి రావాల్సిన నిధుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకుంటాం. పంచాయతీ పరిధిలోని రిసార్ట్స్ నిర్వాహకులు పన్నులు చెల్లించాల్సిందే. చెల్లించని వారికి నోటీసులు కూడా జారీ చేశాం.
► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:23 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చూడరు తవ్వెయ్..అడగరు అమ్మెయ్! [ 19-02-2026] ‘కాదేదీ దోపిడీకి అనర్హం’ అన్నట్లు గత వైకాపా పాలనలో గుట్టలకు కూడా మంచి గిరాకీ వచ్చింది.. మట్టి మాఫియాకు వారు బీజం పోస్తే నేటికీ అది కొనసాగుతోంది. ‘తోడు’ దొంగలంతా ఏకమై కనిపించిన గుట్టలన్నింటినీ ‘గుట్ట’కాయ స్వాహా చేసేస్తున్నారు.
- ప్రైవేట్ ఆస్తులతో దోబూచులాట [ 19-02-2026] కడప నగరం చిన్నచౌకు పరిధి వార్డు నంబర్ 38, డోర్ నంబర్ 38-328- 0-0-0(చివరి అంకెలు మార్పు)తో ఒక మహిళకు ఆస్తి ఉంది. ఇంతకాలం ఆమె పేరునే కేఎంసీ పన్ను నోటీసులు జారీ చేస్తూ వచ్చింది. ఉన్నట్లుండి సదరు ఆస్తి మరో వ్యక్తి పేరుకు మారి పన్ను నోటీసులు జారీ కావడంతో ఆమె కంగుతింది.
- పుట్టకుండానే చిదిమేస్తున్నారమ్మా! [ 19-02-2026] మైలవరం మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు. మూడోసారి ఆయన భార్య గర్భం దాల్చడంతో స్కానింగ్ చేయించాడు. ఆడపిల్లనడంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడ్డాడు.
- నందలూరు.. బరితెగించిన వైకాపా నేతలు [ 19-02-2026] నందలూరులో కొందరు భూ బకాసురుల అవతారమెత్తారు. వైకాపా అధికారంలో ఉండగా ఇష్టారీతిన వ్యవహరించారు. ప్రభుత్వ, అటవీ భూముల్లో పాగా వేశారు. యాజమాన్య హక్కుల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని అతి ఖరీదైన భూములను గుటుక్కుమనిపించారు.
- మంగళూరు టు రాయచోటి! [ 19-02-2026] పూర్వ జిల్లా కేంద్రమైన రాయచోటి నేరగాళ్లు, తీవ్ర వాదులకు అడ్డాగా మారుతోంది. ప్రశాంత వాతావరణంలో ఉన్న పట్టణం ఏడాదిగా జరిగిన వరుస ఘటనలతో ఉలిక్కి పడింది.
- కీచకులున్నారు జాగ్రత్త! [ 19-02-2026] ఏమీ ఎరుగని కలువల్లారా.. అయిదారేడుల పాపల్లారా.. దారంట ముళ్లున్నట్లే.. కబళించే కళ్లుంటాయ్!
- పుష్కరిణి.. ప్రాభవంతో ప్రసిద్ధి [ 19-02-2026] పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో పురాణ ప్రాభవానికి సంబంధించి ఎన్నో ఆనవాళ్లు కన్పిస్తుంటాయి. అందులో భాగంగా ఇక్కడి క్షేత్రానికి అనుసంధానంగా పురాతన కాలం నుంచి వస్తున్న పుష్కరిణులు నేడు ఆధ్యాత్మిక ప్రాభవానికి చిహ్నాలుగా విరాజిల్లుతున్నాయి.
- చిన్నారికి కన్నీటి వీడ్కోలు [ 19-02-2026] మదనపల్లె హత్యాచార ఘటనలో మృతి చెందిన చిన్నారి అంత్యక్రియలు తల్లిదండ్రులు, బంధువుల రోదనల మధ్య బుధవారం వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లి మండలంలో జరిగాయి.
- ‘ఢీ’ఎస్‌ఏ [ 19-02-2026] జిల్లా క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ) వారంతా ఆడించాల్సినవాళ్లు.. అటువంటి వాళ్లు క్రీడాకారులను తీర్చిదిద్ది జిల్లా పేరు నిలపడంపై కాకుండా పరస్పర విమర్శల పర్వానికి తెర లేపారు.