SpiceJet passenger: స్పైస్‌జెట్ ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Passenger assaulted by AI Express pilot | ఇంటర్నెట్‌డెస్క్: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని స్పైస్‌జెట్ విమాన ప్రయాణికుడు అంకిత్ దివాన్ ఆరోపించారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థ స్పందించింది. పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఈ ఘటన జరిగింది.
ఎక్స్‌లో అంకిత్ చేసిన పోస్టు ప్రకారం.. ‘నాలుగు నెలల కుమార్తె సహా కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ప్రయాణించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చాం. సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెక్-ఇన్ లైన్‌లో వెళ్లాలని నాకు అక్కడున్నవారు సూచించారు. ఈ క్రమంలో మేం ఉన్న క్యూలోకి కొందరు మధ్యలో చొచ్చుకు రావడంతో వారిని ప్రశ్నించాను. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ వీరేందర్ కూడా అలాగే చేయడంతో అతడిని కూడా ప్రశ్నించా. ఈ క్రమంలో అతడు నాపై దుర్భాషలాడాడు. అనంతరం మా మధ్య వాగ్వాదం జరిగింది. సంయమనం కోల్పోయిన పైలట్ నాపై భౌతిక దాడికి పాల్పడ్డాడు’ అని ఆరోపించారు. ఈ పోస్టుకు తన ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఫోటోను కూడా అంకిత్ పంచుకున్నారు. పైలట్ చొక్కాపై ఉన్న రక్తపు మరకలు కూడా తనవేనని వెల్లడించాడు. తన ఏడేళ్ల కుమార్తె ఈ ఘటనతో చాలా భయపడిందని తెలిపారు. జరిగిన ఘటన ఇక్కడితో వదిలేసేలా ఓ లేఖ రాయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. తన పోస్ట్‌లో దిల్లీ పోలీసులను ట్యాగ్ చేశారు.
- కీడు చేశానన్న భావన అపరాధ భావోద్వేగానికి హేతువు
ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) స్పందించింది. పైలట్ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపింది. సంబంధిత ఉద్యోగిని తక్షణమే అధికారిక విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ సంస్థ ఉద్యోగులు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
- ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
- వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్ Kannada actress: ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.