SpiceJet passenger: స్పైస్‌జెట్‌ ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ దాడి..!

Eenadu icon
By National News Team Updated : 20 Dec 2025 19:54 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Passenger assaulted by AI Express pilot | ఇంటర్నెట్‌డెస్క్‌: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్‌ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని స్పైస్‌జెట్‌ విమాన ప్రయాణికుడు అంకిత్‌ దివాన్‌ ఆరోపించారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థ స్పందించింది. పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌ 1లో ఈ ఘటన జరిగింది. 

ఎక్స్‌లో అంకిత్‌ చేసిన పోస్టు ప్రకారం.. ‘నాలుగు నెలల కుమార్తె సహా కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానంలో ప్రయాణించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చాం. సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెక్‌-ఇన్‌ లైన్‌లో వెళ్లాలని నాకు అక్కడున్నవారు సూచించారు. ఈ క్రమంలో మేం ఉన్న క్యూలోకి కొందరు మధ్యలో చొచ్చుకు రావడంతో వారిని ప్రశ్నించాను. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ వీరేందర్‌ కూడా అలాగే చేయడంతో అతడిని కూడా ప్రశ్నించా. ఈ క్రమంలో అతడు నాపై దుర్భాషలాడాడు. అనంతరం మా మధ్య వాగ్వాదం జరిగింది. సంయమనం కోల్పోయిన పైలట్‌ నాపై భౌతిక దాడికి పాల్పడ్డాడు’ అని ఆరోపించారు. ఈ పోస్టుకు తన ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఫోటోను కూడా అంకిత్‌ పంచుకున్నారు. పైలట్‌ చొక్కాపై ఉన్న రక్తపు మరకలు కూడా తనవేనని వెల్లడించాడు. తన ఏడేళ్ల కుమార్తె ఈ ఘటనతో చాలా భయపడిందని తెలిపారు. జరిగిన ఘటన ఇక్కడితో వదిలేసేలా ఓ లేఖ రాయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. తన పోస్ట్‌లో దిల్లీ పోలీసులను ట్యాగ్‌ చేశారు. 

  • కీడు చేశానన్న భావన అపరాధ భావోద్వేగానికి హేతువు

ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) స్పందించింది. పైలట్‌ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపింది. సంబంధిత ఉద్యోగిని తక్షణమే అధికారిక విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ సంస్థ ఉద్యోగులు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:35 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026)  ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
  • ఏప్రిల్‌లో బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్‌, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. 
  • వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌ Kannada actress:  ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.

English Translation

SpiceJet passenger: Air India Express pilot attack on SpiceJet passenger..!

Eenadu icon
By National News Team Updated : 20 Dec 2025 19:54 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Passenger assaulted by AI Express pilot | Internet Desk: Spicejet passenger Ankit Diwan has alleged that he was physically assaulted by the pilot of Air India Express. Air India Express has responded to this incident. It has been announced that the pilot has been dismissed from duty. The incident took place in Terminal 1 of Delhi Airport. 

According to Ankit's post on X.. 'We came to Delhi Airport with our family, including our four-month-old daughter, to fly on the SpiceJet flight. I was instructed to go through the security check-in line used by the staff. In this order, some of us entered the queue in the middle, so I questioned them. As Air India Express pilot Virender also did the same, he was also questioned. In this sequence he abused me. After that we had an argument. The pilot, who lost his temper, physically assaulted me,' he alleged. Ankit also shared a photo with blood stains on his face for this post. He also revealed that the blood stains on the pilot's shirt were his. He said that his seven-year-old daughter was very frightened by the incident. He said that he was pressured to write a letter to leave the incident here. He tagged Delhi Police in his post. 

  • Feeling of being harmed is the reason for feeling guilty

Air India Express responded to this incident. The pilot's behavior is condemned. It has been revealed that the concerned employee has been removed from official duties immediately. It said that appropriate action will be taken against him after investigating the incident. The company has expressed its commitment to ensure that employees are always responsible.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:35 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Today's Rasi Results.. 12 Rasi Results are as... (18/02/2026)  How is it for any zodiac sign today? Details of today's horoscope given by Dr. Shankaramanchi Sivasai Srinivas..
  • Bengal and Tamil Nadu elections in April..! Sources of the Election Commission have revealed that elections are likely to be held in April for 4 states including Bengal and Tamil Nadu and one union territory. 
  • Secret cameras in washroom.. Kannada actress video recorded and blackmailed Kannada actress: A Kannada actress had a bitter experience. She alleged that they installed hidden cameras in the washroom and blackmailed her with the video.