Droupadi Murmu: నిజాయతీ.. సమగ్రతే ముఖ్యం

Eenadu icon
By Telangana News Desk Published : 20 Dec 2025 04:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ఈనాడు, హైదరాబాద్‌: యూపీఎస్సీ, రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు.. సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తున్నాయని, దేశ పురోగతిలో అవి నిరంతరం భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక విధానంలో నిజాయతీ, సమగ్రత కలిగిన అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మిగిలిన అంశాలకంటే నిజాయతీ, సమగ్రతలే అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. శుక్రవారమిక్కడ రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండురోజుల పాటు జరగనున్న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్ల 26వ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, యూపీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్, తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశంతో పాటు పలు రాష్ట్రాల పీఎస్సీల ఛైర్‌పర్సన్లు, ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘అభ్యర్థుల నైతిక దృక్పథాన్ని అర్థం చేసుకునేందుకు ఇతర సాధనాలు, పద్ధతుల్ని కమిషన్లు గుర్తించాలి. సివిల్‌ సర్వెంట్లుగా నియమితులయ్యే యువత.. సమాజంలో వెనుకబడిన, అణగారిన, అసహాయుల కోసం పనిచేయాలి. మహిళల అవసరాలు, ఆకాంక్షల పట్ల సున్నితత్వం కలిగి ఉండాలి. సాంకేతికతలో ఎదురయ్యే సవాళ్లను కమిషన్లు ముందుగానే గుర్తించి పారదర్శకతను మరింత బలోపేతం చేయడం, విశ్వసనీయత పెంచడం ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన అధికారుల బృందాలను తీర్చిదిద్దాలి. సర్వీసులు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌.. రాజ్యాంగంలో ప్రత్యేక భాగాన్ని కేటాయించి, ప్రత్యేక విధులు, బాధ్యతలకు ప్రాముఖ్యమిచ్చారు. 

జాతి నిర్మాతల కలలు నిజం చేస్తున్న పీఎస్సీలు

రాజ్యాంగ ఆదర్శాలైన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమానహోదా, అవకాశాలు దేశం పనితీరుకు ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ దిశగా మార్గనిర్దేశం చేస్తూ, సివిల్‌ సర్వెంట్ల ఎంపికలో జాతి నిర్మాతల కలలను పీఎస్సీలు నిజం చేస్తున్నాయి. యూపీఎస్సీ, రాష్ట్రాల పీఎస్సీలకు పనిచేస్తున్న, పనిచేసిన ఛైర్‌పర్సన్లు, కమిషన్‌ బృందాలను అభినందిస్తున్నా. అత్యంత విశ్వసనీయత కలిగిన ప్రభుత్వ సంస్థల్లో యూపీఎస్సీ ఒకటి. నిష్పక్షపాతంగా అధికారులను ఎంపిక చేస్తోంది. సివిల్, పబ్లిక్‌ సర్వీసుల్లో అత్యంత నైపుణ్యం కలిగిన బృందాలను సిద్ధం చేస్తున్న యూపీఎస్సీకి గొప్ప పరపతి ఉంది. వివిధ రాష్ట్రాల పీఎస్సీలు ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వాములై.. రాజ్యాంగం నిర్దేశించిన విధులు నిర్వర్తిస్తున్నాయి. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేలా అడుగులు వేస్తున్నాం. సర్వీస్‌ కమిషన్లు భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే సివిల్‌ సర్వెంట్ల బృందాన్ని నిర్మించడంలో తమ బాధ్యతలు నిరంతరంగా నిర్వర్తిస్తూనే ఉండాలి’’ అని సూచించారు.

పారదర్శకత, నిష్పక్షపాతం పునాదిగా ఉండాలి: గవర్నర్‌

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు కచ్చితమైన కాలపరిమితితో నిష్పక్షపాతంగా, ప్రతిభ ఆధారిత నియామకాలు చేపట్టాలి. సమర్థులైన వ్యక్తులు ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చేలా చూడాలి. ప్రశ్నపత్రం తయారీ నుంచి మూల్యాంకనం, ఇంటర్వ్యూల వరకు ప్రతి ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతంతో వ్యవహరించాలి. నియామకాలకు పీఎస్సీలు క్యాలండర్‌ ప్రకటించి.. దాన్ని రాజీ లేకుండా పాటించాలి. టీజీపీఎస్సీ గత ఏడాది లక్ష్యం మేరకు అన్ని పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, అర్హులైన యువతకు రికార్డుస్థాయిలో ఉద్యోగాలు కల్పించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది’’ అని ప్రశంసించారు. 

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవసరం: యూపీఎస్సీ ఛైర్మన్‌ 

యూపీఎస్సీ ఛైర్మన్‌ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల బలోపేతం కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఉమ్మడి నిబంధనలు, ఉత్తమ విధానాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, పారదర్శకతను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్రాల పీఎస్సీల కోసం 100 ముఖ్యమైన న్యాయ తీర్పులతో కూడిన నియమావళి సిద్ధం చేస్తున్నాం. వీటి ఆధారంగా న్యాయవివాదాలను అధిగమించేలా ముందుకు వెళ్లవచ్చు’’ అని తెలిపారు. కమిషన్లకు సోషల్‌ మీడియా పెద్దసవాలుగా మారిందని, అభ్యర్థుల్లో అపోహలు సృష్టిస్తూ పీఎస్సీల విశ్వసనీయతను కొన్ని మీడియా వేదికలు దెబ్బతీస్తున్నాయని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. పారదర్శక నియామకాలతో ప్రతిభ ఆధారంగా అత్యుత్తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఈ సదస్సుకు 24 మంది పీఎస్సీల ఛైర్మన్లు వచ్చారని తెలిపారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.