
Vijayawada: మద్యానికి రూ.10 ఇవ్వలేదని హత్య.. కొడుకును పోలీసులకు అప్పగించిన తల్లి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే: మద్యానికి రూ.10 తగ్గిందని.. అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భీమన బాపయ్యవీధి కొండ ప్రాంతానికి చెందిన తెన్నేరు పాండు, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ (19) ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. గురువారం దుర్గాప్రసాద్ సిగరెట్ తాగుతుండడం చూసిన అతని అన్నయ్య మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన దుర్గాప్రసాద్ చిట్టినగర్‌లోని ఓ బార్‌లో మద్యం తాగాడు. మరోసారి తాగడానికి రూ.10 తగ్గడంతో.. ఆప్రాంతంలో ఉన్న పలకా తాతాజీ (48)ని అడగ్గా ఇవ్వలేదు. వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తాతాజీ.. దుర్గాప్రసాద్ చెంపపై కొట్టాడు. తరువాత మరో వ్యక్తిని రూ.10 అడిగి మద్యం తాగిన దుర్గాప్రసాద్.. ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చాడు. నిద్రపోతున్న తాతాజీ ఛాతిలో పొడవడంతో మృతి చెందాడు.
కేఎల్‌రావునగర్‌కు చెందిన తాతాజీ మద్యానికి బానిస కావడంతో భార్య వేరుగా మంగళగిరిలో ఉంటున్నారు. వారి కొడుకులిద్దరూ కాకినాడ, విశాఖలో ఉంటున్నారు. దీంతో తాతాజీ తాపీ పనులు చేసుకుంటూ.. చిట్టినగర్ సొరంగం మార్గంలోని ఓ షాపు వరండాలో పడుకుంటున్నాడు. అతను హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. నిందితుడు టేనర్‌పేట అడ్డరోడ్డు నుంచి లంబాడీపేట వైపు వెళ్లినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్న క్రమంలో.. నిందితుడి తల్లి జ్యోతి దుర్గాప్రసాద్‌ను పోలీసులకు అప్పగించారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.