తాజ్‌ జీవీకే హోటల్స్‌లో ఐహెచ్‌సీఎల్‌ వాటా

Eenadu icon
By Business News Desk Published : 20 Dec 2025 04:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌లో ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌)కు ఉన్న 25.52% వాటా జీవీకే- భూపాల్‌ కుటుంబం చేతికి రానుంది. ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటి వరకూ ఉన్న వాటాదార్ల వెంచర్‌ ఒప్పందాన్ని,  దీర్ఘకాలిక మేనేజ్‌మెంట్‌ ఒప్పందంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఈ లావాదేవీ పూర్తయ్యాక తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లో జీవీకే - భూపాల్‌ కుటుంబానికి 74.99% వాటా ఉన్నట్లు అవుతుంది. ఇరవై ఏళ్లకు పైగా ఐహెచ్‌సీఎల్, జీవీకే- భూపాల్‌ కుటుంబం కలిసి 1500కు పైగా గదులు కల ఏడు స్టార్‌ హోటళ్లను అభివృద్ధి చేసినట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంయుక్త ఎండీ కృష్ణ భూపాల్‌ తెలిపారు. ముంబయి, హైదరాబాద్, చెన్నై, చండీగఢ్‌ నగరాల్లో ఉన్న ఈ హోటళ్లు ఆతిథ్య రంగంలో క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 4,000 గదుల స్థాయికి విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. జీవీకే- భూపాల్‌ కుటుంబంతో ఐహెచ్‌సీఎల్‌కు ఉన్న భాగస్వామ్యం హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌ నుంచి ముంబయిలోని తాజ్‌ శాంతాక్రూజ్‌ వరకూ విస్తరించిందని ఐహెచ్‌సీఎల్‌ ఎండీ, సీఈఓ పునీత్‌ చత్వాల్‌ అన్నారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చే 12-18 నెలలు మార్కెట్‌కు మంచి రోజులు గత ఏడాదిన్నరగా ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు, ఇకపై కోలుకునే అవకాశముందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ ధీరజ్‌ రెల్లి విశ్లేషించారు.
  • అంతరిక్షంలో డేటా సెంటర్లు భూమిపై చిన్న చెత్త ముక్క పడి ఉందనుకోండి. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, అంతరిక్షంలో పరిస్థితి వేరు. అక్కడ చిన్న శకలం వేగంగా దూసుకొచ్చి ఢీకొడితే పెను ప్రమాదమే సంభవిస్తుంది.
  • వేతన పెంపులు.. తగ్గేదేలే కొత్త లేబర్‌ కోడ్‌లను అమలు చేయడం వల్ల అధిక వేతన బిల్లులు చెల్లించాల్సి వస్తున్నప్పటికీ.. చాలా వరకు కంపెనీలు వేతన పెంపులను తగ్గించే ప్రయత్నం చేయకపోవచ్చని హెచ్‌ఆర్‌ అధిపతులు, వేతన నిపుణులు అంటున్నారు.
  • జియో, ఆంథ్రోపిక్‌ వంటి 15 కంపెనీలతో కూటమి ఏర్పాటు జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి.
  • విస్తరణ బాటలో అన్విత గ్రూపు స్థిరాస్తి రంగంలోని అన్విత గ్రూపు దేశంలోని, వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, దుబాయ్‌లకూ తమ ప్రాజెక్టులను విస్తరించే ప్రణాళికల్లో ఉంది.
  • ఐఓబీ నుంచి మరిన్ని స్టార్టప్‌ బ్యాంకింగ్‌ శాఖలు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) తన 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్టార్టప్‌ బ్యాంకింగ్‌’ నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  • ట్రెన్స్‌లో 60% వాటా కొనుగోలు: ఇక్సిగో స్పెయిన్‌లోని రెండో అతి పెద్ద రైలు బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రెన్స్‌లో 60 శాతం వాటాను 11.70 మిలియన్‌ యూరోలకు (రూ.125 కోట్లకు పైగా) కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్‌ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో వెల్లడించింది.
  • మణప్పురంలో వాటా కొనుగోలుకు బెయిన్‌ క్యాపిటల్‌కు ఆర్‌బీఐ అనుమతులు పసిడి రుణాల సంస్థ మణప్పురం ఫైనాన్స్‌లో 41.66 శాతం వాటాను బెయిన్‌ క్యాపిటల్‌ కొనుగోలు చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది.
  • ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్‌ రావట్లేదు ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిన ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్, తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.