20% వాటా.. రూ.39,618 కోట్లు

Eenadu icon
By Business News Desk Published : 20 Dec 2025 04:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 20% వాటాను జపాన్‌ సంస్థ మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌ (ఎంయూఎఫ్‌జీ) రూ.39,618 కోట్ల (దాదాపు 4.4 బిలియన్‌ డాలర్లు)కు కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకు భారత ఆర్థిక రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే కావడం విశేషం. ప్రిఫరెన్షియల్‌ ఈక్విటీ షేర్ల ద్వారా ఎంయూఎఫ్‌జీ ఈ మైనారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఎంయూఎఫ్‌జీతో డెఫినిటివ్‌ ఒప్పందం కుదుర్చుకోవడం భారత ఆర్థిక సేవల రంగంపై విశ్వాసాన్ని, భవిష్యత్‌ వృద్ధి సామర్థ్యాన్ని చూపుతోందని వెల్లడించింది. ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ ప్రతిపాదిత పెట్టుబడులకు వాటాదార్లు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉందని స్పష్టం చేసింది. 

  • ఈ ఏడాది అక్టోబరులో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో 60% వాటాను రూ.26,853 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూఏఈకు చెందిన ఎమిరేట్స్‌ ఎన్‌డీబీ బ్యాంక్‌ ఆసక్తి చూపించింది. 
  • ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ మాతృసంస్థ అయిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌నకు భారత్‌లో 130 ఏళ్ల చరిత్ర ఉంది. మన దేశంలో 1.7 బి.డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ, దాదాపు 5000 ఉద్యోగాలను సృష్టించింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని