
20% వాటా.. రూ.39,618 కోట్లు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
దిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 20% వాటాను జపాన్ సంస్థ మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ (ఎంయూఎఫ్‌జీ) రూ.39,618 కోట్ల (దాదాపు 4.4 బిలియన్ డాలర్లు)కు కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకు భారత ఆర్థిక రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే కావడం విశేషం. ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల ద్వారా ఎంయూఎఫ్‌జీ ఈ మైనారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ తెలిపింది. ఎంయూఎఫ్‌జీతో డెఫినిటివ్ ఒప్పందం కుదుర్చుకోవడం భారత ఆర్థిక సేవల రంగంపై విశ్వాసాన్ని, భవిష్యత్ వృద్ధి సామర్థ్యాన్ని చూపుతోందని వెల్లడించింది. ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ ప్రతిపాదిత పెట్టుబడులకు వాటాదార్లు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉందని స్పష్టం చేసింది.
- ఈ ఏడాది అక్టోబరులో ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60% వాటాను రూ.26,853 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూఏఈకు చెందిన ఎమిరేట్స్ ఎన్‌డీబీ బ్యాంక్ ఆసక్తి చూపించింది.
- ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ మాతృసంస్థ అయిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్‌నకు భారత్‌లో 130 ఏళ్ల చరిత్ర ఉంది. మన దేశంలో 1.7 బి.డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ, దాదాపు 5000 ఉద్యోగాలను సృష్టించింది.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
English Translation

20% share.. Rs.39,618 crore

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Delhi: Japanese firm Mitsubishi UFJ Financial Group (MUFG) will acquire 20% stake in non-banking financial institution Sriram Finance Ltd for Rs 39,618 crore (about $4.4 billion). This is the largest foreign investment in the Indian financial sector so far. MUFG will acquire this minority stake through preferential equity shares, Sriram Finance said. The signing of the definitive agreement with MUFG shows confidence in the Indian financial services sector and its potential for future growth. MUFG Bank has made it clear that approvals from shareholders and regulatory bodies are required for the proposed investments.
- In October this year, UAE-based Emirates NDB Bank showed interest in buying 60% stake in RBL Bank for Rs.26,853 crore.
- Mitsubishi UFJ Financial Group, the parent company of MUFG Bank, has a history of 130 years in India. This company has invested 1.7 billion dollars in our country and created around 5000 jobs.
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.