Sobhan Babu: శోభన్‌బాబు నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం

Eenadu icon
By Cinema Desk Updated : 20 Dec 2025 06:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘‘ఎంతోమందికి అభిమానులు ఉంటారు కానీ...శోభన్‌బాబు అభిమానులు మాత్రం ప్రత్యేకం. ఆయన వెళ్లిపోయినా, ఇప్పటికీ జీవించే ఉన్నారనిపించేలా అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అప్పట్లో ప్రతి ఇంట్లో భర్త ఎవరినైనా అభిమానించేవాడేమో కానీ, భార్య మాత్రం శోభన్‌బాబునే ఇష్టపడేది. అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల హృదయాల్లోనూ సజీవంగా నిలిచిపోయిన గొప్ప నటుడు శోభన్‌బాబు. రీరిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆయన నటించిన ‘సోగ్గాడు’ చిత్రం మళ్లీ వంద రోజులు ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

శోభన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడు’ విడుదలై యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రాన్ని నిర్మించిన సురేశ్‌ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి కలిసి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాయి. శోభన్‌బాబుతో కలిసి నటించిన కథానాయికలతోపాటు, ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, గాయనీ గాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సీనియర్‌ గాయని పి.సుశీలను ఈ వేదికపై సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘శోభన్‌బాబు సినిమాల్లో పాడిన ప్రతి పాట నా మదిలో మెదులుతూనే ఉంది. అప్పట్లో ‘సోగ్గాడు’ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా స్వర్ణోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నీ చూసి ఆ జ్ఞాపకాల్ని పోగేసుకోవాలని ఉంది’’ అన్నారు.

నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ‘‘శోభన్‌బాబు మన చిత్ర పరిశ్రమలో ఓ ఆర్థిక మంత్రిలా ఉండేవారు. ప్రతి సినిమానీ లెక్క వేసుకుని చేసేవారు. ‘సోగ్గాడు’ సినిమా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకు గొప్ప పేరు, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది’’ అన్నారు. నటి జయసుధ మాట్లాడుతూ ‘‘నేనూ, శోభన్‌బాబు కలిసి 38 సినిమాల్లో నటించాం. ఆయన్నుంచి క్రమశిక్షణని నేర్చుకున్నా. మా హీరోయిన్స్‌ అందరికీ ఆయనంటే చాలా ఇష్టం. శోభన్‌బాబు మన మధ్య లేకపోయినా ఆయన అభిమానులు ‘సోగ్గాడు’ సినిమాకి స్వర్ణోత్సవం నిర్వహించడం గొప్ప విషయం’’ అన్నారు. నటి జయచిత్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమా జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదులుతున్నాయి. నటిగా నాకు మంచి అవకాశాల్ని తెచ్చిపెట్టింది. శోభన్‌బాబు కోప్పడటం నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు’’ అన్నారు.

నటి రాధిక శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘శోభన్‌బాబు అందంగానే కాదు, అందమైన వ్యక్తిత్వంతోనూ ఉండేవారు. ఆయన తన సినిమా సెట్‌లో మరో సినిమా గురించి, మరొకరి గురించి మాట్లాడటం నేను వినలేదు. ఆయన క్రమశిక్షణే మా అందరికీ అలవాటైంది’’ అన్నారు. శోభన్‌బాబు కోసమే రాశారా అనిపించేలా ఉంటుంది ‘సోగ్గాడు’ చిత్రమని, అప్పట్లో మా సంస్థని మళ్లీ విజయాల బాట పట్టించింది ఈ చిత్రమే అన్నారు నిర్మాత డి.సురేశ్‌బాబు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కథానాయికలు సుమలత,  ప్రభ, రోజా రమణి, శోభన్‌బాబు మనవలు డా.సురక్షిత్, సౌరభ్‌చంద్ర, మాజీ ఎమ్మెల్యే జేష్ఠ రమేశ్, రాశీ మూవీస్‌ నరసింహారావు, సుధాకర్‌బాబు, కె.ఎస్‌.రామారావు, బి.గోపాల్‌ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 03:11 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.