హైదరాబాద్‌లో మీ చిరునామా.. మళ్లీ మారుతుంది

Eenadu icon
By Telangana Dist. Desk Published : 20 Dec 2025 05:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: నగరవాసుల చిరునామా మరోసారి మారనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డివిజన్ల పునర్విభజనతో వందకుపైగా కొత్తవి ఏర్పాటయ్యాయి. తద్వారా.. 3వేల కాలనీల చిరునామాలో మార్పు చోటు చేసుకుంది.  ఏడాది తర్వాత మరోసారి రాజధానిలో డివిజన్ల పునర్విభజన జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగణన తర్వాత ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

2027 కీలకం..

పాత జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650చ.కి.మీ. శివారులోని 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్‌లో విలీనం చేయడంతో.. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 2053 చ.కి.మీటర్లకు పెరిగింది. ఇంత పెద్ద నగరాన్ని ఒకే గొడుగు కింద పాలించడం సాధ్యమా అనే ప్రశ్న ప్రభుత్వం ముందుంది. విశాల నగరాన్ని ఒకటిగా ఉంచాలా.. రెండు లేదా మూడు నగరపాలక సంస్థలుగా విభజించాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వాటిపై స్పష్టత వచ్చే వరకు.. ప్రస్తుత గ్రేటర్‌ హైదరాబాద్‌ను కొన్నాళ్లపాటు యథాతథంగా నడిపించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వచ్చే ఏడాది జనవరి నుంచి జన గణన మొదలవుతుంది. 2027లో జనాభా లెక్కలు వస్తాయి. ఆలోపు ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రస్తుతమున్న 300 డివిజన్లకు జరుగుతాయి. జనాభా లెక్కలు వచ్చాక మళ్లీ నిర్వహించే పరిస్థితి వస్తే.. డివిజన్ల సంఖ్యను పెంచి.. ఎన్నికలకు వెళ్లొచ్చు. అప్పుడు నిర్ణయించే డివిజన్ల హద్దులు చాలా కీలకం. 2029లో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికన.. 2027 డివిజన్ల పునర్విభజన ఉంటుందని అధికారుల అంచనా.

మూడ్రోజుల్లో గెజిట్‌

‘‘డివిజన్ల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం శుక్రవారం పూర్తయింది. శని, ఆదివారాల్లో ఆయా ఫిర్యాదులపై తీసుకున్న నిర్ణయాలతో నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. అదే నివేదికను సోమవారం సర్కారుకు పంపించే అవకాశం ఉంది. దాన్ని పరిశీలించి ప్రభుత్వం తుది గెజిట్‌ను విడుదల చేస్తుంది.’’అని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

హద్దుల్లో మార్పు

‘‘శివరాంపల్లిని సులేమాన్‌నగర్‌ డివిజన్‌లో కలపడంపై ప్రజలు పెద్దయెత్తున ఫిర్యాదు చేశారు. భారతీనగర్‌ డివిజన్‌ బీహెచ్‌ఈఎల్‌ చుట్టూ ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఆయా ప్రాంతాలన్నింటినీ ఒకటిగా కలపాలనే విజ్ఞప్తులొచ్చాయి. రెండు డివిజన్లలో ఉన్న విద్యుత్తునగర్‌కాలనీని ఒకే డివిజన్‌లో ఉంచాలని, లింగంపల్లిలోని ఎంఐజీ కాలనీని నల్లగండ్లలో కలపాలని, ఇతరత్రా ఫిర్యాదులు సరైనవిగా తేలాయి. జోనల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులతో ప్రతి ఫిర్యాదుపై చర్చించాం. సరైన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని.. ముసాయిదా గెజిట్‌లోని హద్దులు, పేర్లను సవరించాం.’’అని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కామెర్లను గుర్తించేలా.. క్యాన్సర్‌ని పసిగట్టేలా [ 19-02-2026] మాదాపూర్‌ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన బయోఏషియా సదస్సులో ఆవిష్కరణలు ఆకట్టుకుంటున్నాయి. మధుమేహులకు సౌకర్యంగా ఉండే చెప్పులు... నవజాత శిశువులను తాకకుండానే వారికి పచ్చకామెర్లను కనిపెట్టేలా
  • షరామామూళ్లే.. ముచ్చట ముణ్నాళ్లే [ 19-02-2026] నగరంలోని ఓపెన్‌ జిమ్‌లకు అవినీతి రోగం అంటుకుంది. రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న వ్యాయామ పరికరాలు.. నెలకే విరిగిపోతున్నాయి. అప్పటికే ఇంజినీర్లు, గుత్తేదారులు కలిసి బిల్లులు పంచుకుంటున్నారు.
  • కారు ఖరారు! [ 19-02-2026] ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ పదవులపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యారంటూ హైకోర్టులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు ఆయనను హైకోర్టులో బుధవారం హాజరుపరిచారు.
  • ఆస్తిపన్ను పెరుగుతుందా? [ 19-02-2026] నగరంలో ఆస్తిపన్ను భారీగా పెరుగుతుందా? అంటే.. జీహెచ్‌ఎంసీ సూచనను నిపుణుల కమిటీ ఆమోదిస్తే పెరుగుతుందనే చెప్పవచ్చు. భూ విలువ ఆధారిత పన్ను విధానాన్ని పాత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అమలుకు జీహెచ్‌ఎంసీ ఆసక్తి చూపడమే అందుకు కారణం.
  • కన్నీటి వేదన.. కనిపించని రోదన [ 19-02-2026] ‘‘తనతో విడిపోయి.. మరొకర్ని వివాహం చేసుకుందని కక్షగట్టిన ఓ వ్యక్తి.. మాజీ భార్యను కిరాతకంగా అంతమొందించాడు. నాలుగు నెలల గర్భిణి అని చూడకుండా కత్తితో విచక్షణారహితంగా నరికాడు
  • రాజేంద్రనగర్‌లో హౌసింగ్‌బోర్డు ప్లాట్లు [ 19-02-2026] గ్రేటర్‌ పరిధిలోని హౌసింగ్‌బోర్డు స్థలాలు వేలంలో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోవడమే కాకుండా మంచి ధరలు పలుకుతున్నాయి. బుధవారం రాజేంద్రనగర్‌ లక్ష్మీగూడలోని ప్లాటకు వేలం నిర్వహించగా గరిష్ఠంగా చదరపు గజం రూ.51 వేలు పలికింది.
  • పవిత్ర మాసం.. ఆధ్యాత్మిక సంబరం [ 19-02-2026] ఆకాశంలో కనిపించిన నెలవంక ఆధ్యాత్మిక సౌరభానికి వెలుగు బాటలు వేసింది. ఇకపై నెలపాటు భక్తి పారవశ్యం, ఉపవాసదీక్షలు, దానధర్మాలు, విభిన్న రకాల వంటకాలు, విందులు, రాత్‌బజార్‌లతో నగరంలో పండగ వాతావరణం కనిపిస్తుంది
  • అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు [ 19-02-2026] హైదరాబాద్‌ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టంచేశారు. బుధవారం ఆయన  తన ఛాంబర్‌లో మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి లబ్ధిదారుల ఎంపిక, రెండు పడక గదుల ఇళ్ల పరిస్థితిపై సమీక్షించారు
  • ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు రెండు పడక గదుల నివాసాలు [ 19-02-2026] ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి కమిషనర్‌ చొరవతో భారీ ఊరట దక్కింది.
  • ఉద్యోగుల భవిష్య నిధి సొమ్ము దారి మళ్లించి [ 19-02-2026] మాదాపూర్‌ కావూరి హిల్స్‌లోని ఎనర్జిటిక్‌ పీపుల్‌ ప్రై.లి.  లో భారీ మోసం బయటపడింది. భవిష్యనిధి పేరిట ఉద్యోగుల వేతనాల నుంచి సొమ్ము మినహాయించుకున్నా, ఈపీఎఫ్‌వో (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ)కి జమ చేయలేదని అధికారులు గుర్తించారు.
  • డబ్బు కోసం తండ్రిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి [ 19-02-2026] మద్యానికి బానిసైన కుమారుడు డబ్బు కోసం కట్టర్‌తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన తండ్రి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.
  • ఎమ్మెల్యే వాకౌట్‌.. అధికారులపై ఎంపీ అసహనం [ 19-02-2026] కంటోన్మెంట్‌ బోర్డు సమావేశం బుధవారం గందరగోళం మధ్య అరగంటలో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ మెంబర్‌ వ్యవస్థను మరోసారి కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ సమావేశం ప్రారంభంలోనే వాకౌట్‌ చేశారు.
  • విహారయాత్రలో విషాదం [ 19-02-2026] వారిది ఒకే వయసు.. ఒక ఊరిలో పుట్టి పెరిగారు.. చదువుకొనే రోజుల నుంచి స్నేహితులు.. విహారయాత్రలకు కలిసి వెళతారు.
  • బాంబు బెదిరింపుతో నాంపల్లి కోర్టులో భయాందోళన [ 19-02-2026] నాంపల్లి మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టుకు బుధవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం సుమారు పది గంటలకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. సీబీఐ కోర్టు మెయిల్‌ను పరిశీలించిన ఏవో తీవ్ర ఆందోళనకు గురయ్యారు
  • కుంగుబాటుతోనే బలవన్మరణం! [ 19-02-2026] తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు కొలిక్కివచ్చింది. ఎలాంటి అనుమానాల్లేవని కుటుంబీకులు వాంగ్మూలం ఇచ్చారు.
  • అబ్బురపరిచేలా.. అద్భుతంగా తీర్చిదిద్ది.. [ 19-02-2026] ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని అట్టపెట్టెను పారేస్తుంటాం. కానీ వాటితో మంచాలు, టేబుళ్లు, సోఫాలు, బొమ్మలు కూడా తయారుచేయవచ్చు.
  • 10 అంతస్తులకు మించి అనుమతులకు సిద్ధం [ 19-02-2026] మహానగరంలో మూడు కార్పొరేషన్ల పరిధిలో పది అంతస్తులకు మించి భవనాలు, లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ షురూ చేయనుంది.