వందేళ్ల కాఫీ పండగ.. గిరిజనుల జీవన శైలిని పూర్తిగా మార్చేసిన పంట

- A
- A+
- A++

చింతపల్లి, న్యూస్‌టుడే: కాఫీ.. ఈపేరు చెప్పగానే మన్యం గుర్తొస్తుంది. అతిథి పంటగా అల్లూరి జిల్లాకు వచ్చి గిరిజనుల జీవన శైలిని పూర్తిగా మార్చేసిన ఘనత కాఫీ పంటకే దక్కింది. దీని వెనుక వందేళ్ల చరిత్ర ఉంది. దేశంలో కాఫీపై శాస్త్రీయ పరిశోధనల కోసం కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూర్‌లోని బాలహెన్నూర్‌లో 1925లో కేంద్ర కాఫీ పరిశోధనా స్థానాన్ని ప్రారంభించారు. ఇది నెలకొల్పి 2025 డిసెంబరు నాటికి వందేళ్లు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర కాఫీ బోర్డు పరిశోధన విస్తరణ, బోధన విభాగం శాస్త్రవేత్తలు, అధికారులు సీసీఆర్‌ఐ శతాబ్ది ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20నుంచి 22 వరకూ వీటిని సీసీఆర్‌ఐలో నిర్వహించనున్నారు.
- అల్లూరి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. దీనిపై సుమారు 1.35 లక్షలకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గిరిజనుల ప్రధాన ఆదాయ వనరు 75 శాతం కాఫీగానే మారింది. గిరి రైతులు ఏటా పండించే గింజల విలువ రూ.150 నుంచి 200 కోట్లగా ఉంది. అల్లూరి జిల్లాలో ఏటా గిరిజన రైతులు సుమారు 18,000 టన్నులకుపైగా పంటను ఉత్పత్తి చేస్తున్నారు.]
- ‘గిరిజనుల జీవన శైలిన పరిశీలిస్తే కాఫీసాగుకు ముందు, తరువాత అని బేరీజు వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌లో మాత్రమే ప్రాంతీయ కాఫీ పరిశోధనాస్థానం ఉంది. ఈ ప్రాంత వాతావారణానికి అనుకూలమైన కాఫీ రకాలు, తెగుళ్లు, నివారణ చర్యలు, అధిక దిగుబడులకు రైతులు ఆచరించాల్సిన ఆధునిక విధానాలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తున్నాం. కాఫీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామ’ని పరిశోధనస్థానం అధిపతి సునీల్‌బాబు తెలిపారు.
► Read latest Alluri sitharama raju Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 09:04 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు [ 18-02-2026] మాడ్ డివిజనల్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
- ఉపాధిలో అద్వితీయం! [ 18-02-2026] రాష్ట్రంలో ఉపాధి కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించడంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా పనులు, అంచనాలను గుర్తించి లక్ష్యాలను చక్కగా నిర్దేశించుకోవడంతోనే ఈ ఘనత సాధించినట్లు అధికారులు చెబుతున్నారు.
- ముత్యమంత పసుపు.. ముమ్మరంగా సేకరణ [ 18-02-2026] పసుపు సాగు చేస్తున్న గిరి రైతులకు తీపికబురు. రెండేళ్ల తర్వాత ధర పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ. 140 వరకు పలుకుతోంది. మూడేళ్లుగా రూ.60కి మించి ధర రాకపోవడంతో రైతులు నష్టపోయారు
- పడవ చూస్తే గుబులు.. ప్రయాణమంటే గుండె గుభేలు [ 18-02-2026] మత్స్యగెడ్డపై రాకపోకలకు గిరిజనులు నడుపుతున్న పడవ దెబ్బతినడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుజనకోట పంచాయతీ పరిధిలోని 14 గ్రామాల గిరిజనులు మత్స్యగెడ్డ దాటేందుకు నాటు పడవలు ఆశ్రయించేవారు.
- రీసర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు [ 18-02-2026] ఉమ్మడి అల్లూరి జిల్లాలో తహసీల్దార్ల లాగిన్‌లో రీసర్వేకు సంబంధించి పెండింగ్ ఉన్న సమస్యలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు.
- మినీ ఆరోగ్య కేంద్రాలుగా అంగన్‌వాడీలు [ 18-02-2026] అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రథమ చికిత్స అందించేందుకు వీటిని మినీ ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దారు. వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
- అచ్యుతాపురంలో భారీ అగ్ని ప్రమాదం [ 18-02-2026] అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) రోడ్డులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని మోసయ్యపేటకు చెందిన కోన వెంకటరావు పూడిమడక రోడ్డులో దుకాణం అద్దెకు తీసుకుని కేఆర్ మార్ట్ పేరుతో కిరాణా, ప్లాస్టిక్, స్టేషనరీ, హౌస్‌కీపింగ్ సామగ్రి విక్రయించే దుకాణం నడుపుతున్నారు.
- మృత శిశువు జననం [ 18-02-2026] చింతపల్లి ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే గర్భశోకం ఉండేది కాదని గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ కడుగుల గ్రామానికి చెందిన సాగిన పూర్ణసత్యనారాయణ, కల్యాణి దంపతులు మంగళవారం విలపించారు
- కోర్టు హాల్లో కుప్పకూలిన మహిళ [ 18-02-2026] కుటుంబ గొడవల నేపథ్యంలో మంగళవారం వాయిదాకు హాజరైన మహిళా కక్షిదారురాలు కోర్టు హాల్లోనే కుప్పకూలిపోవడంతో ప్రధాన కుటుంబం న్యాయస్థానం న్యాయమూర్తి కె.రాధారత్నం స్పందించారు.