స్వామీ... పట్టించుకోరేమి?

- A
- A+
- A++

చింతలపూడి, న్యూస్‌టుడే: గత పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు, స్థానిక నేతల అత్యుత్సాహం వెరసి చింతలపూడి ప్రజల ఆరాధ్యదైవం వేగిలింగేశ్వరస్వామికీ కష్టాలు కొని తెచ్చాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు నిత్యకల్యాణం పచ్చతోరణంగా భక్తులతో కళకళలాడుతుండేది. స్వామివారికి ఉన్న స్థిరాస్తులపై వచ్చే ఆదాయంతో పండగలు, ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. ప్రస్తుతం నిత్యధూపదీప నైవేద్యాలకూ ఇబ్బందులు తప్పటం లేదు.
గత పాలకుల నిర్ణయాలతో..
1992లో అప్పటి ప్రభుత్వం వేగిలింగేశ్వరస్వామి ఆలయానికి ఉన్న భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేసింది. అప్పట్లో ఉన్న అధికారులు, నాయకులు కలిసి వీటికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని భక్తులు, ఆలయ ధర్మకర్తల మండలిని నమ్మించి పనికానిచ్చేశారు. ఆలయానికి భట్టువారిగూడెం వద్ద ఉన్న 6.52 ఎకరాలు, కాంతంపాలెం రోడ్డులోని 2.20 ఎకరాలు, వెలమపేట వద్ద ఉన్న 4 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. ఈ ఆలయానికి ఎదురుగాను, దీనికి అనుసంధానంగా ఉన్న వీరమ్మ పేరంటాలు ఆలయానికి చెందిన 2.40 ఎకరాల భూమి కూడా ప్రభుత్వం తీసుకుంది. స్వాధీనపరచుకున్న ఆ భూముల్లో బలహీన వర్గాలకు కాలనీలు నిర్మించారు.
33 ఏళ్లు అవుతున్నా..ఈ తతంగం జరిగి సుమారు 33 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా స్వామివారి ఆలయానికి పరిహారం అందలేదు. ఈ భూముల్లో మెరక, మాగాణి కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ ఎకరం రూ.30 లక్షలు పైచిలుకే ఉంది. ప్రస్తుతం ఆలయానికి రేచర్లలో అరెకరం, కాంతంపాలెంలో సుమారు 2 ఎకరాలు, సమ్మెటవారిగూడెంలో 1.5 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.26 వేలు ఆదాయం వస్తోంది. ఆలయం ఎదురుగా భక్తుల సహకారంతో మూడు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అరకొరగా ఆదాయం వస్తోంది. ‘ఈ ఆలయ భూములను గతంలోనే పేదలకు పంచారు. దీనికి సంబంధించిన పరిహారం విడుదల కాలేదు. ఈ విషయం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది’. అని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ చెప్పారు.
► Read latest West godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పేరుకు వర్గోన్నతి.. వసతుల్లో దుర్గతి! [ 19-02-2026] వాసవీ పెనుగొండ మండలం చినమల్లం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అసంపూర్తి భవనం ఇది. వర్గోన్నతి పొందిన ఈ పాఠశాలలో 9వ తరగతి వరకు 74 మంది విద్యార్థులున్నారు. ‘నాడు-నేడు’లో చేపట్టిన భవనం నిర్మాణం పూర్తి కాలేదు.
- ఓపిక పట్టాల్సిందే! [ 19-02-2026] పాలకోడేరుకు చెందిన రంగబాబు అనే వృద్ధుడు ఆయాసంతో బాధపడుతూ భీమవరం ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చారు.
- ఏసీలు పనిచేయక.. ఫ్యాన్లు తిరగక [ 19-02-2026] రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫ్యాన్, లేదా ఏసీ లేనిదే ఉండలేని పరిస్థితి. ఇక రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆసుపత్రులకు వచ్చేవారు ఫ్యాన్ కింద బెడ్ దొరికితే చాలనుకుంటున్నారు.
- చిన్నారి తల్లులు [ 19-02-2026] ఇటీవల జరిపిన ‘పాపులేషన్ మేనేజ్‌మెంటు సర్వే 2025-26’లో జిల్లా అత్యధిక కౌమార గర్భధారణలు జాబితాలో ఉన్నట్లు తెలింది. తీవ్రత 12-15 శాతం ఉంటే ప్రమాదకరం, 10-12 శాతంగా ఉంటే అత్యంత ఎక్కువ. ఏలూరు జిల్లా 10-12%లో ఉంది.
- బెయిల్‌పై వచ్చి.. చోరీకి పాల్పడి [ 19-02-2026] ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా పొన్నూరు పరిధి చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాతృమూర్తి ప్రమీలాదేవి ఇంట్లో రూ.70 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయిన విషయం తెలిసిందే.
- కలత తీరేలా.. కలల ఇల్లు కట్టేలా! [ 19-02-2026] తిండి తిన్నా.. తిన్నకున్నా.. మంచి వస్త్రం కట్టినా.. కట్టకున్నా.. తల దాచుకునేందుకు గూడు ఉండాలన్నది సగటు పేద, మధ్య తరగతి ప్రజల కల. అల్పదాయ వర్గాలకు ఇల్లు అందని ద్రాక్షవుతోంది.
- నమ్మించి.. నిలువునా ముంచేసి.. [ 19-02-2026] ఉద్యోగాల పేరుతో దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దందాలో చిక్కుకున్న బాధితుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది.
- షార్ట్‌సర్క్యూట్‌తో పేలిన ఫ్రిజ్ [ 19-02-2026] విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ ప్రభావంతో ఇంట్లో ఫ్రిజ్ పేలిపోగా గది ధ్వంసమైంది. ఇతర గృహోపకరాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.