Andhra News: విశాఖ, విజయవాడల్లో పీపీపీ రోడ్లు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 20 Dec 2025 06:30 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో నగరాల్లో రహదారులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నంలలో ప్రయోగాత్మకంగా 112 కిలోమీటర్ల మేర రోడ్లను రూ.478 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పురపాలకశాఖ త్వరలో బిడ్లు (ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానించనుంది. నాణ్యత, పనుల్లో పారదర్శకత, దీర్ఘకాలిక నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలన్నది లక్ష్యం. పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు ‘యాన్యుటీ మోడల్‌’లో తిరిగి చెల్లింపులు చేయనున్నారు. దశల వారీగా మిగిలిన నగరాల్లోనూ ఇదే విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరపాలక సంస్థల్లో చుట్టూ ఉన్న మున్సిపాల్టీలు, పంచాయతీలను విలీనం చేయడంతో కొత్త కాలనీలు వెలిశాయి. అయితే నిధుల కొరతతో ఈ ప్రాంతాలకు రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడం సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో తొలుత రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద నగరాలైన విశాఖపట్నం, విజయవాడల్లో ప్రయోగాత్మక అమలుకు అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలను రెండు రోజుల క్రితం ఆమోదించింది.  

నగరపాలక సంస్థలు రోడ్ల నిర్మాణ వ్యయంలో తొలి ఏడాది 40% నిధులే గుత్తేదారు సంస్థలకు చెల్లించనున్నాయి. మిగిలిన 60% నిధులు తొమ్మిదేళ్లలో జమ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు నిర్వహించనున్నాయి. యాన్యుటీ మోడల్‌లో పనుల నిర్వహణకు ఆసక్తిగల సంస్థలనే బిడ్లు వేయాలని పురపాలకశాఖ ఆహ్వానించనుంది. కొన్ని పెద్ద సంస్థలు ఇందుకు సుముఖత వ్యక్తం చేశాయని తెలిసింది. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టును డిజైన్‌ చేశారు.

రోడ్లతోపాటు కల్పించే సౌకర్యాలు

  • ఫుట్‌పాత్‌లు, మీడియన్లు, వర్షపునీటి కాలువల అభివృద్ధి 
  • వీధి దీపాల ఆధునికీకరణ 
  • యుటిలిటీ డక్టుల ఏర్పాటు 
  • సూచిక బోర్డులు, మార్కింగ్‌ వంటి భద్రత ఏర్పాట్లు 
  • బెంచీలు, చెత్త బుట్టలు, బయో టాయిలెట్లు 
  • వాహనాల ప్రత్యేక పార్కింగ్‌ బేస్, హాకర్‌ జోన్లు

పదేళ్లలో రోడ్ల నిర్వహణ ఇలా

  • రోడ్లపై గుంతలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు 
  • పచ్చదనం, వీధి దీపాల నిర్వహణ.. కాలువల శుభ్రత 
  • రోడ్డు మార్కింగ్, లేన్ల నిర్వహణ, పునరుద్ధరణ.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ యూనిట్‌ హీటింగ్, వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ (హెచ్‌వీఏసీ) రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు లీజ్‌ డీడ్‌పై సంతకం చేసింది.
  • ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితురాలి (ఏ6)గా ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ఆమె దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • ఇళ్ల స్థలాల కోసం 4 లక్షల దరఖాస్తులు మండలిలో వైకాపా సభ్యుల గందరగోళం నడుమ ఛైర్మన్‌ మోషేను రాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రెండు ప్రశ్నలకు మాత్రమే మంత్రులు సమాధానం ఇచ్చే అవకాశం వచ్చింది. మంగళవారం మండలి ప్రారంభమైన వెంటనే వైకాపా సభ్యులు నిరసనలు, నినాదాలతో సభ నిర్వహణకు పదేపదే అడ్డుపడ్డారు. 
  • అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‘‘వైకాపా ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఒక్క బీసీకీ రుణం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీలకు పునర్వైభవం వచ్చింది.
  • ఏపీకి నాయకత్వం వహించే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నాయకత్వం వహించే ప్రాంతంగా ఉత్తరాంధ్ర తయారవుతోందని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి పేర్కొన్నారు.
  • వైకాపా పాలకులు జేబులు నింపుకొన్నారు వైకాపా ప్రభుత్వంలో సామాన్య ప్రజలను పట్టించుకోకుండా జేబులు నింపుకోవడానికే నేతలు ప్రాధాన్యం ఇచ్చారని శాసనసభ్యులు విమర్శించారు. శాసనసభలో మంగళవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్యే మాట్లాడారు.
  • శ్రీవారి మహాప్రసాదం కల్తీ ఘోర అపరాధం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి  వైకాపా ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వినియోగించడంపై మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
  • శ్రీవారి లడ్డూ నాణ్యత విషయంలో రాజీ లేదు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రత కాపాడటమే ధ్యేయంగా నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు తితిదే మంగళవారం ప్రకటించింది.
  • కల్తీ నెయ్యిని కప్పిపుచ్చేందుకు వైకాపా కుట్ర తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం శాసనమండలిని కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లకు దారి తీసింది.
  • గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేశాం రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని, ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా సాగే అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
  • అమరావతిలో హజ్‌హౌస్‌! రాజధాని అమరావతిలో హజ్‌హౌస్‌ను నిర్మించనున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. సీఆర్‌డీఏ పరిధిలోని 10 ఎకరాల్లో నిర్మించనున్న ఇస్లామిక్‌ సెంటర్‌కు అనుబంధంగా హజ్‌హౌస్‌ ఉంటుందని వెల్లడించారు.
  • విద్యుత్తు ప్రమాదాల నివారణకు రూ.10 కోట్లు విద్యుత్తు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రత చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయించిందని విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.
  • తరగతికి ఒక ఉపాధ్యాయుడు గతంలో 3 శాతం పాఠశాలల్లో మాత్రమే తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉంటే ఇప్పుడు దాన్ని 33 శాతం పాఠశాలలకు పెంచామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.
  • ఇంటింటికీ వైద్యం మేమూ అందించాం వైకాపా హయాంలో తాము ఇంటింటికీ వైద్యం అందించామని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదీ అదే తప్ప కొత్తదేమీ కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
  • విధులు నిర్వర్తించని ఎమ్మెల్యేలను రీ-కాల్‌ చేయాలి సాఫ్ట్‌వేర్, సాంకేతిక సమస్య కారణంగా మైకులు పనిచేయనందునే మంగళవారం ఉదయం శాసనసభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
  • ఉపసభాపతి వ్యాఖ్యలతో నవ్వులు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో శాసన సభలో మంగళవారం నవ్వులు విరిశాయి. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్‌ మాట్లాడుతూ.. ‘‘జనాభా తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
  • రూ.150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు గోదావరి డెల్టాకు అత్యంత కీలకమైన ధవళేశ్వరం బ్యారేజీలో దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఈ సీజన్‌లోనే చేపట్టనున్నట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
  • ఆదరణ 3.0 ద్వారా పారిశ్రామికవేత్తలుగా బీసీలు ఆదరణ 3.0 పథకం కింద బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.
  • సంక్షిప్తవార్తలు (11 ) తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన పరిపూర్ణ జీవితం గడపాలని ఎక్స్‌ వేదికగా మంగళవారం ఆకాంక్షించారు.