Journalist Propose: పుతిన్‌ ముందే.. ప్రియురాలికి ప్రపోజ్‌ చేసిన జర్నలిస్టు

Eenadu icon
By International News Team Updated : 20 Dec 2025 12:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విలేకరుల సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పుతిన్‌ ముందే ఓ యువ జర్నలిస్టు.. తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు (Journalist Proposes To Girlfriend In front of Putin). దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్‌ అవుతోంది. అసలేం జరిగిందంటే..

విలేకరుల సమావేశంలో పాల్గొన్న పుతిన్‌ను రిపోర్టర్‌లు పలు ప్రశ్నలు అడగ్గా.. అధ్యక్షుడు బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్‌ బజానోవ్‌ (Kirill Bazhanov) అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. అతడు ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకొని.. పుతిన్‌ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. కిరిల్‌ మాట్లాడుతూ.. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్‌ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నాడు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. అనంతరం అతడు పుతిన్‌ ( Vladimir Putin)తో మాట్లాడుతూ.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 

  • ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుపోతున్నాం: పుతిన్‌

ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్‌ హోస్ట్‌ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్‌ బజానోవ్‌ ప్రపోజల్‌ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్‌తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. తన వివాహ వేడుకకు హాజరుకావాలని కిరిల్‌ పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై అధ్యక్షుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే, కిరిల్‌కు ఆర్థికసాయం ప్రకటించారు. ‘కిరిల్‌ యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తంచేశాడు. అది నిజమే. ఇప్పుడు మనం విరాళాలతో అతడి పెళ్లికి కావాల్సిన డబ్బును సేకరించాలి’ అని అన్నారు. 


► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 07:47 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చర్చలు సాగిస్తూనే.. పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాలు..! Iran-USA అమెరికా- ఇరాన్‌ల మధ్య అణుఒప్పందానికి సంబంధించి ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 24 గంటల్లో అగ్రరాజ్యం దాదాపు 50 అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమాసియాలో మోహరించింది.
  • మాకు పింఛన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పింఛన్లు తీసుకోరాదని వారు నిర్ణయించారు.
  • అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్‌ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్‌ జెస్సీ ఎల్‌.జాక్సన్‌ మంగళవారం మరణించారు.
  • భారత్‌ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్‌ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ స్పష్టం చేశారు.
  • బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్‌ రహమాన్‌ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
  • సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్‌ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైనట్లయింది.
  • విన్యాసాలకు హర్మూజ్‌ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్‌ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.
  • అమెరికా ఐస్‌ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్‌ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్‌ ఎం.లించ్‌ ఎరీనాలో జరిగింది.
  • శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది. 
  • ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.