ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు.. నిందితుడిని కాల్చేసిన స్థానికుడు

Eenadu icon
By International News Team Updated : 16 Oct 2026 08:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Shooting in US School | ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో చిన్నపిల్లలే లక్ష్యంగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఓరెగన్‌ రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో చిన్నారులపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ స్థానిక వ్యక్తి ఈ ఘాతుకాన్ని గుర్తించి ధైర్యంగా నిందితుడిపై ఎదురుకాల్పులు జరిపారు. అప్పటికే దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting in US School) ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు స్థానికుడి ఎదురు కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు.

బెండ్‌ ప్రాంతంలోని ఈ ఎలిమెంటరీ స్కూల్‌లోకి గురువారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో దుండగుడు తుపాకీతో చొరబడ్డాడు. గేటు నుంచే కాల్పులు జరుపుతూ లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి నిందితుడిని చూశారు. జరగబోయే ప్రమాదాన్ని ఊహించి.. వెంటనే తన వద్ద ఉన్న లైసెన్సెడ్‌ తుపాకీతో కాల్చారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగుడు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

  • అమ్మో.. ఆ తుపాకీ పని చేసి ఉంటే!

ఘటన సమయంలో స్కూల్‌లో 400 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. స్థానిక వ్యక్తి ధైర్యంగా దుండగుడిపై కాల్పులు జరపకపోయి ఉంటే.. భారీ మారణహోమమే జరిగి ఉండేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిని 16 ఏళ్ల టీనేజర్‌గా గుర్తించారు. కాల్పులు వెనుక ఉద్దేశమేంటీ? స్కూల్‌తో అతడికి సంబంధం ఉందా? లేదా? అన్న విషయాలు తెలియరాలేదు.

ఇటీవల ఇల్లినోయీలోని ఓ హిందూ ఆలయంపై దాడికి కుట్ర జరిగిన సంగతి తెలిసిందే. భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఓ 19ఏళ్ల యువకుడు కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నాడు. అయితే, రైఫిల్‌ జామ్‌ అవడంతో పెను ముప్పు తప్పింది. ఈ కుట్ర వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే.. తాజాగా స్కూల్‌లో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 08:16 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇరాన్‌ ‘అణు’చివేతకు మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌! అమెరికా అమ్ములపొదిలో శక్తిమంతమైన సంప్రదాయ ఆయుధం మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ (ఎంవోఏబీ) మరోసారి తెరపైకి వచ్చింది.
  • పాక్‌లో కూలిన స్కూల్‌ పైకప్పు.. 34 మంది చిన్నారుల మృతి పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 34 మంది చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
  • అతి త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందానికి సంబంధించి కీలక అంశాలపై చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని మన దేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తెలిపారు.
  • ఆస్పత్రి నుంచే పని ప్రారంభించిన పోప్‌ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ కణితి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో - 14 బాగా కోలుకున్నారని, ఆయన గురువారం ఆస్పత్రి నుంచే పనిచేయడం ప్రారంభించారని చికిత్స అందించిన వైద్యులు, వాటికన్‌ అధికారులు వెల్లడించారు.
  • అమ్మో.. ఆ తుపాకీ పని చేసి ఉంటే! అమెరికా ఇల్లినోయీలోని అరోరాలో ఉన్న హిందూ దేవాలయంలో పెను ముప్పు తప్పింది. హిందూ మతంపై ద్వేషంతో కాల్పులు జరిపి పలువురిని హతమార్చాలని భావించిన అమెరికా టీనేజర్‌ తుపాకీ చివరి నిమిషంలో పని చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
  • మదీనాపై దాడి యత్నం తిప్పికొట్టాం: సౌదీ పవిత్ర మదీనా నగరంపై క్షిపణి దాడికి జరిగిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టామని సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి గురువారం వెల్లడించింది. అయితే ఈ దాడికి బాధ్యులెవరన్నది కూటమి పేర్కొనలేదు.
  • యెమెన్‌ ప్రభుత్వ భవనంపై హూతీల క్షిపణి దాడులు యెమెన్‌లో హూతీ తిరుగుబాటు దారులు మరోసారి విరుచుకుపడ్డారు. పోర్టు నగరమైన ఏడెన్‌లో ఉన్న ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ లక్ష్యంగా క్షిపణి దాడులు జరిపారు.
  • హర్మూజ్‌లో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు! హర్మూజ్‌ జలసంధిలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. సీమైన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC) వెల్లడించింది.
  • కుప్పకూలిన పాఠశాల పైకప్పు.. 34 మంది విద్యార్థులు మృతి పాకిస్థాన్‌ (Pakistan)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి (school roof collapses) 34 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.
  • పుతిన్‌ కోసమే స్టార్‌ ‘లింక్‌ తెగిందా’.. అమెరికా ప్రభుత్వం చేతిలో కీ..! Elon Musk-Starlink: శాటిలైట్ ఆధారిత స్టార్‌లింక్ (Starlink) సేవల భారత్‌ ప్రవేశ జాప్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
  • యువ జిమ్నాస్ట్‌ల నగ్న వీడియోలు చిత్రీకరించిన కోచ్‌.. 90 ఏళ్ల జైలు యువ జిమ్నాస్ట్‌ (young gymnasts)ల నగ్న వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన కోచ్‌కు అమెరికా (USA) న్యాయస్థానం 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
  • పడేనా ట్రంప్‌ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
  • కోలుకుంటున్న పోప్‌ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్‌ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్‌ మేరీ మిల్బెన్‌ ఆరోపించారు.
  • ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే... ఎలాన్‌ మస్క్‌ కూడా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్‌ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్‌ బుధవారం పేర్కొంది.