భారత్‌లో జప్తు చేయలేని పథకాలివే..

Eenadu icon
By Business News Team Published : 16 Oct 2026 15:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

చాలా మంది ఏదో ఒక సమయంలో బ్యాంకుల్లో గానీ, ఏవైనా రుణ సంస్థల వద్ద గానీ రుణాలు తీసుకోవడం సాధారణమే. అది వ్యక్తిగత రుణం, వాహన రుణం, ఇంటి రుణం లేదా ఏదైనా ఇతర రుణం కావచ్చు. చాలా సార్లు రుణగ్రహీతలు సక్రమంగానే ఈఎంఐలను చెల్లిస్తూ ఉండొచ్చు. కానీ, కొన్నిసార్లు వారు ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఏర్పడి రుణ డిఫాల్టర్స్‌ అయిపోవచ్చు. అలాంటప్పుడు రుణ సంస్థలు ఆ రుణ బకాయిలను రికవరీ చేసుకోవడానికి కోర్టు ద్వారా వారికున్న ఆస్తులపై లేదా ఇతర పొదుపు పథకాలపై గురిపెడతాయి. అయితే, కొన్ని ఆస్తులపై రికవరీ అస్త్రం ప్రయోగించడానికి లీగల్‌గా నిబంధనలు అడ్డురావచ్చు లేదా చాలా ఆలస్యం కూడా కావచ్చు. అటువంటి సందర్భంలో డిఫాల్ట్‌దారుడి ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ ఖాతాల్లో ఉన్న వారి పొదుపులను లేదా బీమా ద్వారా పొందిన నగదుపై కోర్టు ద్వారా రుణ రికవరీ చేసుకోవచ్చా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

రక్షణ

రుణాలు చెల్లించడంలో జాప్యం జరిగినప్పుడు, బ్యాంకులు/రుణ సంస్థలు లేదా రుణాలు ఇచ్చిన వ్యక్తులు మీ EPF/PPF ఖాతాల్లో ఉన్న డబ్బును కోర్టు ద్వారా తీసుకోవచ్చా అని సందేహం వస్తుంది. ముఖ్యంగా, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఖాతా వీరి అవసరాలకే గానీ, ఇతరులకు కాదు అని గుర్తించాలి. చాలా మందికి పోస్ట్ ఆఫీస్ PPF ఖాతా కూడా ఉండొచ్చు. దీనిపై కూడా సదరు ఖాతాదారుడికే హక్కు ఉంటుంది. EPF చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక సభ్యుని EPF ఖాతాలో ఉన్న నగదును, ఆ సభ్యుడు తీసుకున్న రుణాలు లేదా గ్యారెంటర్‌ వంటి బాధ్యతల కోసం కోర్టు ఉత్తర్వుల ద్వారా జప్తు చేయడానికి వీలు లేదు. 'గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్' కింద PPF ఖాతాలోని నిల్వలకు కూడా ఇలాంటి రక్షణే లభిస్తుంది. EPF చట్టంలోని సెక్షన్ 10 ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. రుణం ఇచ్చిన రుణసంస్థ కోర్టు నుంచి ఉత్తర్వులను పొందినప్పటికీ, ఆ కారణంతో సభ్యుని EPF ఖాతాలోని డబ్బును జప్తు చేయలేదు. ఈ చట్టం కల్పించే రక్షణ..పెన్షన్, ఇన్సూరెన్స్ పథకాల ద్వారా పొందే కొన్ని మొత్తాలకు కూడా వర్తిస్తుంది. ఈ రిటైర్మెంట్ పొదుపు పథకాలకు సంబంధించి, చట్టం ఖాతాదారులకు గణనీయమైన రక్షణ కల్పించింది.

ఒకవేళ మీరు ఇప్పటికే EPF ఖాతా నుంచి నగదును ఉపసంహరించుకుని ఉంటే, పరిస్థితి వేరేగా ఉండొచ్చు. PF ఖాతా నుంచి నగదు బయటకు వచ్చి, సాధారణ బ్యాంక్ ఖాతాలోకి చేరినప్పుడు, దానికి పాత రక్షణ వర్తించకపోవచ్చు. అటువంటి సందర్భాలను, రికవరీ చర్యల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రత్యేకంగా పరిశీలిస్తాయి. 

ఎన్‌పీఎస్‌

పింఛను నిధి నియంత్రణ అభివృద్ధి అథారిటీ(PFRDA) చట్టం, 2015 ప్రకారం, NPS టైర్ 1 ఖాతాలో ఉన్న పొదుపు సొమ్ముకు కోర్టు జప్తు నుంచి రక్షణ ఉంటుంది. అంటే, రుణాల చెల్లింపులు విఫలమైన పక్షంలో, బకాయిలను వసూలు చేయడానికి బ్యాంకులు ఈ పథకంలో పొదుపు చేసిన నగదును తీసుకోలేదు. 

'మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ'(MWP) చట్టం

1874 నాటి 'మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ'(MWP) చట్టంలోని సెక్షన్ 6..భార్య, పిల్లల కోసం తీసుకున్న జీవిత బీమా పాలసీకి రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం కింద పాలసీని కొనుగోలు చేసినట్లయితే, బీమా ద్వారా వచ్చే మొత్తం నేరుగా కుటుంబ సభ్యులకే అందుతుంది. పాలసీదారుడికి రుణాలు ఉన్నప్పటికీ, బ్యాంకులు ఈ బీమా సొమ్మును క్లెయిం చేయడానికి వీలుండదు.

రుణ సంస్థ పరిస్థితి/రికవరీ ఎలా..

రుణగ్రహీతలు..చట్టం కల్పించిన ఈ రక్షణను, ప్రతిదానికీ పూర్తి రక్షణ కవచంగా తప్పుగా ఉపయోగించుకోలేరు. ఒక రుణ సంస్థ ఆ నిర్దిష్ట రుణ బకాయిల కోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన ఇతర మార్గాల ద్వారా కూడా బకాయి వసూలును చేపట్టవచ్చు. కేసును బట్టి; కోర్టు విచారణలు, చట్టం ద్వారా ప్రత్యేకంగా రక్షణ లేని ఇతర ఆస్తులపై బలవంతపు చర్యలు కూడా ఉండవచ్చు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. EPF/PPF ఖాతాల ద్వారా వచ్చిన నగదుతో కొనుగోలు చేసిన ప్రతి ఆస్తికి దానంతట అదే రక్షణ ఉండకపోవచ్చు.

మీ EPF లేదా PPFను సాధారణంగా జప్తు చేయలేరని తెలిసినంత మాత్రాన, రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత తొలగిపోదు. రుణ ఒప్పందం, వర్తించే చట్టం ప్రకారం వడ్డీ, ఆలస్య చెల్లింపుల పరిణామాలు, ఇతర వసూలు చర్యలు కొనసాగవచ్చు. కాబట్టి, బకాయి చెల్లింపులు తప్పించుకోవడానికి ఈ రక్షణను ఒక కారణంగా ఎవరూ కూడా ఉపయోగించుకోకూడదు. EPF, PPF వంటి నిధులను రక్షించడం వెనుక ఉన్న చట్టపరమైన ఉద్దేశం..కుటుంబ ఆర్థిక స్థితులను కొంతమేరకు కాపాడడానికే తప్ప, రుణగ్రహీతలు రుణ సంస్థలను మోసం చేయడానికి ఇవి సహాయపడేవి కావని గుర్తించాలి.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మార్కెట్‌ పడితే ఏం చేయాలి? స్టాక్‌ మార్కెట్లలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న వేళ.. స్వల్పకాలిక మార్పులను చూసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ సాధనాల్లో విభజించుకోవాలని చెబుతున్నారు.
  • ఆరోగ్య బీమా పునరుద్ధరణ వేళలో... ఆరోగ్య బీమా పాలసీ పునరుద్ధరణ గడువు రాగానే చాలామంది ప్రీమియం చెల్లించి, సరిపెట్టుకుంటారు. గతంలో తీసుకున్న బీమా ఇప్పుడు సరిపోతుందా? ప్రీమియం ఎందుకు పెరిగింది? చికిత్స సమయంలో సొంతంగా ఎంత ఖర్చు చేయాల్సి వస్తోంది?
  • మీ డబ్బు విలువ తగ్గనీయకండి కూరగాయలు, పాలు, మందులు, పిల్లల చదువు, ఇంటి అద్దె.. ఇలా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉంటాయి. వచ్చిన ఆదాయం ఖర్చులకే సరిపోతే చేతిలో మిగిలే మొత్తం ఏమీ ఉండదు.
  • టర్మ్ ఇన్సూరెన్స్ కొంటున్నారా?ఈ తప్పులు చేయొద్దు.. సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడంలో మీకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
  • క్రెడిట్ కార్డు లేకుండా క్రెడిట్ స్కోరును పెంచుకోవడం సాధ్యమేనా.. క్రెడిట్ కార్డ్ లేకుండా మంచి క్రెడిట్‌ స్కోరు ఎలా సాధించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
  • బహుళ ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకోవాలి? ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని ఉద్యోగం ద్వారా మాత్రమే కాకుండా, అనేక ఇతర మార్గాల ద్వారా ఎలా సృష్టించుకోవాలో కూడా తెలుసుకోవాలి.
  • ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత? ప్లెక్సీ-క్యాప్‌ ఫండ్స్‌ అంటే, వివిధ రకాల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గల కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఫండ్లు. ఇవి లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి.
  • పూర్తి క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించట్లేదా? క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లిస్తే పొందే ప్రయోజనాలు, కనీస మొత్తం చెల్లిస్తే కలిగే ప్రతికూలతలతో పాటు పాక్షిక చెల్లింపుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
  • వడ్డీ రేటు పెంపు మన వ్యూహం మారాలి సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మార్కెట్లో ఉన్న పాత బాండ్ల ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా మధ్య, దీర్ఘకాలిక బాండ్‌ పథకాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
  • పాలసీ మధ్యలోనే ఆపేస్తే జీవిత బీమా పాలసీని గడువు తీరకముందే మధ్యలోనే రద్దు చేసుకుంటే, ఇప్పటివరకూ చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి రాదు. పాలసీ నిబంధనల ప్రకారం లెక్కించే ‘స్వాధీన విలువ (సరెండర్‌ వాల్యూ)’ మాత్రమే అందుతుంది.
  • వాహన బీమా తరుగుదల భారం తగ్గేలా! కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు వాహన బీమా తీసుకోవడం తప్పనిసరి. సాధారణ సమగ్ర బీమాలో ప్రమాదం వల్ల దెబ్బతిన్న విడిభాగాల మొత్తం విలువ పరిహారంగా అందకపోవచ్చు. వాహనం వయసును బట్టి, వాటి విలువలో తరుగుదల లెక్కిస్తారు.
  • ఆర్థిక ప్రణాళిక వాయిదా వేస్తున్నారా? సొంతిల్లు కొనాలన్నా, పిల్లల ఉన్నత చదువులకు డబ్బు సమకూర్చాలన్నా.. ఉద్యోగం మారేటప్పుడు మనం ఎంతో ముందుగానే ఆలోచిస్తాం. కానీ, మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే సమగ్ర ఆర్థిక ప్రణాళిక విషయానికి వచ్చేసరికి మాత్రం చాలామంది ‘తర్వాత చూద్దాంలే’ అని వాయిదా వేస్తుంటారు.
  • గరిష్ఠ రాబడుల కోసం మీ పెట్టుబడులను ఎలా విభజించాలి? పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు కేవలం ఒకే రకమైన పెట్టుబడిపై పూర్తిగా ఆధారపడకూడదు. అది ఎందుకో ఇక్కడ చూద్దాం.
  • మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలా? ఇవి తెలుసుకోండి మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు కేవలం రాబడులనే కాకుండా, ఫండ్లకు సంబంధించి కొన్ని కీలక అంశాల గురించి తెలుసుకోవాలి.
  • బంగారు ఆభరణాలపై బీమా ఎందుకు? బంగారు ఆభరణాలపై బీమా, ఎందుకు తెలివైన నిర్ణయమో ఇక్కడ తెలుసుకుందాం.
  • క్రెడిట్ స్కోరు మెరుగ్గా లేకపోవడానికి కారణాలివే.. మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడకపోవడానికి అనేక కారణాలుంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
  • స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే.. దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్‌ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.
  • టర్మ్‌ బీమా ఎంతుంటే ధీమా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనుకునే ప్రతి ఒక్కరికీ టర్మ్‌ పాలసీ ఎంతో కీలకం. కానీ, పాలసీ తీసుకునే సమయంలో వేసుకోవాల్సిన ప్రశ్న ‘కచ్చితంగా బీమా తీసుకోవాలా?’ అని కాదు.. ‘ఎంత కవరేజీ తీసుకుంటే కుటుంబానికి నిజమైన రక్షణ లభిస్తుంది?’ అనేది.
  • మ్యూచువల్‌ ఫండ్లు సంఖ్య పెరిగితే లాభమేనా? మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ‘ఒకదానిలోనే మొత్తం డబ్బు ఎందుకు? నాలుగైదు పథకాల్లో పెడితే నష్టభయం తగ్గుతుంది’ అనుకోవడం సహజం.
  • కాస్త వాయిదా వేద్దాం.. జీతం చేతికి రాగానే ఎన్నో ఖర్చులు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, నిత్యావసరాలు.. ఇవన్నీ పోను  మిగిలిన డబ్బుతో కొత్త ఫోన్‌ కొనాలనిపిస్తుంది.